Cherographer Yashwanth Master Home Tour Video - Sakshi
Sakshi News home page

Yash Home Tour Video : యశ్‌ హోంటూర్‌ వీడియో.. ఎంత బావుందో ఇల్లు

Mar 4 2022 8:13 PM | Updated on Mar 5 2022 8:35 AM

Cherographer Yashwanth Master Home Tour Video - Sakshi

ప్రముఖ కొరియోగ్రాఫర్‌ యశ్వంత్‌ మాస్టర్‌ ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఓ డ్యాన్స్‌ షో ద్వారా అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇచ్చిన యశ్‌ ఆ తర్వాత సొంతంగా కొరియోగ్రాఫర్‌గా మారాడు. స్టయిలిష్‌ స్టెప్పులతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక సమంత హీరోయిన్‌గా నటించిన యూటర్న్‌ సినిమాతో పాటు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాకు సైతం కొరియోగ్రఫీ అందించాడు. అలా యూత్‌లో మాంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న యశ్‌ సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడన్న సంగతి తెలిసిందే.

ఇటీవలె యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టిన యశ్‌ తాజాగా తన ఇంటికి సంబంధించిన హోం టూర్‌ చేశాడు. ఇందులో తన ఇంటికి సంబంధించి పలు విషయాలను నెటిజన్లతో పంచుకున్నాడు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement