Jayant
-
ప్రేమ విఫలం... బలవన్మరణం
నెక్కొండ/శాంతినగర్: ప్రేమ విఫలం కావడంతో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండకు చెందిన చింతల జయంత్ (22) ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలని జయంత్‌ను యువతి తల్లిదండ్రులు మందలించారు. యువతి సైతం అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ నెల 27న తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జయంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీసి.. సూసైడ్ నోట్ రాసి.. ప్రేమించి మోసపోవద్దని, తాను మోసపోయి ఆ త్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జోగులాంబ–గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ స్టేజీకి చెందిన తెలిగి అశోక్ (22) మంగళవారం రాత్రి కర్నూలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు.. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, యువతి తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నందున తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, తన చావుకు కారణమైన వారిని వదలొద్దంటూ వీడియోలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బుధవారం అశోక్ మృతదేహాన్ని తీసుకొ చ్చి అలంపూర్–రాయచూర్ రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేస్తామని సీఐ రవిబాబు చెప్పారు. -
వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక ఉద్రిక్తతలే అవరోధం
న్యూఢిల్లీ: భారతదేశ వృద్ధి అవుట్‌లుక్‌కు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే అతిపెద్ద ప్రమాదకరంగా తయారయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు జయంత్ ఆర్ వర్మ ఉద్ఘాటించారు. ప్రత్యేకించి ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి వ్యాపిస్తే దేశ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చిపడతాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి మేలు చేకూర్చే అంశం. దేశంలో ఈ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగదని భావిస్తున్నా. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత 6 స్థాయిలోపునకు తీసుకురావడానికి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం కట్టుబడి ఉంది. ► ఎకానమీ పట్ల ఆశావహ పరిస్థితే ఉంది. పలు రంగాలు, పరిశ్రమలలో రికవరీ అసమానంగా ఉన్నప్పటికీ, వినియోగ డిమాండ్ కోలుకోవడం ప్రారంభమైంది. ఇది హర్షణీయ పరిణామం. ► పరిశ్రమ, వివిధ రంగాల సామర్థ్య వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం మూలధన వ్యయాల పెంపుపై పలు రంగాలు వ్యూహ రచన చేస్తున్న సంకేతాలు ఉన్నాయి. ► పలు కీలక అంశాలు దేశీయ మారకపు రేటు కదలికలకు కారణాలుగా ఉంటాయి. అందులో ద్రవ్యోల్బణం ఒక కారణం. ప్రస్తుత రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. -
ఫైనల్లో భారత్
కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఓటమి ఎరుగని యువ భారత్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీఫైనల్లో 7 వికెట్లతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసింది. మొదట బౌలింగ్‌లో స్పిన్నర్లు మయాంక్ మార్కండే (4/38), జయంత్ (2/29), పేసర్ అంకిత్ రాజ్‌పుత్ (2/19), తర్వాత బ్యాటింగ్‌లో హిమ్మత్ సింగ్ (59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్ (67; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షకీల్ (62; 7 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కూడా తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (20; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకుశ్ బెయిన్స్ (9), ములాని (19; 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో హిమ్మత్, రాణా అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రెండో సెమీస్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలి చింది. శనివారం ఇక్కడే జరిగే టైటిల్ పోరులో భారత్, లంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు
‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్‌కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం. అది ఉంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. ‘ఈశ్వర్’తో ప్రభాస్‌ని హీరోగా చేశాం. తను ఇప్పుడు పెద్ద రేంజ్ హీరో అయినందుకు గర్వంగా ఉంది. గంటా రవి కూడా ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు’’ అని జయంత్ సి. పరాన్జీ అన్నారు. గంటా రవి, మాళవికా రాజ్ జంటగా కె.అశోక్‌కుమార్ తెరకెక్కించిన ‘జయదేవ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జయంత్ సి. పరాన్జీ చెప్పిన విశేషాలు..కెమెరామేన్ జవహార్‌రెడ్డి గంటా రవిని పరిచయం చేశాడు.రవిని చూడగానే ఇతనితో సినిమా తీయొచ్చు అనిపించింది. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్‌తో నటించాడు. తమిళ ‘సేతుపతి’ చిత్రంలోని మెయిన్ ఎస్సెన్స్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ‘జయదేవ్’ తీశా. పరుచూరి బ్రదర్స్ కథని బాగా డెవలప్ చేశారు. ∙సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ఇది. రెగ్యులర్ పోలీస్ చిత్రాల్లా ఉండదు. రవి, మాళవికలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇందులో వినోద్‌కుమార్ విలన్‌గా చేశారు. నా ‘అల్లరి పిడుగు, తీన్మార్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. గ్యాప్ తీసుకుని రైట్ టైమ్‌లో చేసిన చిత్రం ‘జయదేవ్’. మళ్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమవుతుంది. మణిశర్మ మంచి పాటలిచ్చారు. ‘ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్’ తర్వాత అశోక్కుమార్గారితో చేసిన ‘జయదేవ్’ మా కాంబినేషన్లో హ్యాట్రిక్ సాధిస్తుంది. -
బస్ మిస్సింగ్..!
కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్న ప్రేమికులు, మరదలి కోసం వెతుకుతున్న బావ, ఎంజాయ్ చేసేందుకు టూర్‌కు వెళ్తున్న దంపతులు ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కో కథ. ఈ అందరూ సువర్ణసుందరి టూర్ బస్‌లో ప్రయాణం చేస్తుంటారు. సడన్‌గా ఆ బస్సు మాయమౌతుంది. ప్రయాణికులను కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? ప్రయాణికులు ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కారు..? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’. శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో ఎంవి సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా గోదావరి సినీటోన్ పతాకంపై కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు, సంయుక్తంగా నిర్మించారు. గీతాంజలి కథానాయిక. సుమన్, భానుచందర్ నటించారు. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు మా చిత్రాన్ని రెండు ఏరియాల్లో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సతీష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చి ‘మిక్చర్ పొట్లం’ సినిమాను నిర్మించాం. మాధవపెద్ది సురేష్ మంచి సంగీతం అందించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. -
భాష తెలిస్తే నటన సులభం
‘‘భానుచందర్‌కు చాలా పాటలు పాడాను. ఇప్పుడు వాళ్లబ్బాయి జయంత్‌కి పాటలు పాడటం హ్యాపీగా ఉంది. ఎవరికైనా భాష మీద పట్టుండాలి. భాష బాగా తేలిస్తే నటించడం ఈజీ. యువతను ఆకట్టుకునేలా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ స్వరాలు సమకూర్చారు’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. జయంత్, శ్వేతా బసుప్రసాద్, గీతాంజలి ముఖ్యతారలుగా సతీశ్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. మాగంటి మురళీమోహన్ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఎస్పీబీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘సినిమాలన్నీ ఒకటే. చిన్నా పెద్ద తేడా లేదు. హీరో జయంత్ కొత్తవాడైనా బాగా నటించాడు’’ అని శ్వేతా బసు ప్రసాద్ అన్నారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, సాగర్, చిట్టిబాబు, డాక్టర్ విజయలక్ష్మీ, జాన్‌బాబు, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
జయహో జయంత్
రెండు టెస్టుల్లో సత్తా చాటిన ఆల్‌రౌండర్ దేశవాళీలోనూ ఘనమైన రికార్డు జట్టులో రెగ్యులర్‌గా మారే అవకాశం సరిగ్గా నాలుగేళ్ల క్రితం తన ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఐదో మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎలెవన్‌తో తలపడి అలిస్టర్ కుక్ వికెట్ తీసినప్పుడు అతనికి తెలీదు... నాలుగేళ్ల తర్వాత అదే కుక్ సారథ్యంలోని జట్టును తన స్పిన్‌తో దెబ్బ తీస్తానని. మూడేళ్ల క్రితం ప్రత్యేక శిక్షణలో భాగంగా చెన్నైకి వెళ్లి అశ్విన్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉంటూ రెండు వారాల ట్రైనింగ్ సెషన్లో ప్రాక్టీస్ చేసినప్పుడు అతనికి తెలీదు... మూడేళ్ల తర్వాత అదే అశ్విన్‌తో కలిసి తాను అద్భుతం చేస్తానని. అనూహ్యంగా లభించిన అవకాశాన్ని రెండు చేతులా అంది పుచ్చుకున్న 26 ఏళ్ల జయంత్ యాదవ్ ఇప్పుడు జట్టులోంచి తనను తప్పించలేని పరిస్థితిని సృష్టించాడు. విశాఖపట్నంలో ఆడిన తొలి టెస్టులో 4 వికెట్లు తీయడంతో పాటు జయంత్ చేసిన 35, 27 నాటౌట్ స్కోర్లు అతనికి బ్యాటింగ్ వచ్చనే అభిప్రాయాన్ని జట్టు మేనేజ్మెంట్లో కలిగిస్తే, మొహాలీలో మరో 4 వికెట్లతో పాటు కీలక సమయంలో చేసిన అర్ధసెంచరీ ఆ నమ్మకాన్ని పెంచింది. ముఖ్యంగా ఈ రెండు టెస్టులలో కీలక సమయాల్లో స్టోక్స్, రూట్, బెరుుర్స్టోలాంటి బ్యాట్స్‌మెన్ వికెట్లు తీయడంతో అతను మన వరుస విజయాల నంబర్‌వన్ టీమ్‌లో ప్రధాన భాగంగా మారిపోయాడు. మొహాలీ టెస్టులో అచ్చమైన టెస్టు బ్యాట్స్‌మన్‌లా ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారికంగా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అందుకే కాబోలు తొలి టెస్టు తర్వాత విరాట్ ‘అమూల్యమైన’ ఆటగా జయంత్ ప్రదర్శనను ప్రస్తుతించాడు. లెగ్‌స్పిన్ నుంచి ఆఫ్‌స్పిన్ వైపు విశాఖపట్నంలో జయంత్ తన తొలి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఆటగాళ్లంతా తమ తల్లుల పేర్లను జెర్సీలపై ధరించారు. అతడికి ఇచ్చిన జెర్సీపై తల్లి పేరు లక్ష్మీ అని రాసి ఉంది. నిజానికి అతని తల్లి 17 ఏళ్ల క్రితమే చనిపోరుుంది. తనను ఈ స్థారుుకి తీసుకు వచ్చింది తన ‘రెండో అమ్మ’ జ్యోతి యాదవ్ అని చెప్పుకున్న జయంత్... పొరపాటున ఆమె పేరు రాయలేదని, కానీ తన గుండెల్లో ఉంటావంటూ కెమెరా ముందు మాట్లాడిన తీరు అందరినీ కదిలించింది. సాధారణ నేపథ్యం ఉన్న చాలా మంది కుర్రాళ్లలాగే జయంత్ కూడా చిన్నప్పుడు గల్లీల్లోనే క్రికెట్‌ను ఆరంభించాడు. అక్కడ అతను లెగ్‌స్పిన్ వేసేవాడు. అరుుతే అతనికంటే పెద్దవారైన ఇద్దరు కజిన్స కూడా లెగ్ స్పిన్నర్లే. దాంతో వారు అతడిని పిలిచి ఇలా కాదు, ఒకే ఇంట్లో ముగ్గురు లెగ్‌స్పిన్నర్లు కుదరదు, నువ్వు మారాల్సిందే అంటూ తేల్చేశారు. దాంతో తాను అప్పుడు ఆఫ్‌స్పిన్‌ను ఎంచుకున్నట్లు జయంత్ చెప్పాడు. హరియాణా జట్టు తరఫున వివిధ వయో విభాగాల స్థారుులో రాణిస్తూ నెమ్మదిగా అతను పైకి ఎదిగాడు. ఇదే క్రమంలో తన బ్యాటింగ్‌ను కూడా మెరుగుపర్చుకుంటూ వచ్చాడు. రంజీల్లో నిలకడ 21 ఏళ్ల వయసులో గుజరాత్‌పై తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడిన జయంత్ ఆరు వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అరుుతే ఆ తర్వాత మిగిలిన సీజన్ మొత్తం విఫలమయ్యాడు. కానీ తర్వాతి ఏడాది జయంత్ బ్యాటింగ్ పదును క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో డబుల్ సెంచరీ (211)తో చెలరేగిన అతను... అమిత్ మిశ్రాతో కలిసి ఎనిమిదో వికెట్‌కు రికార్డు స్థారుులో 392 పరుగులు జోడించాడు. 2014-15 సీజన్లో 33 వికెట్లతో ఆకట్టుకున్న అతను తర్వాతి ఏడాది ఒక మ్యాచ్‌లో సౌరాష్ట్రపై 13 వికెట్లు తీయడంతో భారత ‘ఎ’ జట్టులో స్థానం లభించింది. ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు ఎంపికై నా పెద్దగా మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కానీ దేశవాళీ క్రికెట్లో గత ఏడాది కూడా అద్భుత ప్రదర్శనతో జయంత్ సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఆకట్టుకునే ఆరంభం జయంత్ ముందుగా జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ లెగ్‌స్పిన్నర్ చహల్‌పై కెప్టెన్ ధోని నమ్మకం ఉంచడంతో అతనికి మ్యాచ్ అవకాశం దక్కలేదు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ‘ఎ’తో రెండు మ్యాచ్‌లలో 7 వికెట్లు తీయడం, ఇరానీ కప్ మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టడంతో కివీస్‌తో టెస్టు సిరీస్ కోసం చోటు దక్కింది. చివరకు విశాఖలో వన్డే ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జయంత్, ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన హరియాణా సీనియర్ అమిత్ మిశ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చిన జయంత్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడటంలో సఫలమయ్యాడు. అతను స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొన్న తీరు, పేసర్లు వేసిన షార్ట్ పిచ్ బంతులను చక్కగా అంచనా వేసిన విధానం బ్యాట్స్‌మన్‌గా అతనికి మంచి మార్కులు వేశారుు. అశ్విన్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 64 పరుగులు జోడించడం జట్టుకు కలిసొచ్చింది. ‘అతని ఆట చూస్తే చాలా సంతోషంగా అనిపించింది. సానుకూల దృక్పథంతో జయంత్ బ్యాటింగ్ చేశాడు. దాంతో మా భాగస్వామ్యం మరింత బాగా కొనసాగింది’ అని అశ్విన్ ఆ ఇన్నింగ్స గురించి వ్యాఖ్యానించాడు. మొరుున్ అలీని తొలి వికెట్‌గా సాధించడంలో డీఆర్ఎస్ను కచ్చితత్వంతో వినియోగించిన తీరు, హమీద్ రనౌట్ కూడా జయంత్‌ను ప్రత్యేకంగా నిలబెట్టారుు. ఇక మూడో టెస్టులోనైతే అతని బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ టెస్టులో రూట్, బెరుుర్స్టోల వికెట్లు తీసిన బంతులు జయంత్ ప్రతిభకు మచ్చుతునకలు. జోరు కొనసాగిస్తాడా..? రాజ్‌కోట్‌లో డ్రా తర్వాత వైజాగ్‌లో మిశ్రాను కాదని కోహ్లి... జయంత్‌ను ఎంచుకోవడంపై విమర్శలు వచ్చారుు. అందరినీ ఈ నిర్ణయం ఆశ్చర్యపరచింది. ప్రత్యర్థి జట్టులో ఏడుగురు ఎడమ చేతివాటం బ్యాట్స్‌మెన్ ఉండటంతో రెండో ఆఫ్‌స్పిన్నర్‌ను కోహ్లి ఎంచుకున్నాడు. అక్కడి ప్రదర్శన అతనికి మరో అవకాశం ఇప్పించింది. ప్రతీసారి ఇదీ సాధ్యమేనా అంటే సందేహమే అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్ అశ్విన్ జట్టులో ఉన్నాడు. అతను ఉండగా సాధారణంగా మరో ఆఫ్స్పిన్నర్కు అవకాశమే ఉండదు. ఇటీవల అశ్విన్ పూర్తి స్థారుు బ్యాట్స్‌మన్‌గా కనిపిస్తున్నాడు. అన్నింటికి మించి జయంత్ శైలి అచ్చుగుద్దినట్లు అశ్విన్‌నే పోలి ఉంటుంది. కాబట్టి మున్ముందు జయంత్‌ను ఈ సమీకరణం ఇబ్బంది పెట్టవచ్చు. ఆడిన ఒకే ఒక వన్డేలో అతని పూర్తి సామర్థ్యం బయటపడలేదు. కాబట్టి తాజా ప్రదర్శన ఒక్కటే జయంత్‌కు భవిష్యత్తుపై భరోసా ఇవ్వలేదు. అరుుతే ఏ ఆటగాడైనా తనకు దక్కిన అవకాశాలను పూర్తి స్థారుులో సద్వినియోగం చేసుకోవడమే అతని చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో మాత్రం జయంత్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు. కాబట్టి అతను ఇక ముందు తన సత్తాను చాటాలని, మరింత పట్టుదలతో రాణించాలని ఆశిద్దాం. -సాక్షి క్రీడా విభాగం -
ఈ - వ్యర్థాలతో అద్భుతం..!
కొత్తగా ఆలోచించే వారినే విజయం వరిస్తుందంటారు. జయంత్ విషయంలో ఇది అక్షరాల నిజం. తన తండ్రి చేసే వ్యాపారాన్ని చూసి స్ఫూర్తిపొందిన ఈ 17 ఏళ్ల కుర్రాడు అద్భుతాన్ని సృష్టించాడు. ఇంతకి ఎవరీ జయంత్, ఏం సాధించాడు అంటారా. అరుుతే ఈ స్టోరీ చదవండి.... జయంత్ నివాసం ముంబైలోని ఘట్కొపర్. తండ్రి రవీంద్ర పరాబ్ పాడైపోరుున ఎలక్ట్రానిక్ వస్తువుల స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తండ్రి చేసే వ్యాపారాన్ని చూస్తూ పెరిగిన జయంత్‌కు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఈ రోజు ఈ - వ్యర్థంతో కంప్యూటర్ తయారీకి నాంది పలికింది. మూడో తరగతి నుంచే... జయంత్ మూడో తరగతిలో ఉన్నప్పుడే స్కూల్లో కంప్యూటర్ క్లాస్‌లకు వెళ్లేవాడు. అప్పుడే జయంత్‌కు కంప్యూటర్లపై మక్కువ పెరిగింది. ‘ఆఫీసు, బ్యాంక్, దుకాణాల్లో ఎక్కడ చూసిన కంప్యూటర్లు కనిపించడంతో నా ఆసక్తి రెట్టింపు అరుుంది’అని జయంత్ చెబుతున్నాడు. ఐదో తరగతిలో స్కూల్లోనే కాకుండా బయట ప్రైవేటు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లడం ప్రారంభించాడు. ఇక్కడే జయంత్ కంప్యూటర్ ఎలా ఉపయోగించాలన్న దానిపై పూర్తి అవగాహానను సాధించాడు. తండ్రే తొలి గురువు.. ఈ కంప్యూటర్లను తయారు చేయడంలో తన తండ్రి పాత్ర ఎంతగానో ఉందటాడు జయంత్. తండ్రే గురువుగా మారి స్క్రాప్‌లో భాగంగా వచ్చిన ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి విడి భాగాలను ఎలా వేరు చేయాలో వివరించేవాడు. జయంత్లోని ఉత్సాహాన్ని చూసిన అతని తండ్రి ఒక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ను జయంత్‌కు కొనిచ్చాడు. ఇంటర్ నెట్ సదుపాయం కూడా ఉండడంతో తనకు తోచిన ప్రయోగాలను చేయడం మొదలు పెట్టాడు. ఈ - వ్యర్థాలతో కంప్యూటర్ను రూపొందించే క్రమంలో జయంత్ తన ఆలోచనలకు పదును పెట్టాడు. ఈసీజీతో మానిటర్... జయంత్ తండ్రి ఒకసారి వ్యాపారంలో భాగంగా హాస్పిటల్‌లోని పాడైపోరుున ఈసీజీని ఇంటికి తీసుకొచ్చాడు. దాన్ని పరీక్షించిన జయంత్ ఈసీజీ మిషన్‌ను మార్పుచేర్పులు చేసి ఒక మానిటర్ల తయారుచేశాడు. చివరగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సేకరించిన పలు వ్యర్థాలతో 9 ఇంచుల మానిటర్, 2జీబీ రామ్, 1 జీబీ హార్డ్ డిస్క్‌లతో ఒక కంప్యూటర్ను తయారుచేశాడు. ఇది లెనైక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీంట్లో ఇన్‌బిల్ట్ స్పీకర్లు, బ్లూటూత్, వైఫై వంటి సదుపాయాలు కూడా ఉన్నారుు. జయంత్ తయారుచేసిన ఈ కంప్యూటర్‌కు పలువురి అభినందనలతో పాటు, ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఒక సర్టిఫికేట్ అందజేశారు. ఈ-వేస్ట్ సమస్యకు చెక్... ఇలా వ్యర్థ పదార్థాలతో కంప్యూటర్లను రూపొందించడం వల్ల ఈ - వేస్ట్ సమస్యకు చెక్ పెట్టవచ్చంటున్నాడు జయంత్. ‘మొత్తం ఈ వ్యర్థాలను సరిగ్గా ఉపయోగించుకోవాలే కానీ అద్భుతాలు సృష్టించవచ్చు. అంతేకాకుండా దీంతో స్క్రాప్ వ్యాపారులతో పాటు చెత్త సేకరణ (రాగ్-పికర్స్) వాళ్లకు కూడా ఉపాధి కల్పించవచ్చు. రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలతో కూడిన కంప్యూటర్ అభివృద్ధికి కృషిచేస్తాను. ప్రస్తుత రోజుల్లో అన్ని రంగాల్లో కంప్యూటర్ వాడకం కచ్చితంగా మారిన నేపథ్యంలో తక్కువ ధరలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ అందించేందకు ఇలాంటి మరెన్నో ఆవిష్కరణలు జరగాలి’ అని అంటున్నాడు జయంత్. ఫలించిన కృషి... జయంత్ అన్ని ఏళ్లుగా చేస్తోన్న కృషి ఎట్టకేలకు తన 17వ ఏట ఫలించింది. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు స్కూల్లో జరిగిన ఎగ్జిబిషన్లో తను ఎంతో కష్టపడి తయారుచేసిన కంప్యూటర్ను ప్రదర్శనకు ఉంచాడు. -
హాస్యమాల జంధ్యాల
సంగీతం, సాహిత్యం, హాస్యం ఈ మూడు కలిస్తేనే జంధ్యాల. ఈయన పేరు వెంకటదుర్గా శివసుబ్రమణ్య శాస్త్రి. డెబ్బయ్యో దశకంలో ఆధునిక తెలుగు సినిమాల్లో తన హాస్య సంభాషణలతో నవ్వుల హరివిల్లును పూయించిన ఘనత కేవలం జంధ్యాలకు మాత్రమే దక్కుతుంది. మనందరినీ కడుపుబ్బ నవ్వించిన జంధ్యాల జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం. అన్నానగర్, న్యూస్‌లైన్ : రాజ్‌కపూర్ తన ఆత్మగురువు అని జం ద్యాల ఒకసారి వేటూరితో అన్నారట. అందుకేనేమో ఆయన చిత్రంలో ప్రేమ గొప్పదనాన్ని గురించి తెలిపే ఒక పాట తప్పనిసరిగా ఉండాల్సిందే. అది కూడా వేటూరి సుందరరామ్మూర్తిది మాత్రమే ఉండేలా ఆయన శ్రద్ధ వహించేవారు. జంధ్యాల మనసు వెన్నముద్ద అయితే ఆయన కళ్లు వెన్నెల పొద్దులు, ఆయన మాటలు జలపాత సున్నితాలు, నవరసాలన్నింటిలోనూ జంధ్యాల హాస్య రసాన్నే అవపోసన పట్టారు. నవ్వులను పండించారు. పెద్ద కళ్లేపల్లెలో మూడు రోజుల పాటు సాగే తెలుగు వసంతోత్సవాలు జంధ్యాలకు అత్యంత ఇష్టమైనవి. ఎందుకంటే అక్కడ ఆయన తన జోకులతో కళా రసికులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించడమే కాక తన పొట్టను కూడా చెక్కలు చేసుకునేలా నవ్వేవారు. వేలుగాడు, స్టువర్టుపురం పోలీసు స్టేషన్, స్టేషన్ మాస్టరు సినిమాల్లో జంధ్యాల రాసిన సంభాషణలు ప్రాసక్రీడగా జగత్ విఖ్యాతమయ్యాయి. ముళ్లపూడిని గురువుగా భావించే జంధ్యాలకు బ్రాహ్మణీకపు ప్రథమ కోపాలూ, గ్రంధాక్షరీ శాపాలు కూడా హాస్యంలోని ప్రధాన వస్తువులే అయ్యూయి. రెండు జళ్ల సీత సినిమాలో జంధ్యా ల రాసిన ఊరగాయ స్త్రోత్రాలు - దండకాలూ, మాయాబజార్ సినిమాలోని పింగళివారు రాసిన గోంగూరోపాఖ్యానాన్ని తల పింప చేస్తాయి. వేటూరి అంటే జంధ్యాలకు ఆరోప్రాణం అందుకే ఆయన చేత మల్లెపూవు చిత్రంలో కకుమభంజనం స్వాములవారి పాత్ర వేయించి మురిసిపోయారు. అందుకే జంధ్యాల మృతి చెందినపుడు వేటూరు దుఃఖం ఆపుకోలేక జంధ్యాల జీవితం ఎంత చిన్నదైనా.. అది తనకు మనుచరిత్రే అని బాధపడ్డారు. ఒక సభలో బాలు, ఎస్.జానకి, శైలజ ప్రసంగించి శ్రోతల కనుల వెంట నీరు తెప్పిస్తే ఆ సభకే అతిథిగా వచ్చిన జంధ్యాల మైకు ముందుకొచ్చి ఇంత వరకు ‘పాడు’ మనుషులు ముగ్గురొచ్చి కంట తడి పెట్టించారని ప్రసంగం ప్రారంభించగానే సభలో నవ్వులు మార్మోగాయి. శ్రీరమణ మహర్షి వేదాంతం రమణోపనిషత్తులనే గ్రంధ రూపంలో వచ్చినట్లుగానే జంధ్యాల చమత్కారాలు చెణుకులు కూడా ఒక జం ద్యోపనిషత్తు గ్రంథంగా తేవడానికి ఆయన అభిమానులం తా ప్రయత్నిస్తే భేషుగ్గా ఉంటుంది. కాలధర్మాన్ని, జీవనతత్వాన్ని 50ఏళ్ల వయసులో గ్రహించిన జంధ్యాల తృతీయ పురుషార్థాన్ని దాటి వెళ్లిపోయిన మహాజ్ఞాని. ఆయన గుర్తుగా మిగిలినవి హాస్య చిత్రాలు మాత్రమే. ఇదీ ప్రస్థానం జంధ్యాల 1951 జనవరి 14(మకర సంక్రాంతి రోజు)న నరసాపురంలో జన్మించారు. విజయవాడలో బీకాం గ్రాడ్యుయేట్‌గా బయటకు వచ్చారు. సిరిసిరి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. 1983లో జంధ్యాల 12 నెలల వ్యవధిలో 80 సినిమాలకు మాటలు రాశారు. 1984, 87, 1992ల్లో ఆనందభైరవి, పడమటి సంధ్యారా గం, ఆపద్బాంధవుడు చిత్రాలకు ఉత్తమ దర్శక, ఉత్తమ కథ, ఉత్తమ సంభాషణల రచయతగా మూడు సార్లు నంది అవార్డులు పొందారు. రెం డు రెళ్లు ఆరు, ఆపద్బాంధవుడు చిత్రాల్లో నటించారు. చూపులు కలిసిన శుభవేళ, భారతీయుడు, ఇద్దరు, పడమట సంధ్యారాగం, అరుణాచలం, భామనే సత్య భామనే చిత్రాల్లోని కొన్ని ముఖ్య పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. 40 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారత ప్రభుత్వం జంధ్యాలను పద్మశ్రీతో సత్కరించింది. సీఏ చదవాలని చెన్నైకు వచ్చి గుమ్మడి ప్రోద్బలంతో సంభాషణలు - కథా రచయితగా అవతారమెత్తారు. ఆత్మాహుతి, గుండెలు మార్చబడును, ఏక్‌దిన్‌కే సుల్తాన్ అనేది జంధ్యాలకు పేరు తెచ్చిన నాటకాలు. ఇందులో ఏక్ దిన్కా సుల్తాన్ పది వేల సార్లు ప్రదర్శితమవడమే కాకుండా, దాని తాలుకూ ముద్రణా ప్రతులు 15 సార్లు పునర్ముద్రణకు నోచుకున్నాయి.