
పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.. జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది దీంతో రంగింలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. తప్పు తేలితే ఎవర్ని వదిలిపెట్టమని.. నదీమ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని.. ఇప్పటికే అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ స్పష్టం చేసింది.
మహిళా క్రికెటర్ ఫిర్యాదు ప్రకారం.. ''ముల్తాన్‌కు చెందిన నేను కొన్నేళ్ల క్రితం పీసీబీ ఉమెన్స్ ట్రయల్స్ కోసం వచ్చాను. అక్కడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు దక్కేలా తాను చేస్తానని.. అంతేగాక ఎంప్లాయ్‌మెంట్ బోర్డులోనూ పేరు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత చనువు పెంచుకొని లైంగిక వేధింపులకు పాల్పడమే గాక స్నేహితులను తీసుకొచ్చి శారీరకంగా వేధించేవాడు. దీనికి సంబంధించి వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. ఇన్ని రోజులు భరించినప్పటికి ఇక నావల్ల కాలేదు.. అందుకే విషయాన్ని బయటపెట్టా'' అంటూ పేర్కొంది
ఇక నదీమ్ ఇక్బాల్ గతంలో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌తో కలిసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో బౌలింగ్‌ను పంచుకున్నాడు. 50 ఏళ్ల నదీమ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వకార్ యూనిస్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసేవాడని.. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును 20 పరుగులకే కుప్పకూల్చిన ఘనత నదీమ్‌కు ఉందని.. ఆ మ్యాచ్‌లో నదీమ్ ఏడు వికెట్లతో చెలరేగాడు. వకార్‌తో పోటీ పడి వికెట్లు తీయడంతో నదీమ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత అతను ఏనాడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టలేకపోయాడు. 2004లో ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పిన నదీమ్ ఇక్బాల్ 80 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 258 వికెట్లు.. 49 లిస్ట్- ఏ మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు.
Nadeem Iqbal has been suspended by the PCB over a pending charge of sexual harassment 👇 https://t.co/TsUCdGsHTB
— ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2022
Comments
Please login to add a commentAdd a comment