
సినీ విమర్శకుడు, ఇటీవల ‘బిగ్‌బాస్’ షో ద్వారా పాపులర్ అయిన మహేశ్ కత్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎగిసే తారాజువ్వలు’. యశ్వంత్, హాసిని, సౌమ్యా వేణుగోపాల్, అజయ్ ఘోష్, లోహిత్, స్వప్న, అప్పాజీ అంబారిష్ఠ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాణి ఇరగం సమర్పణలో నాగ మల్లారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ పాటలను విడుదల చేశారు.
దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, శేఖర్ కమ్ముల, రచయిత చిన్నికృష్ణ తొలి పాటను, దర్శకుడు ఇంద్రగంటి, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, గీతాకృష్ణ, శ్రీనివాస్‌రాజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘చదువంటే బట్టీ పట్టడం కాదు.. జీవితాన్ని వడేసి పట్టడం’ అనే అంశాన్ని వినోదాత్మకంగా, సున్నితంగా మా సినిమాలో చెప్పాం’’ అన్నారు మహేశ్ కత్తి. ‘‘ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు నాగ మల్లారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment