కాబోయే భర్తకు కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి.. రేటు ఎంతో తెలుసా? | Shobha Shetty Gifts Beast XUV 700 Car For Her To Be Husband Yashwanth | Sakshi
Sakshi News home page

Shobha Shetty: సర్‌ప్రైజ్ బహుమతిగా కాస్ట్ లీ కారు.. ఫొటోలు వైరల్

Published Sat, Jun 22 2024 11:16 AM | Last Updated on Sat, Jun 22 2024 12:37 PM

Shobha Shetty Gifts Beast XUV 700 Car For Her To Be Husband Yashwanth

గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభాశెట్టి. అంతకు ముందు 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కనబెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది.

(ఇదీ చదవండి: పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయిన 'బిగ్ బాస్' జోడీ)

'కార్తీకదీపం' సీరియల్‌లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలో తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. దీనితో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టింది.

ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్కెట్‌లో ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజు గిఫ్ట్ ఇచ్చింది అంటే పెళ్లికి శోభా ఇంకేం బహుమతిని ఇస్తుందో?

(ఇదీ చదవండి: రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement