దుబాయ్ : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్‌కు అరుదైన అవకాశం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డైరెక్టర్‌గా 56 ఏళ్ల రాబిన్ సింగ్‌ను నియమించారు. 1989 నుంచి 2001 మధ్యకాలంలో రాబిన్ సింగ్ భారత్ తరఫున ఒక టెస్టు, 136 వన్డేల్లో బరిలోకి దిగాడు. కొన్నేళ్లుగా శిక్షణలో రాబిన్ సింగ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఐపీఎల్‌లో చాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్, కరీబియన్ క్రికెట్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు శిక్షణ బృందంలో రాబిన్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు యూఏఈ క్రికెట్ కష్టకాలంలో ఉంది. ఇటీవల యూఏఈ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫిక్సింగ్‌లో భాగమైన కెప్టెన్ మొహమ్మద్ నవీద్‌తోపాటు పలువురు సీనియర్ క్రికెటర్లపై వేటు కూడా పడింది. మూడేళ్లుగా యూఏఈ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డగ్ బ్రౌన్‌ను కూడా తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment