సాక్షి,హైదరాబాద్ : ఫార్ములా ఈ-కార్ రేస్ (Formula E Race case) కేసులో హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిని (bln reddy) ఇవాళ ఏసీబీ (acb) కార్యాలయానికి వచ్చారు. శుక్రవారం విచారణలో హెచ్‌ఎండీఏ నిధులను ఎఫ్‌ఈవో కంపెనీకి బదిలీ చేయడంపై బీఎల్‌ఎన్‌రెడ్డి నుండి ఏసీబీ సమాచారం రాబట్టనుంది.
ఇదే కేసులో ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ (ias arvind kumar) ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా బీఎల్‌ఎన్‌రెడ్డిపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది.
మనీలాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాల నేపథ్యంలో బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ అధికారులు బుధవారం ఎనిమిదిన్నర గంటలపాటు విచారించారు. ఈడీ విచారణ తర్వాత శుక్రవారం ఆయన ఇవాళ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.
నిధుల మళ్లింపుపైనే ఈడీ ఫోకస్..
ఫార్ములా–ఈ కార్ రేస్ సీజన్–10 నిర్వహణకు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ విభాగం (ఎంఏయూడీ), ఫార్ములా–ఈ రేసు నిర్వహణ సంస్థ ఎఫ్‌ఈవో (ఫార్ములా–ఈ ఆపరేషన్స్) సంయుక్తంగా సిద్ధమయ్యాయి. రేసు నిర్వహణకు సంబంధించి స్పాన్సర్ ఫీజు, పన్నులు కలిపి మొత్తం రూ.110 కోట్లు (90,00,000 బ్రిటన్ పౌండ్లు)ను ఎఫ్‌ఈవోకు చెల్లించేలా 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం చేసుకున్నారు.
కానీ అంతకన్నా ముందే నిధులు చెల్లించాలంటూ సెప్టెంబర్ 25న తొలి వాయిదాగా 22,50,000 పౌండ్లు (మన కరెన్సీలో రూ.22,69,63,125), 29వ తేదీన రెండో వాయిదాగా 22,50,000 పౌండ్లు (అయితే పన్నులు, కమిషన్ కలిపి రూ.23,01,97,500) చెల్లించాలంటూ ఎఫ్‌ఈవో ఇన్వాయిస్‌లు పంపింది. దీనిపై అప్పటి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ను పూర్తి చేశారు.
అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ.23,01,97,500 మంజూరు చేశారు. ఈ మొత్తం హెచ్‌ఎండీఏ బోర్డ్ ఖాతా నుంచే బ్రిటన్‌కు బదిలీ అయినట్టు ఈడీ గుర్తించింది. దీనిపై బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించాలని నిర్ణయించింది. హెచ్‌ఎండీఏ బోర్డు నుంచి బదిలీ అయిన రూ.45.71 కోట్లు, పెనాల్టీగా ఐటీ శాఖకు చెల్లించిన రూ.8 కోట్లు కలిపి మొత్తం రూ.54.89 కోట్లకు సంబంధించిన వివరాలను రాబట్టనుంది.
ఎవరి ఆదేశాలతో ఇది చేశారు?ఇందుకు సంబంధించిన పత్రాలు, హెచ్‌ఎండీఏ రికార్డులపై ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అదేవిధంగా అనుమతుల వ్యవహారాలు, అప్పటి మంత్రి కేటీఆర్ నుంచి వచ్చిన ఆదేశాలతోపాటు నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందన్న కోణంలో విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment