మహిళా తహశీల్దార్ అరెస్ట్... | Women tahsildar arrested in krishna district | Sakshi
Sakshi News home page

మహిళా తహశీల్దార్ అరెస్ట్...

Published Fri, May 6 2016 8:48 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

Women tahsildar arrested in krishna district

- రూ.4.6లక్షలు స్వాధీనం

ఎ.కొండూరు

కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలం తహశీల్దార్ ప్రశాంతిని ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. పట్టాదారు పాసు పుస్తకం జారీకి గానుగురువారం రాత్రి బాణోతు గోపిరాజు అనే రైతు నుంచి ఆమె రూ.8వేలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

 

అనంతరం ఆమె కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రూ.4.60 లక్షలను గుర్తించారు. వాటికి ఎలాంటి లెక్కలు లేకపోవడంతో సీజ్ చేసి ఆమెను అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement