yashwanth
-
కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి
గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభాశెట్టి. అంతకు ముందు 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కనబెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయిన 'బిగ్ బాస్' జోడీ)'కార్తీకదీపం' సీరియల్లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలో తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. దీనితో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టింది.ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజు గిఫ్ట్ ఇచ్చింది అంటే పెళ్లికి శోభా ఇంకేం బహుమతిని ఇస్తుందో?(ఇదీ చదవండి: రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?) -
సిక్కోలు చిన్నోడు ‘హర్డిల్స్’లో దూకుడు
సాక్షి, అమరావతి: పేదరికం అడ్డుగోడలను అధిగమించి సిక్కోలు చిన్నోడు చిన్ననాటి నుంచే ‘హర్డిల్స్’లో అదరగొడుతున్నాడు. గొప్ప అథ్లెట్ కావాలన్న ఆకాంక్షతో రికార్డులు సృష్టిస్తూ పతకాలను ఒడిసిపడుతున్నాడు. లావేటి యశ్వంత్ కుమార్ (20) రెండేళ్ల వ్యవధిలో 13 జాతీయ పతకాలను సాధించి క్రీడాలోకం దృష్టిని ఆకర్షించి మెరుపు వేగంతో అంతర్జాతీయ ట్రాక్‌వైపు దూసుకెళ్తున్నాడు. సీనియర్లతో తలపడి మరీ.. విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబకండి గ్రామానికి (పాత శ్రీకాకుళం జిల్లా) చెందిన యశ్వంత్ కుమార్ హర్డిల్స్ 110 మీటర్ల విభాగంలో అద్భుత ప్రతిభ కనపరుస్తున్నాడు. వాలీబాల్ క్రీడాకారుడైన తండ్రి సూరంనాయుడు ప్రోత్సాహంతో క్రీడల్లో అడుగుపెట్టాడు. గతేడాది గౌహతిలో జరిగిన 36వ జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 110 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే కాకుండా లక్ష్యాన్ని 13.92 సెకన్లలో పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. సీనియర్ విభాగాల్లో సైతం పోటీపడి పతకాలు సాధించడం గమనార్హం. పాటియాలా సీనియర్ ఫెడరేషన్ అథ్లెటిక్స్ మీట్లో కాంస్యం, ఢిల్లీలో అండర్–23 అథ్లెటిక్స్ మీట్లో రజతం, వరంగల్ సీనియర్ ఓపెన్ ఈవెంట్లో 5వ స్థానంతో సత్తా చాటాడు. ఈ ఏడాది సీనియర్ విభాగంలోకి అడుగిడిన యశ్వంత్ ఫిబ్రవరిలో మంగుళూరులో జరిగిన ఇంటర్ వర్సిటీ పోటీల్లో ఆచార్య నాగార్జున వర్సిటీ తరఫున 110 మీటర్ల లక్ష్యాన్ని 14.32 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణంతో మెరిశాడు. కసరత్తు చేస్తున్న యశ్వంత్ కుమార్ రెండేళ్లుగా బళ్లారిలో శిక్షణ యశ్వంత్ రెండేళ్లుగా బళ్లారిలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. సిడ్నీ ఒలింపిక్ హర్డిల్స్ స్వర్ణ పతక విజేత మాజీ అథ్లెట్ అనియర్ గార్సియా పర్యవేక్షణలో కఠోర సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం 110 మీటర్ల హర్డిల్స్‌లో యశ్వంత్ ఉత్తమ టైమింగ్ 14.10 సెకన్లుగా ఉంది. అంతర్జాతీయ పోటీలకు అర్హత సాధించాలంటే 13.62 సెకన్లు, ఒలింపిక్స్‌కు 13.32 సెకన్లు (పోటీల్లో విజేతల ప్రతిభను బట్టి ఈ సమయం మారుతుంటుంది) వేగం ఉండాలి. అండర్ 16, 18, జూనియర్, సీనియర్ హర్డిల్స్ ఎత్తులో వ్యత్యాసం ఉండటం, జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్ పోటీల్లో పాల్గొన్న అనుభవం యశ్వంత్‌కు అంతర్జాతీయ పోటీల్లో సులభంగా అర్హత సాధించేందుకు దోహదపడనుంది. రెండేళ్ల క్రితమే సీనియర్ ఏషియన్ ఇండోర్, జూనియర్ ఏషియా, జూనియర్ వరల్డ్ చాంపియన్ షిప్ పోటీలకు అర్హత సాధించినప్పటికీ కరోనా అడ్డుతగిలింది. ఏషియన్, కామన్వెల్త్కు సిద్ధం.. ప్రస్తుతం సీనియర్లో విభాగంలో సిద్ధాంత్ తింగాలియ పేరుతో ఉన్న రికార్డు (13.48 సెకన్లు) బద్ధలుగొట్టి అంతర్జాతీయ పోటీలకు అర్హత పొందేలా యశ్వంత్ సిద్ధమవుతున్నాడు. ఈ నెల 29న కర్నాటకలో జరిగే ఖేలో వర్సిటీ పోటీల ద్వారా వరల్డ్ వర్సిటీ పోటీలకు, జూన్‌లో ఇంటర్ స్టేట్ చాంపియన్ షిప్ ద్వారా కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో అడుగుపెట్టేలా టెక్నిక్‌పై దృష్టి సారించాడు. స్పోర్ట్స్ స్కూల్ నుంచి... యశ్వంత్ హైదరాబాద్ హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి నుంచి తొమ్మిది వరకు చదివాడు. అనంతరం గోల్కొండలోని బాయ్స్ స్పోర్ట్స్ కోమ్ (ఆర్మీ ఆర్టీ సెంటర్ సెలక్షన్లో ఎంపికై) సీబీఎస్సీలో టెన్త్ పూర్తి చేశాడు. ఇంటర్ దూరవిద్యలో పూర్తైంది. తరువాత గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోని టెన్విక్ అకాడమీలో (అనిల్ కుంబ్లే అకాడమీ) అంతర్జాతీయ శిక్షకుడు అద్రిమామ్(దక్షిణాఫ్రికా), ఎరిక్ డిక్సన్ (అమెరికా) వద్ద ఏడాది పాటు శిక్షణ పొందాడు. ప్రస్తుతం సత్తెనపల్లిలో డిగ్రీ ఫైనలియర్ బీకాం చదువుతున్నాడు. కుటుంబ నేపథ్యం.. యశ్వంత్ తండ్రి సూరంనాయుడు హైదరాబాద్‌లోని కొంపల్లిలో ఓ ప్రైవేటు పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. నేషనల్ వాలీబాల్, త్రోబాల్ రిఫరీగా ఉన్న ఆయనకు ఇద్దరు కుమారులు. వారి భవిష్యత్తు కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చేశారు. చిన్న కుమారుడు సిద్ధ వరప్రసాద్ జిమ్నాస్టిక్ క్రీడాకారుడు. ట్రైనింగ్ సెంటర్లో భోజన, వసతి సౌకర్యాలను మాత్రమే సమకూరుస్తారు. కుమారుల ప్రాక్టీస్ కోసం అవసరమైన షూలు, పౌష్టికాహారం, దుస్తుల కోసం నెలకు దాదాపు ఇద్దరు రూ.10వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. సొంత గ్రామంలో చిన్న ఇల్లు మినహా ఆ కుటుంబానికి వేరే ఆస్తులు లేవు. 110 మీటర్ల హర్డిల్స్‌లో విజయాలు.. ► 32వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2021లో స్వర్ణం ► ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2020లో స్వర్ణంతో పాటు 14.10 సెకన్లలో లక్ష్యం పూర్తి చేసి కొత్త రికార్డు ► 35వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో సిల్వర్ మెడల్ ► 31వ సౌత్ జోన్ జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్–2019లో స్వర్ణం ► గుంటూరు జాతీయ జూనియర్–2019 పోటీల్లో ద్వితీయ స్థానం ► 17వ ఫెడరేషన్ కప్ నేషనల్ జూనియర్ అథ్లెటిక్ చాంపియన్ షిప్–2019 రిలేలో (4 గీ 100) కాంస్యం. ► సౌత్‌జోన్ జాతీయ పోటీలు–2018లో 100 మీటర్ల మిడే రిలేలో స్వర్ణం, 100 మీటర్ల హర్డిల్స్‌లో కాంస్యం ► 2016లో విశాఖలో జరిగిన అంతర్ జిల్లాల జాతీయ పోటీల్లో కాంస్యం సాయం కావాలి.. రోజుకు ఒక సెషన్ చొప్పున వారంలో ఆరు సెషన్లు శిక్షణ ఉంటుంది. జిమ్, ట్రాక్‌పై కఠినంగా శ్రమించాలి. ఫిట్నెస్ కాపాడుకుంటూ సెలవు రోజు కూడా ప్రాక్టీస్ చేస్తున్నా. నా తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల్లోనూ లక్ష్యం వైపు నడిపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి ప్రోత్సాహకాలు దక్కలేదు. ప్రభుత్వం సాయం అందించాలని కోరుతున్నా. – లావేటి యశ్వంత్ కుమార్, అథ్లెటిక్స్ క్రీడాకారుడు -
కొరియోగ్రాఫర్ యశ్ అందమైన ఇంటిని చూశారా?
ప్రముఖ కొరియోగ్రాఫర్ యశ్వంత్ మాస్టర్ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ డ్యాన్స్ షో ద్వారా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన యశ్ ఆ తర్వాత సొంతంగా కొరియోగ్రాఫర్‌గా మారాడు. స్టయిలిష్ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక సమంత హీరోయిన్గా నటించిన యూటర్న్ సినిమాతో పాటు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు సైతం కొరియోగ్రఫీ అందించాడు. అలా యూత్‌లో మాంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యశ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇటీవలె యూట్యూబ్ ఛానెల్ పెట్టిన యశ్ తాజాగా తన ఇంటికి సంబంధించిన హోం టూర్ చేశాడు. ఇందులో తన ఇంటికి సంబంధించి పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. -
కంటెస్టెంట్ మృతి.. విషాదంలో కొరియోగ్రాఫర్ యశ్
Yash Master Shares An Emotional Post : ప్రముఖ డ్యాన్స్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ కంటెస్టెంట్లలో ఒకరైన కేవల్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచాడు. కేవల్‌ను కాపాడేందుకు యశ్ ఎంతగానో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కేవల్ ఆపరేషన్ కోసం తోచినంత ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సోషల్‌మీడియా వేదికగా యశ్ కోరాడు. కేవల్‌కు బ్లడ్ డొనేషన్ కోసం కూడా పలుమార్లు నెటిజన్లను కోరిన సంగతి తెలిసిందే. యశ్ పోస్టుతో ప్రియమణి, సుధీర్, రష్మీ, మేఘన వంటి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ కేవల్‌ను కాపాడలేకపోయాయి. బ్లడ్ క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేవల్ తుదిశ్వాస విడిచాడు. ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ యశ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నా. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. మా అందరిని ఒంటరి చేసి త్వరగా వెళ్లిపోయావ్ అంటూ యశ్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తుంది. రిప్ కేవల్ అంటూ నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: 'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్ భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా View this post on Instagram A post shared by Yashwanth Master (@yashwanthmaster) -
సోనూసూద్ చిత్రం.. 12 వరల్డ్ రికార్డులు
చేబ్రోలు (పొన్నూరు): గుంటూరు జిల్లా చేబ్రోలు మండల పరిధిలోని వడ్లమూడి విజ్ఞాన్ లారా ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి దాసరి యశ్వంత్ ఆర్ట్ వర్క్‌లో 12 వరల్డ్ రికార్డులు సాధించాడని కళాశాల ప్రిన్సిపల్ కేపీ కుమార్ వెల్లడించారు. గత నెల 22న తెనాలిలోని శ్రీ చైతన్య స్కూల్ ఆవరణలో ఇండియన్ ఫిల్మ్ యాక్టర్, సోషల్ యాక్టివిస్ట్ అయిన సోనూసూద్ 2,938.548 అడుగుల చిత్రాన్ని 2 గంటల 57 నిమిషాలలో పూర్తి చేసి ఒకేసారి 12 వరల్డ్ రికార్డులు సాధించాడని పేర్కొన్నారు. వరల్డ్ రికార్డులు అందించే టీం సభ్యులు ఈ చిత్రాన్ని పరిశీలించి, అతి తక్కువ సమయంలో దీనిని పూర్తి చేసినట్లు గుర్తించారన్నారు. ఇందుకు సంబంధించిన వరల్డ్ రికార్డు ధ్రువపత్రాలను ఈ నెల 3వ తేదీన విద్యార్థి యశ్వంత్‌కు అందజేసినట్లు చెప్పారు. రెండు చేతులతోను, రెండు కాళ్లతోను, నోటితోను బొమ్మలు వేయగలడం, 7 అడుగుల చిత్రాన్ని రివర్స్‌లో వేయడం యశ్వంత్ ప్రత్యేకతని తెలిపారు. వరల్డ్ రికార్డులు సాధించిన యశ్వంత్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
లిప్‌స్టిక్ వేసుకుని పెదవుల్ని నొక్కుకున్నాకే!
‘నీలోని స్త్రీ కోణాన్ని దర్శించనిదే నువ్వు పరిపూర్ణమైన పురుషుడివి కాలేవు’.. బాబిల్ అన్నాడు ఇలాగని! బాబిల్ 20 ప్లస్ కుర్రాడు. దివంగత నటు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు. ఇంటి నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఫేస్ ప్యాక్ వేసుకుంటాడు. దీప్ పతారే అని ఇంకో యంగ్ గై ఉన్నాడు. లిప్‌స్టిక్ అద్దుకుని, పెదవుల్ని పెదవులతో ఓ సారలా నొక్కుకుని అద్దంలో సరిచూసుకున్నాకే బయటికి రావడం! అంకుశ్ బహుగుణ అయితే స్కిన్ కేర్ ప్రాడక్ట్లంటే పడి చచ్చిపోతాడు. సిద్ధార్థ్ బాత్రా ఎప్పుడూ పూలు, స్త్రీలు ఉన్న చొక్కాల్లోనే కనిపిస్తాడు. శంతన్ ధోపే ఐ మస్కారా లోంచి అదోలా చూశాడంటే గర్ల్స్ ఆత్మరక్షణలో పడ్డారన్నమాటే. యశ్వంత్ సింగ్ ముఖానికి ఏదో రాసుకుంటాడు. ఆ సువాసన అతడెక్కిన మెట్రో ట్రైన్ ని స్టేషన్ వచ్చినప్పుడైనా తలుపుల్ని తెరవనివ్వదు! శక్తి సింగ్ యాదవ్ తన పాదాలకు వేసుకునే షూజ్ చిన్నప్పుడు మగపిల్లలకు మురిపెంగా తల్లి తొడిగే గౌనులా ఉంటాయి. జేసన్ ఆర్లాండ్ అని ఇంకో ఇండియన్ ఉన్నాడు. తన పద్దెనిమిదో యేట నుంచీ అమ్మాయిలకు బ్యూటీ టిప్స్ నేర్పుతున్నాడు. వీళ్లంతా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు. అలంకరణకు ఆడామగా ఏమిటి అంటున్నవారు. ఈ పరిపూర్ణ పురుషుల పరిచయ కార్యక్రమం ‘అందమే ఆనందం’ అన్నంతగా ఉంటుంది. అంకుశ్ బహుగుణ మీరు కనుక ఇన్‌స్టాగ్రామ్‌లో చురుగ్గా ఉంటున్నట్లయితే అంకుశ్ మీకు తెలిసే ఉంటాడు. 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇతడికి! మేకప్ టిప్స్ ఇస్తూ ఉంటాడు. మన స్కిన్ కేర్ కోసం మనం కొంచెం టైమ్ కేటాయించుకోవాలని చెబుతాడు. మనం అంటే మగవాళ్లు, ఆడవాళ్లు కూడా. ఆడవాళ్లలో తనని కలుపుకోడానికి ఏమాత్రం బిడియపడడు. స్త్రీ పురుషులిద్దరికీ స్కిన్ ఉన్నప్పుడు స్కిన్ కేర్ ఇద్దరికీ ఉండాలి కదా అని నవ్వేస్తాడు. కుర్రాడు క్యూట్‌గా ఉంటాడు. ‘వింగ్ ఇట్ విత్ అంకుశ్’ అని ఈ మధ్యే తన రెండో ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. శంతన్ ధోపే ధోపేనా, ధోపానా అని అడుగుతుంటారు శాంతన్ని. శాంతనా, శంతనా అని కూడా. ‘ఏదో ఒకటి అనుకోండి’ అని నవ్వుతాడు. ఎలా పిలిచినా పలికేందుకు తను సిద్ధం అని. అతడే కాదు, అతడి కనురెప్పలూ పలుకుతాయి. డ్యాజిలింగ్ ఐ మేకప్ తో సౌందర్య సామ్రాజ్య యువ చక్రవర్తిలా అనిపిస్తాడు. ఆ లుక్స్ ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఆ కళ్ల మస్కారా ఎంచేతనో ఎబ్బెట్టుగా అనిపించదు. మేకప్‌లో ఇతడికి ఉన్న నైపుణ్యం అది. పురుష జన్మకు ఎక్కడా లోటు జరగదు తన ముస్తాబులో. సిద్ధార్థ్ బాత్రా సుకుమారంగా, లవ్లీగా ఉంటాడు. ఇతడి ఫాలోవర్లు 143 వేలు. ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మగవాళ్ల బ్యూటీని రీ డిఫైన్ చేస్తున్నాడు. పూలు, స్త్రీల చిత్రాలు ఉన్న రంగు రంగుల చొక్కాలు ధరిస్తాడు. పూల మొక్కల మధ్య నిలబడి ఫొటోలు తీయించుకుని వాటిని పోస్ట్ చేస్తుంటాడు. ఆ పోస్ట్‌లకు టప టపమని ఎన్ని లైకులు పడిపోతాయో చెప్పలేం. కొన్ని ఫొటోల్లోనైతే ఇతడి పోలికలను గుర్తుపట్టడం కష్టం. అంతగా ‘ట్రాన్స్ఫార్మేషన్’ చెంది కనిపిస్తాడు. అతడొక కోమలమైన స్టెయిల్ స్టేట్మెంట్ అంటే నమ్మండి. బరువెలా తగ్గడమో చెప్పడు, తగ్గి చూపిస్తాడు. ఆ వీడియోలు అప్డేట్ చేస్తుంటాడు. దీప్ పతారే శాంతను ధోపేకి 25 కె ఉంటే, దీప్‌కి 19 కె ఉన్నారు ఫాలోవర్లు. అతడి మీద కొంచెం క్వీర్ (ఎల్.జి.బి.టి) ప్రభావం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫిట్‌గా ఉంటాడు. ఆ బండ పెదవుల్ని ముందుకు చాపి ‘పౌట్’ చే యడం చూస్తుంటే బాగోనట్లు మాత్రం అనిపించదు. సాధారణంగా అమ్మాయిలే కదా ఫొటో దిగుతూ పౌంట్ లిప్స్ ఇస్తారు. కానీ ఇతడు ఇచ్చినా అదేమీ అసహజంగా ఉండదు. యూట్యూబ్‌లో ఇతడొక మేకప్ చానల్ నడుపుతున్నాడు. ‘ఒకరిపై ముద్ర వేయడం ఆపి, జీవించడం మొదలు పెట్టండి’ అంటాడు. ఇతడి మేకప్‌లో ఆర్టిస్టిక్ ఫ్లెయిర్ ఉంటుంది. మగవాళ్లు మేకప్ అవడాన్ని ‘నార్మలైజ్’ చెయ్యడమే దీప్ పతారే ధ్యేయం. ఆ మధ్య ఇతడినెవరో ‘గే’అన్నారు. సాటి ఇన్ఫ్లుయన్సర్ అంకుశ్ బహుగుణ వెంటనే ఇతడికి సపోర్ట్‌గా వచ్చాడు. ‘మేకప్ వేసుకుంటే మగాళ్లు గేలు అయిపోతారా.. మీ ఆలోచనల్ని మార్చుకోండి అని ఒక వీడియోలో దీప్‌ని వెనకేసుకు వచ్చాడు. యశ్వంత్ సింగ్ యశ్వంత్ యూజర్ నేమ్ యశ్ వాంట్ స్కిన్‌కేర్. బ్యూటీ బ్లాగర్ ఇతడు. ఫాలోవర్లు పన్నెండు వేలు. స్కిన్ కేర్ ఉపాయాలు చెబుతాడు. బ్యూటీ టిప్స్ అడిగితే ఇస్తాడు. ముఖాన్ని మెరిపించే క్రీముల్ని తనూ వాడుతుంటాడు. స్కిన్ కేర్‌లో తనేవైనా కొత్త విషయాలు చదివితే వాటిని షేర్ చేసుకుంటాడు. ఏక్నేకి తను వాడి చూసిన హోమ్మేడ్ దివ్యౌషధాలు, ఇంటర్నేషనల్ బ్రాండ్లపై డిమాన్స్ట్రేషన్స్ ఇస్తాడు. యష్ డాట్ కేర్ అని ఇతడికి ఇంకో అకౌంట్ ఉంది. అందులోంచి సేవా కార్యక్రమాల కోసం సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తుంటాడు. శక్తిసింగ్ యాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అందగాడికి లక్షా ఇరవై వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కొంచెం మ్యాన్లీగా ఉంటాడు. కొంచెం సుకుమారంగా ఉంటాడు. సిద్ధార్థ్ బాత్రా లానే ఫ్యాషన్ స్టెయిలిస్ట్. మోడలింగ్ ఇస్తుంటాడు. ఆ ఫొటోలను అప్లోడ్ చేస్తుంటాడు. ‘ది ఫిబ్రవరి బాయ్’ అనే అకౌంట్లో కొత్త మోడళ్ల ఫుట్‌వేర్‌తో, యాక్సెసరీస్‌తో కనిపిస్తాడు. స్పూలీ (స్పూల్ బ్రష్)తో కనుబొమల అందాన్ని పెంచడం ఎలా అని ఆ మధ్య ఇతడు పోస్ట్ చేసిన టిక్‌టాక్ వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఆ తర్వాత భారతీయ పురుషుల కోసం ఇతడు అందించిన కొరియన్ బ్యూటీ టిప్స్ ఇతడిని ప్రముఖుడిని చేశాయి. జేసన్ ఆర్లాండ్ యాక్టర్, డాన్సర్, మోడల్. బ్యూటీ ఇన్ఫ్లుయన్సర్. చిక్ ఫొటోషూట్స్‌కు ప్రసిద్ధి. అంటే స్టెయిల్ వేర్ ఛాయాచిత్రగ్రహకుడు. యూట్యూబ్‌లో, ఇన్స్టాగ్రామ్ లో మేల్ ముస్తాబు వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. అమ్మాయిలకు ఫ్యాషన్ లుక్కుల పాఠాలు కూడా చెబుతుంటాడు. తనకి 14 ఏళ్ల వయసప్పుడే సొంతంగా మేకప్ టిప్స్ కనిపెట్టానని గర్వంగా చెబుతుంటాడు. తన డ్రెస్‌లను తనే డిజైన్ చేసుకుని, తనే స్టిచ్ చేసుకుంటాడు. ఆ వివరాలను నెట్లో పంచుకుంటాడు. లాక్మేకి కూడా మోడలింగ్ చేశాడు! ఇతడి గురించి మరొక మనోహరమైన సంగతి.. 2019 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడవడం! టూమచ్చబ్బా అనిపిస్తుంది! బాయ్స్కేంటీ సింగారాలు? వాళ్లేమన్నా బంగారాలా? అదిగో మళ్లీ ‘మగ మాటలు’! అందం చందం అంతా అమ్మాయిల్దే అన్నట్లు. వాళ్లే పుత్తడి బొమ్మలైనట్లు. అందం కోసమే వాళ్లు పుట్టినట్లు! బోర్డ్ రూమ్ గాజు అద్దాల్ని పగలగొట్టి వాళ్లొచ్చి డైరెక్టర్ల సీట్లలో కూర్చోవడంలా? అలాగే వీళ్లూ! మహిళలకే మేకప్ అనే గ్లాసు అడ్డుకోడల్ని బ్రేక్ చేసి ఫేస్ప్యాకుల్తో, పెడిక్యూర్లతో, మస్కారాలతో.. బ్యూటిఫుల్ హీరోల్లా (హ్యాండ్సమ్ అనే మాట మాగవాళ్లదే అయితే కనుక) బయటికొచ్చేస్తున్నారు. ఫ్యూచర్లో.. హ్యాండ్‌బ్యాగ్స్ ఆడవాళ్లకే అనేముంది అంటూ.. బ్యాగ్ భుజానికి తగిలించుకుని కనిపిస్తారేమో కూడా! బాబిల్ ఖాన్నే చూడండి. ఫేస్ ప్యాక్ చేయించుకుని ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉంటాడు. అతడు ఫేస్‌ప్యాక్‌తో ఉన్న ఫొటోని ఈ మధ్య ఒకరు నెట్లో చూసి.. ‘బాబిల్.. నువ్వేమైనా ఆడపిల్లవా?’ అని అడిగారు. బాబిల్ ఆశ్చర్యపోయాడు. ‘కొంచెమైనా స్త్రీ అంశ లేకుండా నేను పురుషుడిని ఎలా అవుతాను?’ అని ప్రశ్నించాడు. సింగిల్ లైన్లో ‘బ్రాడ్’ రిప్లయ్. ఆ సమాధానం చూసి బాబిల్కి అంతా హాట్సాఫ్ కొట్టారు. అదిగో.. అప్పుడు మొదలైంది ‘మేల్ ముస్తాబ్’ టాపిక్. మగవాళ్లెందుకు ముస్తాబు కాకూడదు? మగవాళ్లెందుకు స్కిన్ కేర్ ప్రాడక్ట్లు వాడకూడదు? మగవాళ్లెందుకు ఆడవాళ్లు ఇష్టపడే అన్ని రంగుల్ని, హంగుల్ని కోరుకోకూడదు.. అనే డిబేట్. ఇప్పుడైతే ఇది డిబేట్ అయినట్లు అనిపిస్తోంది కానీ, చప్పుడు చేయకుండా మేల్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది చాలాకాలంగా తమని తమే ఫాలో అయిపోతున్నారు. అంటే.. వాళ్లకు ఇష్టమైన రీతిలో వాళ్లు ‘గర్లీ’గా తయారౌతున్నారు. వాళ్లనూ కొంతమంది ఫాలో అవుతున్నారు. ఇక్కడున్న కనిపిస్తున్నవాళ్లు మేల్ ఇన్ఫ్లుయెన్సర్లలో కొందరు. మగ యూత్‌ని బ్యూటీ వైపు దారి మళ్లిస్త్నువారు. చదవండి: యాసిడ్ ఓడింది జంట కలిసింది -
‘మంచు కురిసే వేళలో’ మూవీ రివ్యూ
టైటిల్ : మంచుకురిసే వేళలో జానర్ : రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ తారాగణం : రామ్ కార్తీక్, ప్రనాలి, యశ్వంత్ సంగీతం : శ్రావణ్ భరద్వాజ్ నిర్మాత, దర్శకత్వం : బాలా బోడేపూడి తెలుుగు తెర మీద ప్రేమ కథలు ఎప్పుడు సూపర్ హిట్ ఫార్ములానే. అందుకే కొత్తగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వారు ప్రేమ కథలనే ఎంచుకుంటారు. అలాంటి తెలుగు తెర మీద సందడి చేసిన మరో ఆసక్తికర ప్రేమకథ `మంచు కురిసే వేళలో`. దేవా కట్టా లాంటి క్రియేటివ్ దర్శకుడి దగ్గర పనిచేసిన బాలా బోడేపూడి దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ అందమైన ప్రేమకథ తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? తొలి ప్రయత్నంలో బాలా బోడేపూడి ఏ మేరకు ఆకట్టుకున్నాడు..? కథ : ఆనంద్ కృష్ణ( రామ్ కార్తీక్) ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటూ రేడియో సిటీలో ఆర్జే గా పనిచేస్తుంటాడు. ఆత్మహత్య చేసుకోబోతూ తనకు కాల్ చేసిన ఓ కాలర్‌ను కాపాడే ప్రయత్నంలో తాను బీచ్‌లో పున్నమి వెన్నెల్లో ఓ అందమైన అమ్మాయిని చూసి ప్రేమించానని చెపుతాడు. కానీ ఓ రోజు అలానే నిండు వెన్నెల్లో గీత (ప్రనాలి) అనే అమ్మాయి బీచ్‌లో కనిపించటంతో తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. గీత కూడా తన కాలేజ్‌లోనే జాయిన్ అవ్వటంతో ఆమెతో స్నేహం చేస్తాడు. (సాక్షి రివ్యూస్) ఎప్పుడూ డల్ గా, మూడీగా ఉండే గీత, ఆనంద్‌తో పరిచయం అయిన తరువాత కాస్త యాక్టివ్ అవుతుంది.తన ప్రేమకథనే కాలర్స్‌తో పంచుకున్న ఆనంద్ కృష్ణ వాళ్ల ఒత్తిడితో గీతతో ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పేస్తాడు. కానీ గీత, ఆనంద్ ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. గీత, ఆనంద్ ప్రేమను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటి..? గీత గతం ఏంటి..? ఈ ప్రేమకథలో ప్రకాష్(యశ్వంత్) ఎవరు..? అన్నద మిగతా కథ. విశ్లేషణ : హీరో హీరోయిన్లు కొత్త వారే అయిన తమ పాత్రల్లో ఒదిగిపోయారు. హీరోలుగా నటించిన రామ్ కార్తీక్, యశ్వంత్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. హీరోయిన్గా నటించిన ప్రనాలి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. రెండు వేరియేషన్స్‌ను చాలా బాగా చూపించింది. ఫస్ట్ హాఫ్ అంతా మూడీగా, డల్ గా కనిపించిన ప్రనాలి ద్వితియార్థంలో బబ్లీ బబ్లీగా ఆకట్టుకుంది. చాలా చోట్ల త్రిష ను ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. ఇతర పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. అందమైన ప్రేమకథను కవితాత్మకంగా చెప్పాలనుకున్న దర్శకుడు చాలా వరకు విజయం సాధించాడు. ఏమాత్రం వల్గారిటీ లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ ప్రేమకథను అందించారు. (సాక్షి రివ్యూస్) అయితే తను అనుకున్న విషయాన్ని పోయటిక్‌గా చెప్పే ప్రయత్నంలో కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ. తిరుజ్ఙాన, ప్రవీణ్ కుమార్ తమ కెమెరా పనితనంతో సినిమాకు రిచ్ లుక్ తీసుకువచ్చారు. కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి. ముఖ్యంగా ఊటీలో తెరకెక్కించిన సీన్స్ సూపర్బ్. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం కూడా సరిగ్గా కుదిరింది. మెలోడీస్‌తో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా మూడ్‌ను క్యారీ చేశాయి. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. కొన్ని లెంగ్తీ సీన్స్‌కు కత్తెర పడితే సినిమా ఫీల్ మరోలా ఉండేది. దర్శకుడే నిర్మాత కూడా కావటంతో ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫీ సంగీతం మైనస్ పాయింట్స్ ; స్లో నేరేషన్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అమ్మాయిలు జలగల్లాంటోళ్లు!
‘ఏ ఫీలింగ్స్ లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఫీలింగ్స్ మొదలయ్యాక అలా ఉండలేకపోతున్నాను’..., ‘లవ్‌కి ఆప్షన్స్ ఉంటాయి.. లైఫ్‌కి ఉండవ్’... ‘ప్రతి మగాడికి లవర్ గుండెల్లో ఉంటుంది.. పెళ్లాం పక్కనుంటుంది’..., ‘అమ్మాయిలు జలగల్లాంటోళ్లు రా.. పట్టుకుంటే వదలరు.. తీసేస్తే పోరు’... వంటి డైలాగులు ‘సమీరమ్’ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యశ్వంత్, అమృత ఆచార్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రవి గుండబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమీరమ్’. అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లో అనిత దేవేందర్‌రెడ్డి, సురేశ్ కేశవన్, జి.రుక్మిణి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ మొత్తం బ్యాంకాక్‌లో చేశాం. నా స్నేహితుడు సురేశ్ కేశవన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. యూనిట్ అందరికీ సినిమా విజయంపై మంచి నమ్మకం ఉంది’’ అన్నారు రవి గుండబోయిన. యశ్వంత్, అమృత ఆచార్య, సంగీత దర్శకుడు యాజమాన్య, ‘జబర్దస్త్’ రాము, ‘గెటప్’ శ్రీను, పాటల రచయిత రాంబాబు గోశాల తదితరులు పాల్గొన్నారు. -
చదువంటే బట్టీ పట్టడం కాదు
సినీ విమర్శకుడు, ఇటీవల ‘బిగ్‌బాస్’ షో ద్వారా పాపులర్ అయిన మహేశ్ కత్తి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎగిసే తారాజువ్వలు’. యశ్వంత్, హాసిని, సౌమ్యా వేణుగోపాల్, అజయ్ ఘోష్, లోహిత్, స్వప్న, అప్పాజీ అంబారిష్ఠ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని వాణి ఇరగం సమర్పణలో నాగ మల్లారెడ్డి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ–రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ పాటలను విడుదల చేశారు. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్, శేఖర్ కమ్ముల, రచయిత చిన్నికృష్ణ తొలి పాటను, దర్శకుడు ఇంద్రగంటి, నిర్మాత ‘మధుర’ శ్రీధర్, గీతాకృష్ణ, శ్రీనివాస్‌రాజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘చదువంటే బట్టీ పట్టడం కాదు.. జీవితాన్ని వడేసి పట్టడం’ అనే అంశాన్ని వినోదాత్మకంగా, సున్నితంగా మా సినిమాలో చెప్పాం’’ అన్నారు మహేశ్ కత్తి. ‘‘ఈ చిత్రానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అన్నారు నాగ మల్లారెడ్డి. -
యశ్వంత్, కీర్తనలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో యశ్వంత్, కీర్తన పసిడి పతకాలతో మెరిశారు.రంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఆర్ఆర్ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ రోలర్ స్కేటింగ్ ట్రాక్‌పై శనివారం జరిగిన అండర్-17 బాలుర ఫైనల్లో కె. యశ్వంత్ పసిడి పతకాన్ని దక్కించుకోగా... బి. రోహిత్, జాన్ సత్య వరుసగా రజత, కాంస్య పతకాలను గెలుచుకున్నారు. బాలికల విభాగంలో బి. కీర్తన, కోమిలక తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అండర్-14 బాలుర విభాగంలో పి. శివరామ్ అగ్రస్థానంలో నిలవగా... కె. జతిన్, అనిరుధ్ రెండు, మూడు స్థానాల్ని సంపాదించారు. బాలికల విభాగంలో చరితాదేవి, సుశ్రుత, విధి వరుసగా తొలి మూడు స్థానాల్ని దక్కించుకున్నారు. -
ఇద్దరు పిల్లల గొంతుకోసి తల్లి ఆత్మహత్యాయత్నం
- తాను గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం - మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతలలో దారుణం ఉప్పునుంతల(మహబూబ్‌నగర్): ఇద్దరు పిల్లల గొంతులు కోసి చంపేసిన తల్లి తనూ ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన శుక్రవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉప్పునుంతలకు చెందిన కొత్త నర్సింహారెడ్డి, శ్రీమతమ్మ (22) భార్యాభర్తలు. ఆరేళ్ల క్రితం వివాహం జరిగిన వీరికి కొడుకు జశ్వంత్ (5), కూతురు లక్కీ (2). భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తుండేవారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో నర్సింహారెడ్డి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి పంట పొలానికి నీళ్లు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. భార్య శ్రీమతి పిల్లలు ఇంట్లో ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన ఇద్దరు పిల్లలను అతిదారుణంగా గొంతులు కోసి చంపేసింది. అనంతరం ఆమె కూడా బలవంతంగా కత్తితో గొంతుకోసుకుంది. బయట వరండాలో టీవీ చూస్తున్న అత్త, ఇంటి పక్క మహిళలు ఇంట్లోని గది నుంచి ఏదో శబ్దం రావడం గమనించారు. తలుపులు తెరిచి చూడగా ఇద్దరు పిల్లలు అప్పటికే చనిపోయి రక్తపు మడుగులో పడి ఉన్నారు. శ్రీమతి మాత్రం గొంతు భాగం కొంచెం తెగి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద్ అక్కడి చేరుకుని కొనప్రాణంతో ఉన్న ఆమెను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు పిల్లలను చంపి తాను చనిపోవల్సిన పరిస్థితులు ఎందుకు తలెత్తాయో ఎవరికీ అంతుబట్టడం లేదు. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలు పిల్లలతో కలివిడిగా ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఏనాడూ గొడవ పడలేదని కూడా వారు తెలిపారు. కుటుంబ సమస్యలే ఈ దారుణానికి కారణం కావచ్చునని స్థానికులు అంటున్నారు. -
బాలుడి కిడ్నాప్.. సుఖాంతం
కడప అర్బన్ : కడప నగరంలో మంగళవారం ఉదయం కిడ్నాప్‌నకు గురైన నిమ్మకంటి మల్లికార్జున కుమారుడు యశ్వంత్ (6) ఎట్టకేలకు తల్లిదండ్రుల ఒడికి చేరాడు. జిల్లా ఎస్పీ డా.నవీన్ గులాఠి.. బాలుడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు వివరాలు.. కడప కార్పొరేషన్లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న నిమ్మకంటి మల్లికార్జున, శ్రీవాణి దంపతులకు యశ్వంత్ (6), లక్ష్మి ప్రణీత (3)లు సంతానం. వారు మున్సిపల్ స్టేడియంలోని దత్తసాయి మందిర్ పక్కనున్న ఇంటిలో ఉంటున్నారు. ప్రతిరోజు యశ్వంత్ బయట ఆడుకునే వాడు. రోజు మాదిరిగానే మంగళవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లాడు. 9 గంటలప్పుడు గమనించగా బాలుడు ఎక్కడా కన్పించలేదు.అంతలో వీరి ఇంటిపక్కనుండే డ్రైవర్ పుల్లయ్య సెల్‌ఫోన్(98664 46732)కు అపరిచిత వ్యక్తి (సెల్ 9908348947) ఫోన్ చేశాడు. యశ్వంత్ అనే పిల్లాడిని రాజంపేట వైపు తీసుకువెళుతున్నామని చెప్పాడు. ఆలోపే మల్లికార్జున పోలీసులకు ఫిర్యాదు చేసి ఉండటంతో ఓ కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి వచ్చాడు. డ్రైవర్ పుల్లయ్య, మల్లికార్జునతో అపరిచిత వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడించారు. కానిస్టేబుల్ మాట్లాడే ప్రయత్నం చేయగా అవతలి వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో తీవ్ర ఆవేదనతో యశ్వంత్ తల్లిదండ్రులు విలపించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ నవీన్ గులాఠీ సూచనల మేరకు కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, అర్బన్ సీఐ సదాశివయ్య దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లాడి ఫొటోలను వాట్సాప్‌లో అన్ని పోలీస్స్టేషన్లకు పంపించారు. ఈ నేపథ్యంలో తమను పోలీసులు వెంటాడుతున్నారని భావించిన కిడ్నాపర్లు బాలుడిని సాయంత్రం రాయచోటి బస్టాండు వద్ద వదిలి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత బాలుడిని గుర్తించిన రాయచోటి పోలీసులు కడపకు తీసుకువచ్చారు. ఎస్పీ ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని చెప్పారు. -
కడపలో ఐదేళ్ల బాలుడు కిడ్నాప్
కడప: కడప నగరంలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. కడప నగరానికి చెందిన మల్లికార్జున్అనే వ్యక్తి కడప కార్పోరేషన్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి యశ్వంత్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి ఎదుటు యశ్వంత్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యశ్వంత్‌ను అపహరించారు. అనంతరం బాలుడు తండ్రి మల్లికార్జున్‌కు దుండగులు ఫోన్ చేసి యశ్వంత్‌ను అపహరించినట్లు చెప్పి.. ఫోన్ పెట్టాశారు. దీంతో యశ్వంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ.... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.