ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్ కరోనా మహమ్మారికి బలయ్యాడు. పాక్ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం.. 50 ఏళ్ల జాఫర్ సర్ఫరాజ్‌కు గత మంగళవారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలో పెషావర్‌లోని లేడీ రీడింగ్ ఆసుపత్రిలో జాఫర్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. శ్వాసకోస సంబంద వ్యాధితో బాధపడుతున్న జాఫర్ మూడు రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉంచామని వైద్యులు తెలిపారు.
(ఆయన చాలా గొప్ప వ్యక్తి : సెహ్వాగ్)
లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మెన్ అయిన జాఫర్ సర్ఫరాజ్ తన కెరీర్‌లో 6 వన్డేలు ఆడి 96 పరుగులు చేశాడు. జాఫర్ 1988 నుంచి 94 వరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో పెషావర్‌కు ప్రాతినిధ్యం వహించి 616 పరుగులు, 1990 నుంచి 92 వరకు లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. కాగా రిటైర్మంట్ అనంతరం జాఫర్ సీనియర్ జట్టుతో పాటు అండర్-19 జట్టుకు కోచ్‌గా పనిచేశాడు. కాగా జాఫర్ సర్ఫరాజ్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా 1997-98 మధ్యలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా కరోనా వైరస్‌తో గత నెలలో దిగ్గజ పాకిస్తానీ స్వ్కాష్ ప్లేయర్ ఆజమ్ ఖాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు పాకిస్తాన్‌లో 5వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 96కు చేరుకుంది.
(అందుకే అతన్ని పాక్ 'వివ్ రిచర్డ్స్' అంటారు)
Comments
Please login to add a commentAdd a comment