Prasanthi
-
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
పీజీ అమ్మాయి.. పదో తరగతి అబ్బాయి
ఔను! వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. యువతి ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ అయితే.. యువకుడు అదే ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్.. ఇద్దరి మనసులు కలిశాయి. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వారి ప్రేమను పెద్దలకు చెప్పలేక.. తీవ్ర మానసిక సంఘర్షణ మధ్య ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి ప్రేమ కథకు వారికి వారే ముగింపు పలుకుతూ.. వారి రెండు కుటుంబాలను విషాదంలోకి నెట్టారు. సాక్షి, మలికిపురం(తూర్పుగోదావరి జిల్లా): మండలంలోని తూర్పుపాలెం గ్రామానికి చెందిన పద్మశాలి సామాజికవర్గానికి చెందిన చిక్క రాముడు, సూర్యకుమారి భార్యాభర్తలు. వీరికి వీరవెంకట నాగ సత్య దుర్గా ప్రశాంతి కుమార్తె, సాయి వీరేంద్ర కుమారుడు. వీరిది నిరుపేద కుటుంబం. చేనేత వృత్తితో ఆదాయం సరిపోక తండ్రి రాముడు తాపీపని చేస్తుంటారు. భర్త చేనేతలో పాలు పంచుకుంటూ భార్య కూడా నేత నేస్తుంది. తమ సంతానం తమ మాదిరిగా కాకుండా ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆ పేదింటి తల్లిదండ్రుల పట్టుదల. అందుకు తగ్గట్టుగానే కుమార్తెను పీజీ వరకు చదివించారు. కుమారుడు కూడా పీజీ పదువుతున్నాడు. పీజీ అనంతరం ప్రశాంతి మండలంలోని గూడపల్లి వెంకటసత్య కాన్సెప్ట్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదుడు వాదోడుగా నిలుస్తూ వచ్చింది. శోక సముద్రంలో ప్రశాంతి తల్లిదండ్రులు తీవ్ర మానసిక సంఘర్షణతో.. రాజోలు మండలంలో కాట్రేనిపాడుకు చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన యాలంగి రమేష్‌తో ఆమెకు పరిచయమై అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుందామని ఇద్దరూ భావించారు. పదో తరగతి చదివిన యాలంగి రమేష్ ప్రశాంతి పనిచేసే కాన్వెంట్ స్కూల్ వ్యాన్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇంతలో ఈనెల 8న ప్రశాంతికి కుటుంబ సభ్యులు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయం చేశారు. అయితే ప్రశాంతి తన ప్రేమ సంగతిని కుటుంబ సభ్యులకు చెప్పలేక, ప్రేమించిన యువకుడిని వదల్లేక తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైంది. అయితే తల్లిదండ్రులు ఆమెకు ముందుగా కుదిర్చిన యువకుడితో ఇటీవల నిశ్చితార్థం జరిపించేశారు. ఆ మరుసటి రోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చదువుకున్న కళాశాల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకుంటానని చెప్పి బయల్దేరిన కుమార్తెను ఆ తల్లి ఉదయమే బస్సు ఎక్కించి దగ్గరుండి మరీ సాగనంపింది. అవే ఆ తల్లీ, కుమార్తెలకు కడసారి చూపులు అవుతాయని ఆరోజు వారు అనుకోలేదు. సర్టిఫికెట్ల కోసమని వెళ్లిన కుమార్తె చీకటిపడినా రాకపోవడంతో తల్లిదండ్రులకు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఈనెల 12న యానాం వద్ద గోదావరిలో కుమార్తె ప్రశాంతి, ఆమె ప్రేమికుడు రమేష్‌ల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కుమార్తె ప్రేమ వ్యవహారం తమకు తెలియదని తెలిస్తే సహకరించే వారమని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చాలా సున్నితమనస్కురాలైన ప్రశాంతి చదువులో ఎప్పుడూ ఫస్ట్‌లోనే ఉంటానని చెబుతూ అలానే చదువుకుందని, పెద్ద ఉద్యోగం చేసి తమకు కష్టాలు లేకుండా చేస్తానని ఎప్పుడూ చెప్పే చిట్టి తల్లి కళ్లెదుటే కనిపించకుండా పోయిందని ఆ తల్లిదండ్రులు కుమార్తె ఫొటోను చూసుకుంటూ గుండెలవిసేలా రోధిస్తున్నారు. మరో వైపు యాలంగి రమేష్ తల్లిదండ్రులు కృష్ణమూర్తి, సీతలను ఎవరైనా పలకరిస్తే చాలు దుఃఖం పొంగుకువచ్చేస్తోంది. ఆ ప్రేమజంట అర్ధాంతరంగా తనువు చాలించడం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
బదిలీ బహుమానం!
