
టీజీ విశ్వప్రసాద్
ప్రముఖ సినీ నిర్మాత, పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వప్రసాద్ ఇంట విషాదం నెలకొంది. విశ్వప్రసాద్ తల్లి గీతాంజలి (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో గీతాంజలి గారు చికిత్స పొందుతున్నారు.
కోలుకోలేని పరిస్థితుల కారణంగా ఆవిడ చివరి కోరిక మేరకు తనయుడు విశ్వప్రసాద్ వారాణాసి తీసుకువెళ్ళారు. అక్కడే దైవ దర్శనం అనంతరం ఆమె తుది శ్వాస విడిచారు. గీతాంజలి గారికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. విశ్వప్రసాద్ పెద్దకొడుకు. వారణాసిలో ఆవిడ అంత్యక్రియలు జరుగుతాయని విశ్వప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment