మూడేళ్ల బాలుడి కిడ్నాప్..
విజయవాడలో నిందితుడి అరెస్ట్
మహబూబ్‌నగర్ క్రైం: పెళ్లయినా పిల్లలు పుట్టరని తెలుసుకొని.. ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఉండాలని భావించిన ఓ వ్యక్తి.. సమీప బంధువు కుమారుడిని కిడ్నాప్ చేశా డు. రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలను మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించారు. జడ్చర్ల మండల పరిధిలోని కొత్తతండాకు చెందిన పాత్లవత్ లాలు కొన్ని రోజులుగా జిల్లాకేంద్రంలోని పద్మా వతి కాలనీలో ఉంటూ మేస్త్రీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే లాలు వద్ద సమీప బంధువు ఖిల్లాఘనపురం మండలం తిర్మాలయి పల్లికి చెందిన సభావత్ రాజు రెండు నెలలగా మేస్త్రీ పని చేస్తున్నాడు. అయితే సభావత్ రాజుకు లైంగిక సమస్యలు ఉండటంవల్ల పెళ్లి కాదని, ఒకవేళ పెళ్లి అయినా పిల్లలు పుట్టరని తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా తనకంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేసుకోవాలని భావించి పథకం ప్రకారం.. లాలు కొడుకు మూడేళ్ల విక్కీని చాక్లెట్లు, ఇతర తినుబండారాలు ఇప్పిస్తూ దగ్గర చేసుకున్నాడు.
ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పద్మావతి కాలనీ అంగన్‌వాడీ సెంటర్ దగ్గరకు వెళ్లి అక్కడే ఉన్న విక్కీని స్కూటీపై ఎక్కించుకుని జడ్చర్లకు తీసుకువెళ్లాడు. ఆ తర్వాత రాజుకు పరిచయం ఉన్న సావిత్రిని కలిసి, జరిగిన విషయం చెప్పకుండా ఆమెను కూడా తీసుకుని విజయవాడ వెళ్లాడు. రాజు వాడుతున్న మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు నిందితుడు విజయ వాడలో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి ప్రత్యేక టీం రాజును అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment