లేటెస్ట్ సినిమా కోసం హీరో నాగార్జున లాఠీ పట్టారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదేనండి.. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో ఆయన హీరోగా రూపొందనున్న సినిమా గురించి చెబుతున్నాం. ఈ చిత్రంలో నాగార్జున లుక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే అసక్తి అభిమానుల్లో ఉంది. కచ్చితంగా నాగ్ ఓ కొత్త మేకోవర్‌తో కనిపిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తారని టాక్.
అందుకు తగ్గట్టుగానే నాగ్ ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఆ ఫొటో మార్ఫింగా? అనే సందేహం పలువురికి కలిగింది. అయితే అది ఒరిజనల్ ఫొటోనే అని.. సోమవారం హీరో నాగార్జున సోషల్ మీడియాలో గతేడాది అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు సంబంధించిన పోస్ట్ స్పష్టం చేసింది. నాగ్ పోస్ట్ చేసిన ఫొటోల్లో ఇక్కడ మీరు చూస్తున్న నాగ్ షర్ట్‌లెస్ ఫొటో కూడా ఉంది. సో.. స్టిల్ ఒరిజినల్ అని ఫిక్స్ అయిపోవచ్చా?
Comments
Please login to add a commentAdd a comment