Actress Kirstie Alley Died At Age Of 71 After Battle With Cancer - Sakshi
Sakshi News home page

Kirstie Alley Death: క్యాన్సర్‌తో పోరాటం.. ప్రముఖ నటి కన్నుమూత

Dec 6 2022 11:53 AM | Updated on Dec 6 2022 1:33 PM

Actress Kirstie Alley Passes Away At 71 After Battle With Cancer - Sakshi

ప్రముఖ హాలీవుడ్‌ నటి కిర్‌స్టీ అల్లీ(71)కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని కిర్‌స్టీ కుమారుడు విలియం ట్రూ స్టీవెన్సన్ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశారు. ఆమె ఇన్నాళ్లు గొప్పగా పోరాడింది.

జీవితంలో అంతులేని ఆనందం, ముందుకు సాగే సాహసాలను మాకు వదిలేసి వెళ్లిపోయింది.మోఫిట్ క్యాన్సర్ సెంటర్‌లోని వైద్యులు, నర్సుల బృందం అద్భుతమైన చికిత్స అందించారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

కాగా కిర్‌స్టీ అల్లీ ‘‘డ్రాప్ డెడ్ గార్జియస్’’, ‘‘వెరోనికాస్ క్లోసెట్’’, ‘‘ఇట్ టేక్స్ టూ’’వంటి పలు సినిమాల్లో నటించారు. 1970లో బాబ్‌ అలీ అనే వ్యక్తిని పెళ్లాడి ఏడేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత పార్కర్ స్టీవెన్‌సన్ అనే వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. కిర్‌స్టీ అల్లీ తన కెరీర్‌లో 76 యాక్టింగ్ క్రెడిట్‌లను దక్కించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement