Yash Master Shares An Emotional Post : ప్రముఖ డ్యాన్స్ షోతో గుర్తింపు తెచ్చుకున్న కొరియోగ్రాఫర్ యశ్ మాస్టర్ కంటెస్టెంట్లలో ఒకరైన కేవల్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచాడు. కేవల్‌ను కాపాడేందుకు యశ్ ఎంతగానో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. కేవల్ ఆపరేషన్ కోసం తోచినంత ఆర్థిక సహాయం చేయాల్సిందిగా సోషల్‌మీడియా వేదికగా యశ్ కోరాడు.
కేవల్‌కు బ్లడ్ డొనేషన్ కోసం కూడా పలుమార్లు నెటిజన్లను కోరిన సంగతి తెలిసిందే. యశ్ పోస్టుతో ప్రియమణి, సుధీర్, రష్మీ, మేఘన వంటి సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అయితే ఆ ప్రయత్నాలేవీ కేవల్‌ను కాపాడలేకపోయాయి. బ్లడ్ క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కేవల్ తుదిశ్వాస విడిచాడు.
ఈ విషయాన్ని కొరియోగ్రాఫర్ యశ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. నా సోదరుడి మరణాన్ని భరించలేకపోతున్నా. ఈ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటికీ నువ్వు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. మా అందరిని ఒంటరి చేసి త్వరగా వెళ్లిపోయావ్ అంటూ యశ్ పెట్టిన పోస్ట్ కంటతడి పెట్టిస్తుంది. రిప్ కేవల్ అంటూ నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: 'కావ్య నా పిల్ల'.. కాలర్ పట్టుకున్న కాలేజ్ స్టూడెంట్స్
భీమ్లా నాయక్: పవర్ ఫుల్ డైలాగ్‌తో బెదిరించిన రానా
Comments
Please login to add a commentAdd a comment