ఏపీ తుపాకీని పేల్చేది ఆయనే:వర్మ
ఇంటర్నెట్ స్పెషల్: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్ధితులపై, ప్రత్యేకహోదా అంశాలపై తరచూ ట్వీట్లు చేస్తూ వస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రూపురేఖలపై ట్వీట్ చేశారు. భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రూపు తుపాకీని పోలి ఉందని ఆంధ్రప్రదేశ్ ఫోటోను పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అనే తుపాకీని వినియోగించి బుల్లెట్లు పేల్చి దాని సమస్యలను తీర్చగలిగేది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు.
Andhra Pradesh is a gun and the only shooter who can fire and kill its problems is Y S Jagan pic.twitter.com/WEZsTJbS4H
— Ram Gopal Varma (@RGVzoomin) 1 February 2017