అత్తారిల్లా... బాబోయ్!
అత్తారింట్లో అల్లుళ్లకి రాచమర్యాదలు జరగడం కామన్. కానీ, ఆ అత్తారింట్లో అలాంటివేవీ జరగవ్. ఆ ఇల్లంటే అల్లుడికి హడల్. అసలా ఇంట్లో ఏముంది? అనే కథాంశంతో స్వీయదర్శకత్వంలో అంజన్ కె. కల్యాణ్ నిర్మించిన చిత్రం ‘అత్తారిల్లు’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అంజన్ మాట్లాడుతూ- ‘‘రామ్‌గోపాల్‌వర్మ, కృష్ణవంశీ వంటి దర్శకుల వద్ద పనిచేశాను. ‘అరుంధతి’ చిత్రానికి స్క్రిప్ట్ వర్క్‌లో పాలుపంచుకున్నాను.
ఒక మంచి సినిమా తీయాలనే నా ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి ‘అత్తారిల్లు’ చేశాను. కడుపుబ్బా నవ్వించే హారర్ చిత్రమిది. మణిశర్మగారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డెన్నిస్ నార్టన్ స్వరపరచిన రెండు పాటలు హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. సాయి రవికుమార్, అతిథీ దాస్, అన్తేశియ చప్రసోవ, తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శివశంకర వరప్రసాద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: యం.హెచ్. రెడ్డి, సమర్పణ: అక్షయ్- అశ్విన్, సహ నిర్మాతలు: కాకల్ల లక్ష్మీ మల్లయ్య, జ్యోతి కె.కల్యాణ్.