former crickter
-
'పాయింట్ బ్లాక్‌లో గన్.. నగ్నంగా నిలబెట్టి దారుణంగా కొట్టారు'
ఆసీస్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ మెక్ గిల్ కిడ్నాప్ వ్యవహారం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతేడాది మార్చిలో దుండగులు సిడ్నీలోని తన నివాసంలోనే మెక్‌గిల్‌ను కిడ్నాప్ చేశారు. ఇది జరిగిన 15 నెలల తర్వాత మెక్‌గిల్ కిడ్నాప్ వ్యవహారంపై ఎట్టకేలకు నోరు విప్పాడు. ‘ఆ ఘటనను తలుచుకుంటేనే చాలా భయమేస్తోంది. మనం అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదరని కోరుకుంటున్నా. కొందరు దుండగులు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియదు. నా కళ్లకు గంతలు కట్టి కార్ లో పడేశారు. నేను కార్లోకి ఎక్కనంటే ఆయుధాలతో బెదిరించారు. సుమారు గంటన్నర పాటు కార్లో ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనే దానిపై స్పష్టత లేదు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి నా బట్టలన్నీ విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి దారుణంగా కొట్టారు. ఆ తర్వాత ఒక చోట నన్ను విడిచి వెళ్లిపోయారు. ఎక్కడున్నానో అర్థం కాక మూడు గంటల పాటు అలాగే నిల్చుండిపోయా. మళ్లీ వచ్చిన దుండగులు కార్లో తీసుకెళ్లి బెల్మోర్ సిటీలో విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అక్కడి స్థానికుల సహాయంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని సిడ్నీలోనే ఒక హోటళ్లో రెండు-మూడు వారాల పాటు గడిపాను. ఆ తర్వాత తెలిసిన స్నేహితుడిని ద్వారా ఫ్రేజర్ ఐలాండ్‌లోని నా గెస్ట్ హౌస్‌లో మరికొన్ని వారాలు గడిపాను. నన్ను కిడ్నాప్ చేసిన దుండగులు అరెస్ట్ అయ్యారని తెలుసుకొని తిరిగి ఇంటికి చేరుకొన్నా.. కానీ ఆ మూడు నెలలు మాత్రం చాలా నరకం అనుభవించా’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే మొదట్లో మెక్ గిల్‌ను డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని చాలా మంది భావించారు. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. మత్తు పదార్థాల సరఫరా విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని.. అందుకే దుండగులతో కిడ్నాప్ చేయించి వార్నింగ్ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 1998-2008 మధ్య ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. 44 టెస్టులాడిన మెక్‌గిల్ 208 వికెట్లు.. మూడు వన్డేలాడి 6 వికెట్లు తీశాడు. చదవండి: 'ఒక శకం ముగిసింది'.. టెస్టులకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై ENG vs NED: నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోస .. బంతి కోసం చెట్లు, పుట్టల్లోకి -
పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..
పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.. జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది దీంతో రంగింలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. తప్పు తేలితే ఎవర్ని వదిలిపెట్టమని.. నదీమ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని.. ఇప్పటికే అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ స్పష్టం చేసింది. మహిళా క్రికెటర్ ఫిర్యాదు ప్రకారం.. ''ముల్తాన్‌కు చెందిన నేను కొన్నేళ్ల క్రితం పీసీబీ ఉమెన్స్ ట్రయల్స్ కోసం వచ్చాను. అక్కడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు దక్కేలా తాను చేస్తానని.. అంతేగాక ఎంప్లాయ్మెంట్ బోర్డులోనూ పేరు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత చనువు పెంచుకొని లైంగిక వేధింపులకు పాల్పడమే గాక స్నేహితులను తీసుకొచ్చి శారీరకంగా వేధించేవాడు. దీనికి సంబంధించి వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. ఇన్ని రోజులు భరించినప్పటికి ఇక నావల్ల కాలేదు.. అందుకే విషయాన్ని బయటపెట్టా'' అంటూ పేర్కొంది ఇక నదీమ్ ఇక్బాల్ గతంలో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌తో కలిసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్‌ను పంచుకున్నాడు. 50 ఏళ్ల నదీమ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వకార్ యూనిస్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసేవాడని.. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును 20 పరుగులకే కుప్పకూల్చిన ఘనత నదీమ్‌కు ఉందని.. ఆ మ్యాచ్‌లో నదీమ్ ఏడు వికెట్లతో చెలరేగాడు. వకార్‌తో పోటీ పడి వికెట్లు తీయడంతో నదీమ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత అతను ఏనాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేకపోయాడు. 2004లో ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పిన నదీమ్ ఇక్బాల్ 80 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 258 వికెట్లు.. 49 లిస్ట్- ఏ మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. Nadeem Iqbal has been suspended by the PCB over a pending charge of sexual harassment 👇 https://t.co/TsUCdGsHTB — ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2022 చదవండి: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే! -
నా జీతం... రైతు బిడ్డల చదువు కోసం: హర్భజన్
భారత మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడు హర్భజన్ సింగ్ తన పెద్ద మనసు చాటుకున్నాడు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తనకు వచ్చే జీతాన్ని రైతు కుమార్తెల చదువు కోసం, వారి సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హర్భజన్ ‘ట్విటర్’ ద్వారా వెల్లడించాడు. గత ఏడాది డిసెంబర్లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ ఇటీవల పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. -
'నాకు ఆరు నెలల ముందే కరోనా వచ్చింది'
లండన్ : కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్లో చైనాలో మొదలైన కరోనా వైరస్ ఖండాంతరాలను దాటి విజృంభిస్తోంది. కరోనాతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోటికి పైగా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య లక్షల్లో ఉంది. ఈ సంద్భంగా ఇంగ్లండ్ మాజీ ఆల్‌రౌండర్ ఇయాన్ బోథమ్ తనకు ఆరు నెలల ముందే కరోనా సోకిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోమవారం గుడ్ మార్నింగ్ బ్రిటన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో బోథమ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'ఆరు నెలలు ముందే.. అంటే జనవరి మొదట్లోనో లేక డిసెంబర్ చివరిలోనో సరిగ్గా గుర్తులేదు కానీ.. నాకు కరోనా వైరస్ సోకింది. అయితే అప్పట్లో దీనిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో బ్యాడ్ ఫ్లూ అని తప్పుగా అర్థం చేసుకున్నా. అసలు అవి కరోనా లక్షణాలని నాకు అప్పట్లో తెలియదు. సాధారణంగా ఫ్లూ జ్వరం వచ్చినా కూడా లక్షణాలు ఇలాగే ఉంటాయిలే అనుకొని తప్పుగా అర్థం చేసుకొన్నా. దీని గురించి పెద్దగా తెలియకపోవడంతో చాలా రోజులు బాధపడ్డా. కానీ తర్వాత తగ్గిపోయింది. చూద్దాం కరోనా ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో. జనాలు మరికొన్ని రోజులు ఓపికపడితే రాబోయే రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడుతుంది. (టిక్‌టాక్ బ్యాన్: వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్) ఇప్పటికే కరోనా నుంచి తప్పించుకోవడానికి ప్రజలంతా తమ వంతుగా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగించాలని నేను కోరుతున్నా. ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్యా క్రీడలు జరగకపోవడమే మంచిది. మరికొద్ది రోజులు ఓపికపడితే త్వరలోనే క్రీడలు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా ఆటగాళ్లు భౌతికదూరం పాటిస్తూ ఆటను కొనసాగిస్తే మంచిదని కోరుతున్నా. ప్రస్తుతం కరోనా సోకిన క్రీడాకారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. జాగ్రత్తలు తీసుకుంటే చాలు.. మళ్లీ మాములు పరిస్థితి చేరుకుంటారు.' అంటూ చెప్పుకొచ్చాడు. ఇయాన్ బోథమ్ ఇంగ్లండ్ తరఫున 102 టెస్టుల్లో 5200 పరుగులు , 116 వన్డేల్లో 2113 రన్స్ చేశాడు. మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన ఈ ఇంగ్లండ్ ఆటగాడు టెస్ట్‌ల్లో 383, వన్డేల్లో 145 వికెట్లు పడగొట్టాడు. -
కరోనాతో మాజీ క్రికెటర్ మృతి
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల జాఫర్ సర్ఫరాజ్‌కు గత మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిలో జాఫర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. శ్వాసకోస సంబంద వ్యాధితో బాధపడుతున్న జాఫర్ మూడు రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉంచామని వైద్యులు తెలిపారు. (ఆయన చాలా గొప్ప వ్యక్తి : సెహ్వాగ్) లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. జాఫర్ 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. కాగా రిటైర్మంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. కాగా జాఫర్ సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా 1997-98 మధ్యలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా కరోనా వైరస్‌తో గత నెలలో దిగ్గజ పాకిస్తానీ స్వ్కాష్ ప్లేయర్ ఆజమ్ ఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పాకిస్తాన్లో 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 96కు చేరుకుంది. (అందుకే అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు) -
యూఏఈ క్రికెట్ డైరెక్టర్‌గా రాబిన్ సింగ్
దుబాయ్ : భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్‌రౌండర్ రాబిన్ సింగ్‌కు అరుదైన అవకాశం దక్కింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) క్రికెట్ డైరెక్టర్‌గా 56 ఏళ్ల రాబిన్ సింగ్‌ను నియమించారు. 1989 నుంచి 2001 మధ్యకాలంలో రాబిన్ సింగ్ భారత్ తరఫున ఒక టెస్టు, 136 వన్డేల్లో బరిలోకి దిగాడు. కొన్నేళ్లుగా శిక్షణలో రాబిన్ సింగ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఐపీఎల్లో చాంపియన్ జట్టు ముంబై ఇండియన్స్, కరీబియన్ క్రికెట్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ జట్టు శిక్షణ బృందంలో రాబిన్ సింగ్ సభ్యుడిగా ఉన్నాడు. మరోవైపు యూఏఈ క్రికెట్ కష్టకాలంలో ఉంది. ఇటీవల యూఏఈ క్రికెట్‌ను మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం కుదిపేసింది. ఫిక్సింగ్‌లో భాగమైన కెప్టెన్ మొహమ్మద్ నవీద్‌తోపాటు పలువురు సీనియర్ క్రికెటర్లపై వేటు కూడా పడింది. మూడేళ్లుగా యూఏఈ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన డగ్ బ్రౌన్‌ను కూడా తొలగించారు. -
చంద్రశేఖర్‌ది ఆత్మహత్య
సాక్షి, చెన్నై: భారత మాజీ క్రికెటర్ వీబీ చంద్రశేఖర్ (58) గుండెపోటుతో మరణించలేదని, ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు ధ్రువీకరించారు. ఆయన బలవన్మరణానికి అప్పులే కారణమని తేల్చారు. ఆర్థిక సమస్యల వల్లే చెన్నైలోని తన నివాసంలో చంద్రశేఖర్ గురువారం ఉరేసుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన మరణవార్తతో తమిళనాడు క్రికెట్ సంఘం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో కాంచీ వీరన్స్ జట్టును ఆయన కొనుగోలు చేశారు. దీని నిర్వహణతో పాటు తన అకాడమీ కోసం బ్యాంకులు, సన్నిహితుల వద్ద రూ. 3 కోట్ల మేర అప్పు చేశారు. చివరకు చెల్లించలేని పరిస్థితి తలెత్తడంతో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. చెన్నై రాయపేట ఆసుపత్రిలో శుక్రవారం చంద్రశేఖర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్, క్రికెటర్లు దినేష్ కార్తీక్, మురళీ విజయ్, విజయ్ శంకర్‌లతో పాటు తమిళనాడు క్రికెట్ సంఘం సభ్యులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. -
మాజీ క్రికెటర్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మ్యాక్స్ వాల్కర్ (68) కన్నుమూశాడు. రెండేళ్లుగా స్కిన్ కేన్సర్‌తో బాధపడుతున్న వాల్కర్ మరణించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం వెల్లడించింది. 1972-77 మధ్యకాలంలో వాల్కర్ ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు. 34 టెస్టులాడిన వాల్కర్ 138 వికెట్లు పడగొట్టాడు. ఆరుసార్లు ఐదేసి వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 8 వికెట్లు తీశాడు. ఇక ఆసీస్ తరపున వాల్కర్ 17 వన్డేలు ఆడాడు. 1981లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డే అతనికి ఆఖరి మ్యాచ్. వాల్కర్ మృతిపట్ల క్రికెట్ ఆస్ట్రేలియా సంతాపం ప్రకటించింది.