అనంతపురం న్యూసిటీ: అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని టీడీపీ నేతలు మారోమారు చాటుకున్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో వ్యవహరించే అహుడా వీసీ ప్రశాంతిపై బదిలీ వేటు పడింది. ప్రభుత్వం ఆమెను కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్‌గా నియమిస్తూ గురువారం జీఓ విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 8న అహుడా వీసీగా ప్రశాంతి బాధ్యతలు చేపట్టారు. ఇదేఏడాది అక్టోబర్ 11న ఆమెకు ఐఏఎస్‌గా పదోన్నతి లభించింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వీసీ బదిలీ జరిగినట్లు చర్చ జరుగుతోంది. బాధ్యతలు తీసుకున్న అనతి కాలంలోనే జిల్లాలోని రాప్తాడు, పెనుకొండ, అనంతపురం రూరల్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్ల విషయంలో కఠిన చర్యలు తీసుకున్నారు. ప్రత్యక్షంగా పర్యటించి సంబంధిత బిల్డర్లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు లోబడి నిర్మాణాలు చేపట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. పెనుకొండలో నిర్మాణాలను సైతం తొలగించేందుకు చర్యలు చేపట్టారు. మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులోనూ అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపారు. ఇకపోతే గతనెల 28న కియా సమీపంలోనూ అక్రమ నిర్మాణాలపై కొరడా ఝలిపించారు. ఆహుడా పరిధిలో ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఆమె తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వీసీని ఆగమేఘాలపై బదిలీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. -
విజయపురికాలనీలో వివాహిత ఆత్మహత్య
చైతన్యపురి పరిధిలోని విజయపురి కాలనీ రోడ్ నెంబర్-2లో ప్రశాంతి(24) అనే వివాహిత తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యానుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో అన్నచెల్లెలు మృతి
పరీక్ష రాయటానికి వెళ్తున్న ఓ యువతి, ఆమె సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తర్లుపాడు మండలంలోని భూపతిపల్లికి చెందిన పులికూరి మరియన్న కుమార్తె ప్రశాంతి(18) గురువారం ఉదయం జరుగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాయటానికి బయలుదేరింది. ఈ పరీక్షకు తండ్రితో పాటు ప్రశాంతి, సోదరుడు కిశోర్(20) కూడా బయలుదేరాడు. ముగ్గురూ టూవీలర్‌పై పరీక్ష కేంద్రమైన కంభం పట్టణంలోని సీఎల్ఆర్ కళాశాల వద్దకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రం ఎదురుగా మరియన్న వాహనం దిగిపోగా అన్నాచెల్లెలు లోపలికి వెళ్లేందుకు యూ టర్న్ తీసుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. -
మహిళా తహశీల్దార్ అరెస్ట్...
- రూ.4.6లక్షలు స్వాధీనం ఎ.కొండూరు కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం తహశీల్దార్ ప్రశాంతిని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. పట్టాదారు పాసు పుస్తకం జారీకి గానుగురువారం రాత్రి బాణోతు గోపిరాజు అనే రైతు నుంచి ఆమె రూ.8వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆమె కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రూ.4.60 లక్షలను గుర్తించారు. వాటికి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. -
అమ్మాయితో అమ్మాయి!
ప్రశాంతి, గీతాంజలి ముఖ్యపాత్రల్లో శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘ఎఫైర్’. ఈ నెల 6న విడుదల కానుంది. ప్రశాంతి మాట్లాడుతూ- ‘‘ఓ అమ్మాయిని ప్రేమించే మరో అమ్మాయిగా నటిస్తున్నానంటే చాలా మంది అభ్యంతరం చెప్పారు. కానీ సినిమా చూశాక అభినందిస్తున్నారు. రషెస్ చూశాక, రామ్‌గోపాల్‌వర్మగారు నాకు ఫోన్ చేయడం మర్చి పోలేను. ఇంగ్లీషు, హిందీల్లోనే సాహసోపేతమైన సబ్జెక్ట్స్ వస్తున్నాయి. మన తెలుగులో ఎందుకు రాకూడదనే పట్టుదలతో ఈ సినిమా చేశాం’’ అని చెప్పారు. ‘‘అమ్మాయితో రొమాన్స్ చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. కానీ ఎక్కడా అసభ్యత లేదు’’ అని గీతాంజలి చెప్పారు. -
ఏం చేయాలి అక్కా..!
అమ్మాయిలు అన్నిట్లో ముందుండాలి.. సగం అవకాశాలను అందుకుంటూ ఆకాశంలో సగమై కనిపించాలి! ఆశ బాగుంది.. సాధించాలనే ఆరాటమూ ఉంది.. ప్రయత్నమూ కనిపిస్తోంది.. ఇదే తీరులో ఆ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే శక్తులూ వీలున్న చోటల్లా తమ వికారాన్ని ప్రదర్శిస్తునే ఉన్నాయి!. అందుకు ఓ ఉదాహరణ.. - సరస్వతి రమ ప్రశాంతి (పేరు మార్చాం) స్పోర్ట్స్ గర్ల్. ఎనిమిదో తరగతి చదువుతోంది. తను ఆడే గేమ్‌లో మెరుపు కదలికలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తుంది. తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. ఊళ్లో వ్యవసాయం చేసుకుంటారు. తను పట్టణంలోని హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. చిన్నప్పటి నుంచి ఆటలంటే ప్రాణం. బిడ్డ ఆసక్తికి అడ్డుకట్ట వేయకుండా.. ఆడపిల్ల అయినా అన్నిట్లో ఉండాలనే కోరికతో పట్నంలో ఉంచారు. ప్రతి టోర్నీలో ప్రశాంతి గెలుపు ఆ తల్లిదండ్రుల్ని మురిపిస్తూనే ఉంది. ఈ మధ్య.. పిల్ల బాగా భయపడుతోంది. ఇదివరకటి ఉత్సాహం కనిపించట్లేదు. ప్రాక్టీస్‌కి వెళ్లాలంటే భయంతో చెమటలు పడుతున్నాయి. తన క్లాస్మేట్స్, ఆటలోని బ్యాచ్‌మేట్స్ గమనించారు. కారణం అడిగితే చెప్పట్లేదు. సెల్‌ఫోన్ రింగవుతుంటే చాలు నిలువెల్లా వణికిపోతోంది. ఈ అమ్మాయి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్లేయర్ (జూనియర్). అదే ఆటకు చెందిన తెలంగాణ స్టేట్ ప్లేయర్స్‌తో మంచి స్నేహం ఉంది. సీనియర్స్‌ని అక్కా.. అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంది. వాళ్లూ ఈ పిల్లను అంతే ఇదిగా చూస్తారు. ఆ చనువుతోనే ఓ అక్కకు తన ప్రాబ్లం చెప్పాలనుకుంది. ఫోన్ చేసింది.. ‘అక్కా.. సర్ (ఆ అమ్మాయి ఆడే ఆటకు సంబంధించిన ఆ స్టేట్ అథారిటీలోని ఒక అధికారి) నన్ను ఎక్కడెక్కడో టచ్ చేస్తున్నాడక్కా.. ముద్దు పెట్టుకొమ్మని కూడా అడుగుతున్నాడు. ఊరికే ఫోన్ చేయమని సతాయిస్తున్నాడు. నేను చేయకపోతే తనే చేస్తున్నాడు. అక్కా.. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం అమ్మావాళ్లకు చెబితే.. అన్నీ మానిపించి ఊరికి తీసికెళ్లిపోతారు. నేను చదువుకోవాలి.. ఇంటర్నేషనల్ ప్లేయర్‌గా మంచి పేరు సంపాదించుకోవాలి.. ఎలా అక్కా?’ అంటూ బాధను, భయాన్నీ పంచుకుంది. ‘మీ పేరెంట్స్‌కే చెప్పు’అని చెప్పాలనిపించింది ఆ అక్కకు. కానీ తనూ భయపడింది. ఇలాంటివుంటాయని తెలిస్తే తనింట్లో పేరెంట్స్ తనని ఇంటికే పరిమితం చేస్తారు. ‘ఇలా అయితే మళ్లీ పాతరోజులకి వెళ్లడం ఖాయం. ఎవరూ ఆడపిల్లల్ని చదివించరు, తమ లక్ష్యాలను నెరవేర్చుకునే ఛాన్స్ ఇవ్వరు. కానీ ఈ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేయాలి.. ఎలా?’ ఆలోచనల్లో పడింది ఆ సీనియర్! ఇది తాజా సంఘటన. నిన్నమొన్న జరిగిందే! పరిష్కారం ఇంకా దొరకలేదు. ఈ అంశాన్ని మీరు చదివేటప్పటికి కూడా ఆ అధికారి నిర్వాకం బయటపడి ఉండకపోవచ్చు!. ఓ వైపు అంగారక గ్రహం మీద జీవి జాడలు తెలుసుకునేంత విజ్ఞానం.. ఇంకోవైపు భూగ్రహం మీదఆడబిడ్డలను కాపాడుకోవడంలో ప్రాథమిక దశలో కూడా లేని జ్ఞానం! ఈ అసమతుల్యం ఎప్పుడు పోయేను.. బిడ్డలు ఆకాశంలో సగమై ఎప్పుడు నిలిచేను?. -
పక్కా హైదరాబాదీని
యాంకర్ ప్రశాంతి.. ఆన్‌స్క్రీన్ ఎంత హుషారుగా కనిపిస్తుందో... ఆఫ్ స్క్రీన్‌లోనూ అంతే యాక్టివ్. ఒక్క యాంకరింగ్‌కే పరిమితం కాక వయా రియాలిటీ షోస్... సినిమాలకూ మూవ్ అయ్యింది. చివరి వరకు హైదరాబాదీగా ఉండటానికే ఇష్టపడతానంటున్న ఈ డ్యాన్సింగ్ డాల్ పరిచయం.. - శిరీష చల్లపల్లి నేను పక్కా ైెహ దరాబాదీని. మా అమ్మమ్మ, నానమ్మ అందరిదీ ఇక్కడే. నాన్న కేంద్ర ప్రభుత్వోద్యోగి. అమ్మ హోం మేకర్. అక్క, తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇంట్లో నాన్న స్ట్రిక్ట్ కానీ.. నే నంటే గారాబం. ఇంట్లో ఎవరికేం కావాలన్నా నాతోనే రాయబారం.. నేను ఇంటర్ చదువుతుండగా అనారోగ్యంతో అమ్మ చనిపోయింది. స్ట్రిక్ట్‌గా ఉండే నాన్న ఆ తర్వాత ఫ్రెండ్లీగా ఉండటం స్టార్ట్ చేశారు. నాన్న డ్రీమ్... మేం ఉండేది కూకట్‌పల్లిలో. స్కూలింగ్, ఇంటర్ అంతా ఇంటికి దగ్గరలోనే. నేను యావరేజ్ స్టూడెంట్‌ని. లెక్కలంటే భయం. కల్చరల్ యాక్టివిటీస్‌లో మాత్రం ముందుండేదాన్ని. స్కూల్లో, కాలేజీలో స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ ఉన్నాయంటే చాలు జ్వరం ఉన్నా కూడా రెడీ అయ్యేదాన్ని. కాలేజ్ వరకూ టీం లీడర్ని నేనే. వాలీబాల్, షటిల్, కోకో బాగా ఆడేదాన్ని. నాన్న మాత్రం నన్నో కలెక్టర్‌గా చూడాలని అనుకునేవారు. దాంతో నేనూ నాన్న డ్రీమ్‌నే ఫాలో అయ్యేదాన్ని! సుమను చూశాక ఓకే.. నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఓ టీవీ ఛానల్ వాళ్లు మా కాలేజ్‌లో ఓ ప్రోగ్రాం చేయడానికి వచ్చారు. ఆ ప్రోగ్రామ్‌కి అవసరమైన విద్యార్థుల్ని నేను చొరవగా సమీకరించడం చూసి.. ప్రోగ్రాం డెరైక్టర్ నన్ను యాంకరింగ్ చేయమని అడిగారు. నాన్న అందుకు ఒప్పుకోలేదు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అదే డెరైక్టర్ మళ్లీ అడిగారు. అప్పుడు నేను పంజగుట్టలోని గీతాంజలి ఉమెన్స్ కాలేజీలో బీకామ్ చదువుతున్నాను. నాక్కూడా ఎంటర్టైన్మెంట్ వైపు ఆసక్తి ఉండటంతో నాన్నను ఒప్పించాను. ఆడిషన్స్‌కు నాతోపాటు నాన్న కూడా స్టూడియోకి వచ్చారు. అక్కడ యాంకర్ సుమను చూసిన నాన్న.. నేను యాంకరింగ్ చేయడానికి ఒప్పుకొన్నారు. బుల్లితెరకే ఓటు... అలా నా ఫస్ట్ప్రోగ్రాం ‘సినీరంజని’తో ప్రారంభమైంది. తరువాత మనోరంజని, డాన్సు షోస్, రియాలిటీ షోస్, హోస్టింగ్ వరకు సాగింది. ‘అనగనగా’ అనే సినిమాలో మొదటిసారి హీరోయిన్గా కూడా చేశాను. ప్రస్తుతం బాలకృష్ణ ‘లయన్’ సినిమాలో ఓ మంచి రోల్ చేస్తున్నాను. అయితే నాకు జీవితాన్నిచ్చిన బుల్లి తెర అంటేనే ఇష్టం. నాకు అన్ని రకాల డ్రెస్‌లు నప్పుతాయి అంటారు... అందుకే మార్కెట్లోకి వచ్చిన ప్రతి డ్రెస్ వేసుకొని ప్రయోగం చేస్తుంటాను. మేరా హైదరాబాద్ మహాన్! హైదరాబాద్ గురించి చెప్పాలంటే.. ఇదో మల్టీ కల్చరల్ సిటీ. ఆసక్తి ఉండాలేగానీ... పుస్తకాలు చదవకుండానే నేర్చుకునే విషయాలు ఇక్కడ బోలెడు. అందుకే ‘మేరా హైదరాబాద్ మహాన్!’ అని గర్వంగా చెప్పగలను. చీకటి-వెలుతురులో చార్మినార్‌లో షాపింగ్, వెన్నెల రాత్రుల్లో హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్, ఇరానీ చాయ్ గుబాళింపులు, సాయంత్రాల్లో నెక్లెస్ రోడ్లో ప్రేమికుల గుసగుసలు... ఇవన్నీ ఒక్క హైదరాబాద్‌లో తప్ప ఇంకెక్కడా చూడలేం. అందుకే నేను చివరివరకూ హైదరాబాదీగా ఉండటానికే ఇష్టపడతాను! -
ఈ కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా?
మా నాన్నగారు స్కూల్ హెడ్మాస్టర్. ఆయనంటే అందరికీ చాలా భయం. ఎప్పుడూ క్రమశిక్షణ గురించే మాట్లాడేవారు. నిజాయతీగా ఉండాలనేవారు. నిజమే చెప్పాలనేవారు. అయితే అవన్నీ మంచికే చెప్తున్నారని అర్థం చేసుకునే వయసు, పరిణతి నాకు లేకపోయాయి. దాంతో ఆయన కంటపడకుండా తప్పించుకునేదాన్ని. ఐదోతరగతి చదువుతున్నప్పుడు అమ్మ అనారోగ్యంతో చనిపోయింది. అప్పట్నుంచీ నాన్నతో మాట్లాడటమే తగ్గించేశాను. నేను టెన్త్‌క్లాస్ చదువుతున్నప్పుడు మా దూరపు బంధువు ఒకరు భార్యాసమేతంగా వచ్చారు మా ఇంటికి. వాళ్లని చూస్తూనే అరుగు మీద కూర్చుని హోమ్‌వర్క్ చేస్తున్న నన్ను లోపలికి వెళ్లిపొమ్మన్నారు. దాంతో నాకేదో అనుమానం వచ్చింది. లోపల నిలబడి కిటికీలోంచి జరిగేది చూడసాగాను. ఆ వచ్చినావిడ అంటోంది... ‘నా కూతుర్ని నాకు ఇచ్చేయండి’ అని. నాన్న అంటున్నారు... ‘మొదటే చెప్పాం తననిక ఇవ్వడం కుదరదని, తనిప్పుడు నా కూతురు, మీరు వెళ్లిపోండి’ అని. నాకు ఎప్పటికో అర్థమైంది... వాళ్లు మాట్లాడుకుంటున్నది నా గురించే అని. నాకు కోపం, దుఃఖం కలిసొచ్చేశాయి. అంటే నేను ఆయన కన్న కూతురిని కాదు. అందుకే ఆయనకు నా మీద ప్రేమ లేదు. అలా అనుకోగానే ఇక ఉండలేకపోయాను. పరుగు పరుగున మా అమ్మ దగ్గరకు వెళ్లిపోయాను. నన్నూ తీసుకుపొమ్మని అడిగాను. తను సంతోషంగా నన్ను దగ్గరకు తీసుకుంది. అంతవరకూ వాళ్లతో వాదించిన నాన్న సెలైంట్ అయిపోయారు. వస్తానంటే తీసుకెళ్లండి అన్నారు. దాంతో నేను మా అమ్మానాన్నలతో వెళ్లిపోయాను. కానీ నేనెంత తప్పు చేశానో తర్వాత తెలిసింది. నేను వెళ్లిన నాలుగోరోజునే కబురొచ్చింది... నాన్న గుండెనొప్పితో చనిపోయారని. అమ్మానాన్నలు నన్ను తీసుకు వెళ్లారు. వాకిట్లో నాన్న శవం ఉంది. చనిపోయాక కూడా ఆ ముఖంలో కాఠిన్యమే కనిపించింది నాకు. అందుకే ఏడుపు రాలేదు. అంతలో పక్కింటాయన నాకో ఉత్తరం తెచ్చి ఇచ్చారు. చనిపోయేముందు నాన్న ఇచ్చారట, నాకు ఇవ్వమని. అది చదివిన నాకు నాన్నంటే ఏమిటో తెలిసి వచ్చింది. నేను పుట్టేటప్పటికి నా కన్నతల్లితండ్రులకు తినడానికి తిండి కూడా ఉండేది కాదట. దాంతో నన్ను ఎవరికో అమ్మేయబోతే నాన్న తాను పెంచుకుంటానని చెప్పి నన్ను ఇంటికి తీసుకొచ్చేశారట. కేవలం నాకోసమే పిల్లల్ని కనకూడదని నాన్న అనుకున్నారట. అమ్మకూడా అందుకు సరేనందట. ‘నిన్ను తొలిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఇక జీవితమంతా నీకోసమే బతకాలనుకున్నాను, కానీ నువ్వు నన్ను వదిలి వెళ్లిపోయావు, అందుకే వెళ్లిపోతున్నాను తల్లీ, జాగ్రత్త’ అన్న నాన్న మాటలు మనసును పిండేశాయి. నాన్న పాదాల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చాను. కానీ ఏం లాభం? నా కన్నీళ్లు నా పాపాన్ని తుడిచేయగలవా? నా తండ్రిని నాకు తీసుకొచ్చి ఇవ్వగలవా? - ప్రశాంతి, మామిడికుదురు -
చెక్కు చెదరని బుద్ధవాక్యం
గ్రంథపు చెక్క బుద్ధప్రతిమలానే సాంచీస్థూపం కూడా ఏదో అనాది, శాశ్వత సందేశాన్ని వింటున్నట్లుగా, ఆ సందేశాన్ని ధ్యానిస్తున్నట్లుగా అక్కడొక అపూర్వమైన నిశ్శబ్దం, ప్రశాంతి నెలకొని ఉన్నాయి. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండ మీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధస్థూపాలన్నిటిలో కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యంలాగా ఈ నిర్మాణం కూడా మనకు కనిపిస్తుంది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికీ సంబంధం లేదు. బుద్ధుడు తన జీవిత కాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో వివరంగా నమోదు చేసినప్పటికీ సాంచి గురించి కనీసం ఒక్కవాక్యం కూడా ప్రస్తావించలేదు. బుద్ధపాద స్పర్శకు నోచుకోనప్పటికీ, బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధసంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచీ చరిత్రలో నిలబడింది. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్లేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్లేటప్పుడో ఈ అడవిలో ఈ కొండను చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండ మీద రాస్తే నలుగురు చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ ‘దృష్టి’ ఉంది. అందుకే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండ మీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు కూడా అతడు ఈ స్థూపనిర్మాణం చేపట్టాడు. - వాడ్రేవు చినవీరభద్రుడు ‘నేను తిరిగిన దారులు’ పుస్తకం నుంచి.