ఫైనల్లో భారత్‌  | Young India team qualified for the final match in the Asia Cup | Sakshi
Sakshi News home page

ఫైనల్లో భారత్‌ 

Published Fri, Dec 14 2018 3:21 AM | Last Updated on Fri, Dec 14 2018 3:21 AM

Young India team qualified for the final match in the Asia Cup - Sakshi

కొలంబో: ఎమర్జింగ్‌ ఆసియా కప్‌లో ఓటమి ఎరుగని యువ భారత్‌ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీఫైనల్లో 7 వికెట్లతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసింది. మొదట బౌలింగ్‌లో స్పిన్నర్లు మయాంక్‌ మార్కండే (4/38), జయంత్‌ (2/29), పేసర్‌ అంకిత్‌ రాజ్‌పుత్‌ (2/19), తర్వాత బ్యాటింగ్‌లో హిమ్మత్‌ సింగ్‌ (59 నాటౌట్‌; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్‌ రాణా (60 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్‌ పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 44.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది.

కెప్టెన్‌ రిజ్వాన్‌ (67; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షకీల్‌ (62; 7 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్‌ కూడా తడబడింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (20; 2 ఫోర్లు, 1 సిక్స్‌), అంకుశ్‌ బెయిన్స్‌ (9), ములాని (19; 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో హిమ్మత్, రాణా అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రెండో సెమీస్‌ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై గెలి చింది. శనివారం ఇక్కడే జరిగే టైటిల్‌ పోరులో భారత్, లంక అమీతుమీ తేల్చుకుంటాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement