
సాక్షి, హైదరాబాద్: షాబాద్ సీఐ శంకరయ్యను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. భూ కేసు వివాదంలో లక్షా 20 వేలు లంచం తీసుకుంటూ ఇన్స్పెక్టర్ శంకరయ్య, ఏఎస్ఐ రాజేందర్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచి శంకరయ్య ఇంటిలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన ఇంటిలో భారీగా నగదు, నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్యను ఈ రోజు సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు.శంకరయ్యతో పాటు ఏఎస్‌ఐ రాజేందర్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. (ఏసీబీ వలలో సీఐ, ఏఎస్‌ఐ)