భాష తెలిస్తే నటన సులభం | Shweta basuprasad in mixturepotlam movie | Sakshi
Sakshi News home page

భాష తెలిస్తే నటన సులభం

Published Wed, Mar 1 2017 5:03 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

భాష తెలిస్తే నటన సులభం

భాష తెలిస్తే నటన సులభం

‘‘భానుచందర్‌కు చాలా పాటలు పాడాను. ఇప్పుడు వాళ్లబ్బాయి జయంత్‌కి పాటలు పాడటం హ్యాపీగా ఉంది. ఎవరికైనా భాష మీద పట్టుండాలి. భాష బాగా తేలిస్తే నటించడం ఈజీ. యువతను ఆకట్టుకునేలా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్‌ స్వరాలు సమకూర్చారు’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

జయంత్, శ్వేతా బసుప్రసాద్, గీతాంజలి ముఖ్యతారలుగా సతీశ్‌ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘మిక్చర్‌ పొట్లం’. మాగంటి మురళీమోహన్‌ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఎస్పీబీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సినిమాలన్నీ ఒకటే. చిన్నా పెద్ద తేడా లేదు. హీరో జయంత్‌ కొత్తవాడైనా బాగా నటించాడు’’ అని శ్వేతా బసు ప్రసాద్‌ అన్నారు.  ఈ వేడుకలో దామోదర ప్రసాద్, సాగర్,  చిట్టిబాబు, డాక్టర్‌ విజయలక్ష్మీ, జాన్‌బాబు, నవీన్, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement