ఎవరి మధ్య ఎఫైర్?
ఇద్దరమ్మాయిల మధ్య జరిగే ఓ విభిన్నమైన కథగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫైర్’. శ్రీరాజన్, గీతాంజలి, ప్రశాంతి ముఖ్య తారలుగా శ్రీరాజన్ దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఆడియోను రామ్‌గోపాల్‌వర్మ హైదరాబాద్‌లో విడుదల చేశారు. రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది. శ్రీరాజన్‌కు మంచి భవిష్యత్తు ఉంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం యువతరానికి కచ్చితంగా నచ్చుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని, మాటలు: అనిల్ సిరిమల్ల, సంగీతం: శేషు కె,యం. ఆర్.