కడప నగరంలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు.
కడప: కడప నగరంలో బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం అపహరించారు. కడప నగరానికి చెందిన మల్లికార్జున్అనే వ్యక్తి కడప కార్పోరేషన్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి యశ్వంత్ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ రోజు ఉదయం ఇంటి ఎదుటు యశ్వంత్ ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు యశ్వంత్ను అపహరించారు. అనంతరం బాలుడు తండ్రి మల్లికార్జున్కు దుండగులు ఫోన్ చేసి యశ్వంత్ను అపహరించినట్లు చెప్పి.. ఫోన్ పెట్టాశారు. దీంతో యశ్వంత్ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతూ.... పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.