కంప్లైంట్ రిజిస్టర్ అయ్యింది. ఎక్కడో తెలుసా? పోలీస్ కమీషనర్ ఆఫీసులో. అంతే.. నాగార్జున ఎంక్వైరీ మొదలు పెట్టారు. నాగార్జున ఏంటి? ఎంక్వైరీ ఏంటి అనుకుంటున్నారా? రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగ్ హీరోగా ఇటీవల ఓ చిత్రం మొదలైన విషయం తెలిసిందే. ఇందులో నాగ్ పోలీసాఫీసర్. ఈ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ ఓ కేసుని డీల్ చేసే సీన్స్ తీస్తున్నారు. అసలు విషయం అది. పోలీస్ స్టేషన్ సెట్ వేసి, చిత్రీకరించారు. ‘శివ’వంటి ట్రెండ్‌సెట్టర్ మూవీతో నాగ్–వర్మ కాంబినేషన్ మొదలైంది. ఇప్పుడు కూడా సెన్సేషనల్ హిట్ మూవీ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment