యశ్వంత్, అమృత ఆచార్య
‘ఏ ఫీలింగ్స్ లేనప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఫీలింగ్స్ మొదలయ్యాక అలా ఉండలేకపోతున్నాను’..., ‘లవ్‌కి ఆప్షన్స్ ఉంటాయి.. లైఫ్‌కి ఉండవ్’... ‘ప్రతి మగాడికి లవర్ గుండెల్లో ఉంటుంది.. పెళ్లాం పక్కనుంటుంది’..., ‘అమ్మాయిలు జలగల్లాంటోళ్లు రా.. పట్టుకుంటే వదలరు.. తీసేస్తే పోరు’... వంటి డైలాగులు ‘సమీరమ్’ చిత్రంపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. యశ్వంత్, అమృత ఆచార్యలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ రవి గుండబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సమీరమ్’.
అనిత క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో అనిత దేవేందర్‌రెడ్డి, సురేశ్ కేశవన్, జి.రుక్మిణి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనిత దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్ మొత్తం బ్యాంకాక్‌లో చేశాం. నా స్నేహితుడు సురేశ్ కేశవన్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. త్వరలో సినిమాని విడుదల చేయనున్నాం’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. యూనిట్ అందరికీ సినిమా విజయంపై మంచి నమ్మకం ఉంది’’ అన్నారు రవి గుండబోయిన. యశ్వంత్, అమృత ఆచార్య, సంగీత దర్శకుడు యాజమాన్య, ‘జబర్దస్త్’ రాము, ‘గెటప్’ శ్రీను, పాటల రచయిత రాంబాబు గోశాల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment