గొడవ ఏంటి? | Ghati Movie Trailer Launch | Sakshi
Sakshi News home page

గొడవ ఏంటి?

Published Tue, Mar 10 2020 5:39 AM | Last Updated on Tue, Mar 10 2020 5:39 AM

Ghati Movie Trailer Launch - Sakshi

దిలీప్‌ రాథోడ్, డా. పూనమ్‌ శర్మ

దిలీప్‌ రాథోడ్, డా. పూనమ్‌ శర్మ జంటగా నటిస్తోన్న చిత్రం ‘ఘాఠి’. తెలుగు, బంజార భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో వాల్మీకి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘రాజస్థాన్‌లో ‘ఘాఠి’ అనే ప్రాంతంలో బంజార వారికి, మార్వాడీలకు మధ్య జరిగిన వాస్తవ గొడవను దృష్టిలో పెట్టుకొని చేస్తున్న చిత్రమిది. ఆ గొడవలో బంజారా వారు ఘాఠి  ప్రాంతాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ల మధ్య గొడవ ఏంటి? వాళ్లు మళ్లీ ‘ఘాఠి’కి చేరుకున్నారా? అనే అంశానికి లవ్, యాక్షన్, ఎమోషన్‌ని మేళవించి ఈ చిత్రాన్ని తీస్తున్నాం’’ అన్నారు. ‘‘మంచి సినిమాలో నటిస్తున్నందుకు హ్యాపీ. షూటింగ్‌ సగానికి పైగా పూర్తయింది’’ అన్నారు దిలీప్‌. ప్రతాని రామకృష్ణ గౌడ్, ఎ.గురురాజ్, అద్దంకి దయాకర్, బంజార జాతీయ అధ్యక్షుడు బెల్లం నాయక్‌ పాల్గొన్నారు.     
∙దిలీప్, పూనమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement