Robin Singh
-
యూఏఈ క్రికెట్ డైరెక్టర్‌గా రాబిన్ సింగ్
దుబాయ్ : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్‌కు అరుదైన అవకాశం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డైరెక్టర్‌గా 56 ఏళ్ల రాబిన్ సింగ్‌ను నియమించారు. 1989 నుంచి 2001 మధ్యకాలంలో రాబిన్ సింగ్ భారత్ తరఫున ఒక టెస్టు, 136 వన్డేల్లో బరిలోకి దిగాడు. కొన్నేళ్లుగా శిక్షణలో రాబిన్ సింగ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఐపీఎల్లో చాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్, కరీబియన్ క్రికెట్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు శిక్షణ బృందంలో రాబిన్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు యూఏఈ క్రికెట్ కష్టకాలంలో ఉంది. ఇటీవల యూఏఈ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫిక్సింగ్‌లో భాగమైన కెప్టెన్ మొహమ్మద్ నవీద్‌తోపాటు పలువురు సీనియర్ క్రికెటర్లపై వేటు కూడా పడింది. మూడేళ్లుగా యూఏఈ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డగ్ బ్రౌన్‌ను కూడా తొలగించారు. -
రవిశాస్త్రిపై సంచలన వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: ఒకవైపు రవిశాస్త్రి పర్యవేక్షణలో టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించిందని క్రికెట్ సలహా కమిటీ((సీఏసీ) సభ్యుల్లో ఒకరైన అన్షుమన్ గైక్వాడ్ పేర్కొంటే, అసలు కోచ్‌గా రవిశాస్త్రి ఏం సాధించాడని భారత మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ ప్రశ్నించాడు. రవిశాస్త్రి ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ ఏ ఒక్క ఐసీసీ మేజర్ టోర్నమెంట్లను గెలవలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు.దాంతో కోచ్ మార్పు అనేది టీమిండియాకు ఎంతో అవసరమనే విషయాన్ని రాబిన్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశాడు. (ఇక్కడ చదవండి: కోచ్‌గా రవిశాస్త్రి వైపే మొగ్గు?) ‘ రవిశాస్త్రి కోచ్‌గా చాలాకాలం నుంచి కొనసాగుతున్నాడు. కానీ ఐసీసీ నిర్వహించే ఏ ఒక్క టోర్నమెంట్‌ను కూడా రవిశాస్త్రి పర్యవేక్షణలోని టీమిండియా గెలవలేదు. ఇందుకు వరుసగా రెండు వన్డే వరల్డ్‌కప్‌లతో పాటు టీ20 వరల్డ్‌కప్ ఉదాహరణ. 2015, 2019 వరల్డ్‌కప్‌ల్లో భారత్ సెమీస్‌తోనే సరిపెట్టుకుంది. ఇక 2016లో జరిగిన టీ20 వరల్డ్‌కప్‌లో కూడా భారత్ సెమీస్ అడ్డంకిని అధిగమించలేదు. 2023 వన్డే వరల్డ్‌కప్‌కు ఇప్పట్నుంచే సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. దాంతో కోచ్ మార్పు అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంది. అది భారత క్రికెట్‌కు మంచిది’ అని రాబిన్ సింగ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన రాబిన్ సింగ్.. 2007-09 సీజన్లో భారత్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాడు. మరొకవైపు అండర్-19, భారత్-ఏ జట్లకు సైతం ఫీల్డింగ్ కోచ్‌గా చేసిన అనుభవం రాబిన్‌కు ఉంది. ఇక ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. కొన్ని రోజుల క్రితం టీమిండియా ప్రధాన కోచ్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌లకు సంబంధించి బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ బాధ్యతలను కపిల్ దేవ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల సీఏసీ కమిటీకి అప్పచెప్పింది. -
టీమిండియాలో ప్రక్షాళన జరగాల్సిందే : మాజీ క్రికెటర్
న్యూఢిల్లీ : భారత జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. రవిశాస్త్రి పర్యవేక్షణలో కోహ్లిసేన పలు ఐసీసీ టోర్నీలు ఓడిందని, తదుపరి ప్రపంకప్‌కు సిద్ధమయ్యేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. ప్రధాన కోచ్ మార్పు కూడా అనివార్యమని చెప్పాడు. బీసీసీఐ ఆహ్వానం మేరకు ఈ పదవికి దరఖాస్తు చేసుకున్న రాబిన్ సింగ్.. జట్టును నడిపించే సత్తా తనకుందని, తన అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ‘ప్రస్తుత కోచ్ పర్యవేక్షణలో భారత్ రెండు వరుస ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లోనే నిష్క్రమించింది. టీ20 ప్రపంచకప్‌ల్లో కూడా సానుకూల ఫలితం రాలేదు. ఇప్పుడు 2023 ప్రపంచకప్‌కు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. జట్టులో మార్పులు కూడా అవసరమే. క్షిష్ట పరిస్థితుల్లో కోచ్ పాత్ర కీలకం. పరిస్థితులను ఆకలింపు చేసుకొని ఆటగాళ్లతో వ్యూహాలు రచించాల్సి ఉంటుంది. ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సి ఉంటుంది. అది ఆటను సాంకేతికంగా అర్థం చేసుకున్నప్పుడే సాధ్యమవుతోంది.’ అని రాబిన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రపంచకప్-2019లో భారత్-న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్‌లో తాను కోచ్‌గా ఉంటే ఏం చేసేవాడినో కూడా వివరించాడు. ‘ బంతి స్వింగ్ అవ్వడంతో రోహిత్ శర్మ త్వరగా ఔటయ్యాడు. ఆ సమయంలో కోహ్లిని పంపించకుండా మరో టాపర్డర్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను ఆడించేవాడిని. నెం.4గా కోహ్లిని పంపించి నెం.5లో ధోనిని ఆడించేవాడిని. అప్పుడు కోహ్లి-ధోని మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారు. చివర్లో హార్ధిక్ పాండ్యా, రిషభ్ పంత్, రవీంద్ర జడేజాలు పవర్ హిట్టింగ్తో మిగతా పనిని పూర్తి చేసేవారు’ అని తన వ్యూహాన్ని రాబిన్ సింగ్ వెల్లడించాడు. భారత్ తరఫున 136 వన్డేలు, ఒక్క టెస్ట్‌కు ప్రాతినిథ్యం వహించిన రాబిన్ సింగ్‌కు కోచ్‌గా 15 ఏళ్ల అనుభవం ఉంది. 2007-09 మధ్య భారత జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా పని చేసాడు. భారత అండర్-19, ఏ జట్లకు సైతం కోచ్‌గా సేవలందించాడు. ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టుకు సహాయ కోచ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం భారత హెడ్ కోచ్ పదవి కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. అయితే కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) మాత్రం ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఏసీలో సభ్యుడైన అన్షుమన్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవిశాస్త్రి బాగా పని చేశాడని అన్షుమన్ గైక్వాడ్ కితాబు ఇవ్వడంతో అతనికే మరోసారి కోచ్ పగ్గాలు అప్పచెబుతారానే ప్రచారం జోరందుకుంది. ఇక భారత ప్రధాన కోచ్ రేసులో రాబిన్‌సింగ్‌తో పాటు టామ్ మూడీ, మహేళ జయవర్ధనే, మైక్ హస్సెన్ తదితరులున్నట్లు తెలుస్తోంది. (చదవండి: రవిశాస్త్రి వైపే మొగ్గు?) -
'విరాట్ తరువాత అతడే బెస్ట్'
ముంబై: ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ రోహిత్ శర్మపై ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. టీ 20 ఫార్మాట్ లో తనదైన ముద్రతో చెలరేగిపోతున్న రోహిత్.. ఈ ఫార్మాట్ కు అతికినట్లు సరిపోయే ఆటగాడని కొనియాడాడు. ఈ ఫార్మాట్ లో టాప్ ఆటగాళ్లలో రోహిత్ కూడా ఒకడన్నాడు. టీ 20ల్లో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తరువాత స్థానం రోహిత్ శర్మదేనని రాబిన్ తెలిపాడు. 'అన్ని ఫార్మాట్లలో రోహిత్ శర్మ పూర్తి స్థాయి సక్సెస్ సాధించలేకపోవచ్చు. ప్రత్యేకంగా టెస్టు క్రికెట్ కు, పొట్టి ఫార్మాట్ కు చాలా వ్యత్యాసం ఉంటుఉంది. టీ 20 ఫార్మాట్ టాప్ ఆటగాళ్ల జాబితాలో స్టార్ ఆటగాడు విరాట్ తరువాత స్థానం కచ్చితంగా రోహిత్ శర్మదే'అని రాబిన్ పొగడ్తల్లో ముంచెత్తాడు.ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితం మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడని, అతడు గాడిలో పడడం తమ టీమ్‌కు అనుకూలించే అంశమని చెప్పాడు. తనదైన రోజున అతడిని ఆపడం ప్రత్యర్థుల తరం కాదని వ్యాఖ్యానించాడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 17 బంతుల్లో 2 ఫోర్లు,6 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి ముంబైకు అద్భుతమైన విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. -
పొలార్డ్ పై ప్రశంసలు
ముంబై: గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ముంబై ఇండియన్స్ ఆల్-రౌండర్ కీరన్ పొలార్డ్ ఎట్టకేలకే పుంజుకున్నాడు. ఫామ్ అందుకుని తనదైన శైలిలో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్ 17 బంతుల్లో 51 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ ట్రినిడాడ్ అండ్ టొబాగొ ఆల్-రౌండర్ ఫామ్ అందుకోవడం పట్ల ముంబై ఇండియన్స్ అసిస్టెంట్ కోచ్ రాబిన్ సింగ్ సంతోషం వ్యక్తం చేశాడు. ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితం మార్చేసే సత్తా ఉన్న ఆటగాళ్లలో పొలార్డ్ ఒకడని, అతడు గాడిలో పడడం తమ టీమ్‌కు అనుకూలించే అంశమని చెప్పాడు. తనదైన రోజున అతడిని ఆపడం ప్రత్యర్థుల తరం కాదని వ్యాఖ్యానించాడు. అనుభవం పెరిగేకొద్ది అతడి ఆటతీరు మెరుగవుతోందని, ఐపీఎల్లో రోజురోజుకు అతడు రాటు దేలుతున్నాడని వివరించాడు. గాయం నుంచి కోలుకుని మైదానంలో అడుగుపెట్టేందుకు పొలార్డ్ చాలా కష్టపడ్డాడని వెల్లడించాడు. అతడి ఫిట్నెస్ పూర్తి సంతృప్తిగా ఉన్నామని చెప్పాడు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కీలక ఇన్నింగ్స్ ఆడుతూ నాయకత్వ పటిమను నిరూపించుకుంటున్నాడని రాబిన్ తెలిపాడు. తమ జట్టులో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో అతడు స్వేచ్ఛగా ఆడుతున్నాడని వెల్లడించాడు. -
శ్రీలంకపై భారత్ గెలుపు
తిరువనంతపురం: దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (సాఫ్) చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక జట్టును 2-0తో ఓడించింది. త్రివేండ్రం అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రాబిన్ సింగ్ చేశాడు. ప్రథమార్ధం హోరాహోరీగా సాగినా ఆ తర్వాత భారత్ దూకుడు పెంచింది. ఫలితంగా 51వ నిమిషంలో సునీల్ చెత్రి పాస్‌ను రాబిన్ గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత 73వ నిమిషంలో చెత్రి హెడర్‌తో పంపిన బంతిని రాబిన్ మరోసారి గోల్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. -
'శక్తివంతంగా భారత ఫుట్ బాల్'
కోల్ కతా: భారత్ లో ఫుట్ బాల్ పూర్వ వైభవం దిశగా పయనిస్తోందని ఢిల్లీ డైనమోస్ స్టార్ స్ట్రయికర్ రాబిన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. భారత్ లో ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) ప్రవేశపెట్టిన అనంతరం దేశ ఫుట్ బాల్ కు మంచి రోజులు వచ్చాయన్నాడు. భారత్ లో ఫుట్ బాల్ కు రోజు రోజుకూ ఆదరణ పెరగడానికి ఐఎస్ఎల్ ఎంతగానో ఉపయోగపడిందన్నాడు. రానున్న రోజుల్లో భారత్ ఫుట్ బాల్ మరింత శక్తివంతంగా రూపాంతరం చెందుతుందన్నాడు. ఢిల్లీ జట్టుకు ఆటగాడిగా, కోచ్ గా సేవలందిస్తున్న బ్రెజిల్ స్టార్ రాబర్టో కార్లోస్ పై రాబిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఓ మేటి ఆటగాడితో కలిసి పని చేయడం చాలా ఆహ్లాదంగా ఉందన్నాడు. అతని నేతృత్వంలో పని చేయడంతో యూరోపియన్ ఫుట్ బాల్ గురించి అనేక విషయాలను తెలుసుకునే ఆస్కారం భారత ఆటగాళ్లకు దక్కుతుందన్నాడు. ప్రస్తుతం ఢిల్లీ జట్టలో అనేక మంది కీలక ఆటగాళ్లతో నిండివుందని రాబిన్ పేర్కొన్నాడు. తొలి ఐఎస్ఎల్ సీజన్ కు దూరంగా ఉన్న రాబిన్.. రెండో ఎడిషన్ లో ఢిల్లీ డైనోమోస్ తరపున బరిలోకి దిగాడు. ఇప్పటి వరకూ ఐదు గేమ్ లు ఆడిన రాబిన్ కేవలం ఒక గోల్ మాత్రమే నమోదు చేశాడు. -
సెప్టెంబర్ 14న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: మాధవి (నటి), రాబిన్ సింగ్ (మాజీ క్రికెటర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 4. ఇది రాహుసంఖ్య కావడం వల్ల వీరు ఈ సంవత్సరం స్థిరాస్తులు కొంటారు. వారసత్వపు ఆస్తిపాస్తులు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. కోర్టుకేసుల నుండి విముక్తి లభిస్తుంది. వివాదాలలో చిక్కుకున్న ఆస్తులను గెలుచుకుంటారు. అయితే రాహుగ్రహ ప్రభావం వల్ల ఈ సంవత్సరం న్యాయసంబంధమైన, చట్టసంబంధమైన వివాదాలలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడటం మంచిది. పుట్టిన తేదీ 14. ఇది బుధసంఖ్య కావడం వలన చేసే పనిలో నైపు ణ్యం చూపిస్తారు. విదేశీయానం చేస్తారు. రాజకీయ నాయకులకు గౌరవమర్యాదలు, పదవులు లభిస్తాయి. గ్రీన్‌కార్డ్ లేదా స్థిరనివాసం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మేనేజ్మెంట్ రంగంలోని వారికి, చార్టెర్డ్ ఎకౌంటెంట్లకు, ఫైనాన్స్ రంగ ంలోని వారికి కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగా పుంజుకుంటారు. లక్కీ నంబర్లు: 1, 4,5,6,8; లక్కీ కలర్స్: పర్పుల్, బ్లూ, వయోలెట్, గ్రీన్; లక్కీ డేస్: బుధ, శుక్ర, శని, ఆది, సోమ వారాలు. సూచనలు: కోపాన్ని తగ్గించుకోవడం, సర్పసూక్త సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, వృద్ధులకు, అనాథలకు, వితంతువులకు సహాయం చేయడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయడం. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
భారత్‌దే విజయం
పాక్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్ బెంగళూరు: తొమ్మిదేళ్ల అనంతరం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన స్నేహపూర్వక ఫుట్‌బాల్ మ్యాచ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. రెండు మ్యాచ్‌ల్లో భాగంగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో 1-0తో నెగ్గింది. 44వ నిమిషంలో రాబిన్‌సింగ్ భారత్ తరఫున గోల్ సాధించాడు. అయితే ఈ గోల్ నిజానికి కెప్టెన్ సునీల్ చెత్రి సాధించాడు. కార్నర్ నుంచి లాల్రిందికా రాల్టే ఇచ్చిన కిక్‌ను రాబిన్ అందుకుని ఫ్లిక్ చేయగా చెత్రి గోల్‌గా మలిచాడు. కానీ మ్యాచ్ కమిషనర్ అనూహ్యంగా ఈ గోల్‌ను రాబిన్ ఖాతాలో వేశారు. 69వ నిమిషంలో రాబిన్ రెండోసారి ఎల్లో కార్డ్‌కు గురి కావడంతో భారత్ పది మందితోనే ఆడాల్సి వచ్చింది. అయినప్పటికీ పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌ను కాపాడుకుంది. బుధవారం రెండో మ్యాచ్ జరుగనుంది.