టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) మృతి చెందారు. ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో ఉంటున్న ఆమె గురువారం కన్నుమూశారు. క్యాన్సర్ చికిత్స కోసం యూఎస్ వెళ్లిన అపర్ణ కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్తతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అపర్ణ మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు సినీ దర్శకురాలు అపర్ణ మల్లాది(54) నటి, రచయితగా రాణించారు. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ది అనుశ్రీ ఎక్స్‌పెరిమెంట్స్ అనే సినిమాతో ఆమె సినీ కెరీర్ ప్రారంభించారు. పోష్ పోరిస్ అనే వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే పెళ్లికూతురు పార్టీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment