భారత్‌దే విజయం | india won football match on pakistan | Sakshi
Sakshi News home page

భారత్‌దే విజయం

Aug 18 2014 1:26 AM | Updated on Oct 2 2018 8:39 PM

భారత్‌దే విజయం - Sakshi

భారత్‌దే విజయం

తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది.

పాక్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్

బెంగళూరు: తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. 44వ నిమిషంలో రాబిన్‌సింగ్ భారత్ తరఫున గోల్ సాధించాడు. అయితే ఈ గోల్ నిజానికి కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు.

కార్నర్ నుంచి లాల్‌రిందికా రాల్టే ఇచ్చిన కిక్‌ను రాబిన్ అందుకుని ఫ్లిక్ చేయగా చెత్రి గోల్‌గా మలిచాడు. కానీ మ్యాచ్ కమిషనర్ అనూహ్యంగా ఈ గోల్‌ను రాబిన్ ఖాతాలో వేశారు. 69వ నిమిషంలో రాబిన్ రెండోసారి ఎల్లో కార్డ్‌కు గురి కావడంతో భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకుంది. బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement