Multan
-
Pak Vs Eng: పాక్ తుదిజట్టు ఇదే.. సూపర్ స్టార్ రీఎంట్రీ
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు పాకిస్తాన్ తమ తుదిజట్టును ప్రకటించింది. ముల్తాన్ మ్యాచ్‌లో ముగ్గురు సీమర్లను ఆడిస్తున్నట్లు తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు దూరమైన స్టార్ బౌలర్, పేస్ దళ నాయకుడు షాహిన్ ఆఫ్రిది ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేయనున్నాడు. అమీర్ జమాల్ సైతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు.ఆసీస్‌తో సిరీస్‌లో సత్తా చాటిన ఆమీర్బంగ్లాదేశ్తో ఇటీవలి టెస్టులకు ఎంపికైనప్పటికీ ఆమీర్ తుదిజట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే, ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అతడు ఫిట్‌గా ఉండటం సానుకూలాంశంగా మారనుంది. కాగా దాదాపు ఏడాది క్రితం ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా ఆమీర్ జమాల్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల ఈ రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్ ఆ సిరీస్‌లో 18 వికెట్లు తీసి సత్తా చాటాడు.ఆ ముగ్గురూ అవుట్అంతేకాదు.. సిడ్నీ టెస్టులో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి 82 పరుగులు కూడా సాధించాడు. ఇక పేస్ దళంలో షాహిన్, ఆమీర్‌తో పాటు నసీం షా కూడా చోటు దక్కించుకున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో టెస్టుల్లో భాగమైన ఖుర్రం షెహజాద్, మహ్మద్ అలీ, మీర్ హంజాలను ఈసారి యాజమాన్యం పక్కనపెట్టింది.వారి విషయంలో ఎలాంటి మార్పులు లేవుఇక యువ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా ఇంగ్లండ్‌తో తొలి టెస్టు తుదిజట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు. మరోవైపు.. బంగ్లాదేశ్‌తో టెస్టులు ఆడిన టాప్-7 బ్యాటర్ల విషయంలో ఎలాంటి మార్పులు లేవు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ సైతం ఇప్పటికే పాక్‌తో తొలి టెస్టుకు తమ తుదిజట్టును ప్రకటించిది. కెప్టెన్ బెన్ స్టోక్స్ తొడకండరాల నొప్పి కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా పాకిస్తాన్- ఇంగ్లండ్ మధ్య అక్టోబరు 7ను ముల్తాన్ వేదికగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మొదలుకానుంది. రెండో టెస్టుకు కూడా ముల్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఆఖరి మ్యాచ్ రావల్పిండిలో జరుగనుంది. ఇక ప్రస్తుతం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ ఎనిమిది, ఇంగ్లండ్ నాలుగో స్థానాల్లో ఉన్నాయి. టాప్‌లో టీమిండియా కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా రెండు, శ్రీలంక మూడో స్థానంలో ఉన్నాయి.పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుపాకిస్తాన్సయీమ్ అయూబ్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్, సల్మాన్ అలీ ఆఘా, అమీర్ జమాల్, షాహిన్ షా అఫ్రిది, నసీం షా, అబ్రార్ అహ్మద్.ఇంగ్లండ్జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జామీ స్మిత్, క్రిస్ వోక్స్, గుస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్సే , జాక్ లీచ్, షోయబ్ బషీర్.చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
Pak vs Eng: ‘అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండి’
పాకిస్తాన్ సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టులు ఆడనుంది. కాగా గత కొన్నాళ్లుగా టెస్టుల్లో పాకిస్తాన్‌కు విజయమన్నదే కరువైంది. ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌లోనూ ఘోర పరాభవం పాలైంది.షాన్ మసూద్ బృందంపై విమర్శలుతొలిసారిగా బంగ్లా చేతిలో టెస్టులో ఓడటమే గాకుండా సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. దీంతో షాన్ మసూద్ బృందంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు.. ఈ సిరీస్‌తో పాక్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేసన్ గిల్లెస్పికి కూడా చేదు అనుభవం ఎదురైంది.ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ జట్టుతో పాటు గిల్లెస్పికి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అతడు కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. ముఖ్యంగా.. సులువుగా పరుగులు రాబట్టడానికి వీలుగా ఉండే ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాక్ బ్యాటర్ల అభ్యర్థనను నిరభ్యంతరంగా కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.అలాంటి పిచ్ కావాలి.. నోరు మూయండిపాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘‘పాక్ టెస్టు జట్టు లోపల ఏం జరిగిందో చెప్తాను. ఫ్లాట్ పిచ్ కావాలని కోరిన పాకిస్తాన్ ఆటగాళ్ల నోళ్లను అతడు మూయించేశాడు. గ్రౌండ్స్‌మెన్ తయారు చేసిన పిచ్‌ను అచ్చంగా అలాగే కొనసాగించాలని నిర్ణయించాడు.ఎక్కువ కష్టపడకుండా సులువుగా పరుగులు రాబట్టాలనే వారి రిక్వెస్ట్‌ను కొట్టిపారేశాడు. పిచ్ క్యూరేటర్, గిల్లెస్పి ఆట రసవత్తరంగా సాగేలా పిచ్‌ను తయారు చేసేందుకే మొగ్గుచూపారు. గ్రాసీ పిచ్‌పై మ్యాచ్ జరిగి మా బౌలర్లు వికెట్లు తీస్తే అంతకంటే సంతోషం మరొకటి ఉండదు’’ బసిత్ అలీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా పేర్కొన్నాడు.అప్పుడు 3-0తో చిత్తుకాగా అక్టోబరు 7న పాకిస్తాన్ -ఇంగ్లంఢ్ మధ్య ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో తొలి టెస్టు మొదలుకానుంది. ఇరుజట్ల మధ్య 2022లో పాకిస్తాన్ వేదికగా జరిగిన సిరీస్‌లో ఇంగ్లండ్ 3-0తో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. మరోసారి క్లీన్‌స్వీపే లక్ష్యంగా పాక్ గడ్డపై అడుగుపెట్టింది. చదవండి: IPL 2025: రోహిత్, కిషన్‌కు నో ఛాన్స్.. ముంబై రిటెన్షన్ లిస్ట్ ఇదే! -
పాకిస్తాన్ పర్యటనకు ఇంగ్లండ్.. సిరీస్ అక్కడే
పాకిస్తాన్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ నిర్వహణపై పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) స్పష్టతనిచ్చింది. తమ దేశంలోనే ఈ సిరీస్ జరుగుతుందని శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ముల్తాన్, రావల్పిండి ఇందుకు ఆతిథ్యం ఇస్తాయని పేర్కొంది. అక్టోబరు 7 నుంచి 28 వరకు ఇరుజట్ల మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైనట్లు వెల్లడించింది.కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ ఐసీసీ టోర్నీ నిర్వహించేందుకు తమ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లేవని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ స్వయంగా పేర్కొన్నాడు. అందుకే భారీ మొత్తంలో నిధులు కేటాయించి స్టేడియాల్లో మెరుగైన వసతులతో పాటు.. పలు పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు తెలిపాడు.శ్రీలంక లేదంటే యూఏఈలో అంటూ వదంతులువచ్చే ఏడాది జరుగనున్న ఈ మెగా ఈవెంట్ నాటికి అంతా సిద్ధం చేస్తామని నక్వీ పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్ పాకిస్తాన్ పర్యటనకు వచ్చే అంశంపై సందేహాలు నెలకొన్నాయి. స్టేడియాల ప్రక్షాళన నేపథ్యంలో పీసీబీ ఇంగ్లండ్‌తో సిరీస్ వేదికను మార్చే యోచనలో ఉందని.. శ్రీలంక లేదంటే యూఏఈలో నిర్వహిస్తారనే వార్తలు వినిపించాయి.అయితే, అనుమానాలన్నింటి పటాపంచలు చేస్తూ పీసీబీ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. తమ దేశంలోనే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌తో మూడు టెస్టులు ఆడనున్నట్లు స్పష్టం చేసింది. అక్టోబరు 7-11, 15-19 మధ్య జరుగనున్న తొలి రెండు మ్యాచ్‌లకు ముల్తాన్.. అక్టోబరు 24-28 వరకు జరుగనున్న ఆఖరి టెస్టుకు రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలిపింది. నిజానికి కరాచీలో జరగాల్సిన ఈ చివరి టెస్టును అక్కడి నుంచి తరలించడానికి కారణం.. పునరుద్ధరణ కార్యక్రమాలే అని పేర్కొంది. అక్టోబరు 2న ఇంగ్లండ్ జట్టు ముల్తాన్‌కు చేరుకోనున్నట్లు వెల్లడించింది. కాగా పాకిస్తాన్ చివరగా బంగ్లాదేశ్‌తో స్వదేశంలో టెస్టు సిరీస్ ఆడింది.ఘోర పరాభవం నుంచి కోలుకునేనా?ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్లో భాగమైన ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ ఘోర పరాభవం మూటగట్టుకుంది. టెస్టు చరిత్రలో తొలిసారి బంగ్లా చేతిలో ఓడటమే గాకుండా.. 0-2తో వైట్‌వాష్‌కు గురైంది. ఫలితంగా మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తదుపరి జరుగనున్న టెస్టు సిరీస్ షాన్ మసూద్ బృందానికి విషమ పరీక్షగా మారింది.చదవండి: చరిత్ర సృష్టించిన జైస్వాల్.. గావస్కర్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్ -
ఆఖరి బంతికి సంచలనం.. పీఎస్ఎల్ ఛాంపియన్స్‌గా ఇస్లామాబాద్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి. ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది. Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy — Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024 -
విధ్వంసకర సెంచరీ.. 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో! వీడియో వైరల్
పాకిస్తాన్ సూపర్ లీగ్-2024లో ముల్తాన్ సుల్తాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. తాజాగా కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముల్తాన్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. కరాచీ బ్యాటర్లలో షోయబ్ మాలిక్(38) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడితో పాటు షాన్ మసూద్(36) పరుగులతో రాణించాడు. ముల్తాన్ సుల్తాన్స్ బౌలర్లలో ఉసమా మీర్ రెండు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లీ, మహ్మద్ అలీ, క్రిస్ జోర్డాన్, కుష్దుల్ షా తలా ఒక్క వికెట్ సాధించారు. ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీ.. అంతకముందు బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ముల్తాన్ ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. కరాచీ బౌలర్లను ఉస్మాన్ ఖాన్ ఊచకోత కోశాడు. కేవలం 59 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లతో 106 పరుగులు చేశాడు. అతడితో పాటు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(58) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక ఈ విజయంతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముల్తాన్ సుల్తాన్ ఖారారు చేసుకుంది. USMAN KHAN, TAKE A BOW! 🙇 Second HBL PSL 💯 for the Sultans star 👏#HBLPSL9 | #KhulKeKhel | #KKvMS pic.twitter.com/DCP60FJwoD — PakistanSuperLeague (@thePSLt20) March 3, 2024 -
షోయబ్ మాలిక్ భార్యకు చేదు అనుభవం
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ భార్య, నటి సనా జావెద్‌కు చేదు అనుభవం ఎదురైంది. సొంత జట్టు అభిమానులే ఆమెను టీజ్ చేస్తూ అసహనం వెళ్లగక్కారు. కాగా భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా నుంచి విడిపోయినట్లు ప్రకటించకముందే షోయబ్ మాలిక్.. సనాను పెళ్లాడిన ఫొటోలు బహిర్గతం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సానియాతో విడిపోకముందే షోయబ్‌కు సనాతో రిలేషన్ ఉందంటూ పాక్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిద్దరు చేసిన మోసం బయటపడంతో సానియానే స్వయంగా విడాకులకు పూనుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇక షోయబ్‌కు ఇది మూడో వివాహం కాగా.. సనా జావెద్‌కు రెండో పెళ్లి. అయితే, పెళ్లైన నాటి నుంచే ఈ జంటపై నెటిజన్లు భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. జీవిత భాగస్వాములకు ద్రోహం చేసి.. ఆ విషయం బయటపడగానే మళ్లీ నిఖా పేరిట తమ ‘బంధాన్ని’ పవిత్రం చేసుకునేందుకు పెద్ద నాటకమే ఆడారని మండిపడ్డారు. ముఖ్యంగా సానియా మీర్జా షోయబ్ కోసం ఎన్నో అవాంతరాలు దాటుకుని పాకిస్తానీని పెళ్లి చేసుకుందని.. అయినా ఆమె పట్ల ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జట్టు అభిమానులు సైతం షోయబ్ మాలిక్‌ను ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా తప్పుబట్టారు. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ సందర్భంగా సనా జావెద్‌కు నేరుగానే నిరసన సెగ తగిలింది. కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న తన భర్త షోయబ్ మాలిక్‌కు మద్దతుగా ఆమె ముల్తాన్ స్టేడియానికి వచ్చింది. ముల్తాన్ సుల్తాన్స్ మ్యాచ్ సమయంలో డగౌట్ నుంచి సనా వెళ్తున్నపుడు కొంత మంది సానియా మీర్జా అంటూ గట్టిగా అరిచారు. దీంతో వాళ్లవైపు చూసిన సనా.. తనకేమీ పట్టనట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. కాగా 42 ఏళ్ల షోయబ్ మాలిక్ తొలుత ఆయేషా సిద్దిఖి(2002)ను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి విడిపోయిన తర్వాత 2010లో సానియా మీర్జాను వివాహమాడాడు. ఈ జంటకు కుమారుడు ఇజహాన్ ఉన్నాడు. అయితే, షోయబ్‌తో విభేదాలు తలెత్తిన కారణంగా సానియానే ఖులా ద్వారా అతడికి విడాకులివ్వడం గమనార్హం. ఈ క్రమంలో తాను సనాను పెళ్లి చేసుకున్నట్లు షోయబ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. చదవండి: హెండ్రిక్స్ విధ్వంసం.. సత్తా చాటిన డేవిడ్ మలాన్.. మాలిక్ పోరాటం వృథా Pakistan fans teasing Shoaib Malik's 3rd wife 'Sana Javed' by calling her "Sania Mirza"#PSL9 pic.twitter.com/EXr0OQywvQ — Don Cricket 🏏 (@doncricket_) February 20, 2024 -
PSL 2023: టీ20 మ్యాచ్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు! 43 బంతుల్లో 120 రన్స్‌తో..
Quetta Gladiators vs Multan SultansWorld Record: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ సంచలన విజయాలు నమోదు చేస్తోంది. పెషావర్ జల్మీతో మ్యాచ్‌లో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముల్తాన్ జట్టు.. శనివారం నాటి మ్యాచ్‌లో మరో రికార్డు విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరిన రిజ్వాన్ బృందం.. క్వెటా గ్లాడియేటర్స్‌ను ఇంటికి పంపింది. వివరాలు.. రావల్పిండిలో మార్చి 11న ముల్తాన్ సుల్తాన్స్, క్వెటా గ్లాడియేటర్స్ తలపడ్డాయి. టాస్ గెలిచిన గ్లాడియేటర్స్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముల్తాన్ ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ పరుగుల సునామీ సృష్టించాడు. పరుగుల సునామీ 43 బంతుల్లోనే 12 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 120 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఏకంగా 279.07 స్ట్రైక్‌రేటు నమోదు చేశాడు. మరో ఓపెనర్, కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ 29 బంతుల్లో 55 పరుగులు సాధించాడు. వీరిద్దరికి తోడు టిమ్ డేవిడ్ 43, పొలార్డ్ 23 పరుగులతో రాణించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముల్తాన్ సుల్తాన్స్ కేవలం 3 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. తద్వారా పీఎస్ఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన క్వెటా గ్లాడియేటర్స్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జేసన్ రాయ్.. 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 37, వన్‌డౌన్ బ్యాటర్ ఒమైర్ యూసఫ్ 67 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరితో పాటు ఐదో స్థానంలో వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ అర్ధ శతకం(53)తో రాణించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టోర్నీ నుంచి అవుట్ మిగతా వాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో 20 ఓవర్లలో 253 పరుగులు మాత్రమే చేయగలిగింది మహ్మద్ నవాజ్ బృందం. దీంతో 9 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. 4 ఓవర్లలో 47 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చి గ్లాడియేటర్స్ పతనాన్ని శాసించిన అబ్బాస్ ఆఫ్రిదికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 515 పరుగులు.. రికార్డు బద్దలు ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 515 పరుగులు నమోదు చేయడం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా టీ20 చాలెంజ్-2022లో టైటాన్స్- నైట్స్ జట్లు నమోదు చేసిన 501 పరుగుల రికార్డు బద్దలైంది. టీ20 ఫార్మాట్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన మ్యాచ్‌గా ముల్తాన్- గ్లాడియేటర్స్ మ్యాచ్ చరిత్రకెక్కింది. ముల్తాన్ సుల్తాన్స్ వర్సెస్ క్వెటా గ్లాడియేటర్స్ స్కోర్లు: ముల్తాన్ సుల్తాన్స్- 262/3 (20) క్వెటా గ్లాడియేటర్స్- 253/8 (20) చదవండి: IPL 2023: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్! Usain Bolt: పది క్షణాల్లో ప్రపంచాన్ని జయించడం అంటే ఇదేనేమో! అప్పుడు దారితప్పినా.. 🚨RAINING RECORDS🚨 5⃣1⃣5⃣: This is the highest match aggregate in T20 cricket in the world. #HBLPSL8 I #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/xlzynehkGr — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 🚨 𝐇𝐀𝐓𝐓𝐑𝐈𝐂𝐊 𝐅𝐎𝐑 𝐀𝐅𝐑𝐈𝐃𝐈 🚨 FIRST hattrick of the #HBLPSL8 Abbas Afridi on a ROLL 🕺🏻 #SabSitarayHumaray | #QGvMS pic.twitter.com/sM3KCdQUMG — PakistanSuperLeague (@thePSLt20) March 11, 2023 -
కాల్పుల కలకలం.. ఇంగ్లండ్ ఆటగాళ్లకు భద్రత పెంపు
17 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి టెస్టులో చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్న ఇంగ్లండ్ సిరీస్‌పై కన్నేసింది. శుక్రవారం ముల్తాన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతుంది. అయితే పాక్ మాత్రం ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను సమం చేయాలని చూస్తోంది. ఇదిలా ఉంటే ముల్తాన్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్‌కు సమీపంలో కాల్పలు కలకలం రేపాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఉన్న హోటల్‌కు కిలోమీటర్ దూరంలో గురువారం ఉదయం తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కాల్పులు జరిపిన నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పాకిస్థాన్ పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత ఇంగ్లండ్ ఆటగాళ్లకు పోలీసులు భారీ భద్రత కల్పించారు. ఆటగాళ్లు హోటల్ నుంచి స్టేడియంకు వెళ్లేదారిలో ఇతర వాహనాలను అనుమతించలేదు. ఇంగ్లండ్ ప్లేయర్లు అరగంట పాటు నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. రెండో టెస్టుకు ముందు ఇంగ్లండ్ జట్టు కూర్పులో చిన్న మార్పు చేసింది. గాయపడిన ఆల్‌రౌండర్ లివింగ్‌స్టోన్ స్థానంలో మార్క్‌వుడ్‌ను తీసుకుంది. ఇక 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ టీమ్ మీద కొందరు దుండగులు కాల్పులు జరిపారు. శ్రీలంక ఆటగాళ్లు బస్సులో వెళ్తుండగా లాహోర్‌లోని గడాఫీ స్టేడియం సమీపంలో 12 మంది కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్థాన్ పోలీసులు, ఇద్దరు పౌరులు చనిపోయారు. అందుకనే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లేందుకు భారత్ సహా మిగతా దేశాలు ఆలోచిస్తుంటాయి. -
పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు..
పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఫస్ట్‌క్లాస్ క్రికెటర్.. జాతీయ స్థాయి కోచ్ నదీమ్ ఇక్బాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనం కలిగించింది. ముల్తాన్‌కు చెందిన మహిళా క్రికెటర్‌కు జట్టులో చోటు కల్పిస్తానంటూ హామీ ఇచ్చి ఆపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు(పీసీబీ) ఫిర్యాదు అందింది దీంతో రంగింలోకి దిగిన పీసీబీ సదరు కోచ్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టింది. తప్పు తేలితే ఎవర్ని వదిలిపెట్టమని.. నదీమ్‌పై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని.. ఇప్పటికే అతన్ని పోలీసులకు అప్పగించినట్లు పీసీబీ స్పష్టం చేసింది. మహిళా క్రికెటర్ ఫిర్యాదు ప్రకారం.. ''ముల్తాన్‌కు చెందిన నేను కొన్నేళ్ల క్రితం పీసీబీ ఉమెన్స్ ట్రయల్స్ కోసం వచ్చాను. అక్కడే కోచ్ నదీమ్ ఇక్బాల్ పరిచయం అయ్యాడు. పాకిస్తాన్ మహిళా జట్టులో చోటు దక్కేలా తాను చేస్తానని.. అంతేగాక ఎంప్లాయ్మెంట్ బోర్డులోనూ పేరు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చాడు. ఆ తర్వాత చనువు పెంచుకొని లైంగిక వేధింపులకు పాల్పడమే గాక స్నేహితులను తీసుకొచ్చి శారీరకంగా వేధించేవాడు. దీనికి సంబంధించి వీడియోలు తీసి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడేవాడు. ఇన్ని రోజులు భరించినప్పటికి ఇక నావల్ల కాలేదు.. అందుకే విషయాన్ని బయటపెట్టా'' అంటూ పేర్కొంది ఇక నదీమ్ ఇక్బాల్ గతంలో పాక్ దిగ్గజ బౌలర్ వకార్ యూనిస్‌తో కలిసి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో బౌలింగ్‌ను పంచుకున్నాడు. 50 ఏళ్ల నదీమ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వకార్ యూనిస్ కంటే మెరుగ్గా బౌలింగ్ చేసేవాడని.. ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టును 20 పరుగులకే కుప్పకూల్చిన ఘనత నదీమ్‌కు ఉందని.. ఆ మ్యాచ్‌లో నదీమ్ ఏడు వికెట్లతో చెలరేగాడు. వకార్‌తో పోటీ పడి వికెట్లు తీయడంతో నదీమ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని అంతా భావించారు. ఆ తర్వాత అతను ఏనాడు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టలేకపోయాడు. 2004లో ప్రొఫెషనల్ ఆటకు గుడ్‌బై చెప్పిన నదీమ్ ఇక్బాల్ 80 ఫ్లస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 258 వికెట్లు.. 49 లిస్ట్- ఏ మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. Nadeem Iqbal has been suspended by the PCB over a pending charge of sexual harassment 👇 https://t.co/TsUCdGsHTB — ESPNcricinfo (@ESPNcricinfo) June 18, 2022 చదవండి: ఆఖరి సమరానికి సమయం.. పిచ్ ఎలా ఉందంటే! -
PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా బాబర్ ఆజాం రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అఖరి రెండు మ్యాచ్‌ల్లో బాబర్ వరుసగా సెంచరీలు సాధించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత స్వదేశంలో విండీస్‌తో పాక్ తలపడతోంది. విండీస్‌తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షాయీ హోప్ 127,బ్రూక్స్ 70 పరుగులతో రాణించారు. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం(103) సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! The moment @babarazam258 etched his name in the record books 🙏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/D7caU729F3 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
PAK vs WI: ఐపీఎల్లో పర్లేదు.. అక్కడ మాత్రం తుస్.. కానీ పాక్‌తో మ్యాచ్‌లో!
Pakistan Vs West Indies 2022- ODI Series: నెదర్లాండ్స్ జట్టును క్లీన్‌స్వీప్ చేసి కెప్టెన్‌గా ప్రయాణాన్ని ఘనంగా ఆరంభించాడు వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి నికోలస్ పూరన్. ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సూపర్ లీగ్‌లో భాగంగా నెదర్లాండ్స్ పర్యటనలో ఆ జట్టును 3-0 తేడాతో మట్టికరిపించి శుభారంభం అందుకున్నాడు. కెప్టెన్‌గా సఫలమైనా బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. నెదర్లాండ్స్‌తో సిరీస్‌లో మూడు వన్డేల్లో పూరన్ సాధించిన స్కోర్లు వరుసగా.. 7,10,7. ఇక మూడుసార్లూ ఆఫ్ స్పిన్నర్ ఆర్యన్ దత్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. నెదర్లాండ్స్‌తో సిరీస్ ముగియగానే విండీస్ జట్టు పాకిస్తాన్‌కు పయమనమైన సంగతి తెలిసిందే. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడ్డ మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూన్ 8న ముల్తాన్ వేదికగా ఆతిథ్య పాక్ జుట్టతో తలపడనుంది. నాకు ఇదేం కొత్త కాదు! ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన పూరన్.. తన ఫామ్‌పై ఆందోళన అక్కర్లేదన్నాడు. ‘‘నేను బాగానే ఉన్నా! ఇలా పరుగులు చేయకపోవడం నాకేం కొత్త కాదు. ఒక్కసారి నా కెరీర్ గణాంకాలు చెక్ చేసుకోవాలి. ప్రతిసారి పరుగులు సాధిస్తూనే ఉన్నాను. కానీ అన్నిసార్లు కుదరకపోవచ్చు. నెదర్లాండ్స్‌లో నా వ్యక్తిగత ప్రదర్శన పట్ల నిరాశ చెందాను. ఆ సిరీస్‌లో నేను రన్స్ స్కోర్ చేసి ఉండాల్సిందని కొంతమంది అనొచ్చు. నిజానికి నేను స్పిన్ బాగా ఆడగల బ్యాటర్‌ను. నెదర్లాండ్స్‌లో వైఫల్యం గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాలం కలిసి రావాలి అంతే! కచ్చితంగా నేను రాణిస్తాను’’ అంటూ నికోలస్ పూరన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇక పాకిస్తాన్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయన్న పూరన్.. అదేమీ తమకు పెద్ద సమస్య కాకపోవచ్చని.. కచ్చితంగా మెరుగ్గా ఆడతామని పేర్కొన్నాడు. కాగా ముల్తాన్ వేదికగా పాక్, విండీస్ జట్ల మధ్య సిరీస్ జరుగనుంది. ఇక ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన పూరన్.. 13 ఇన్నింగ్స్‌లో కలిపి 306 పరుగులు చేశారు. The #MenInMaroon have arrived in Multan for the 3-match ODI series against @TheRealPCB starting on pic.twitter.com/uKFUDWEJkT — Windies Cricket (@windiescricket) June 6, 2022 Preparations completed 👊 Last day of activities for both teams before the first ODI tomorrow 👏#KhelAbhiBaqiHai | #PAKvWI pic.twitter.com/hHhZvdkgtG — Pakistan Cricket (@TheRealPCB) June 7, 2022 -
Virender Sehwag: 374 మ్యాచ్‌లు.. 17253 పరుగులు..
Happy Birthday Virender Sehwag: డాషింగ్ ఓపెనర్... బౌలర్లకు చుక్కలు చూపే విధ్వంసకర బ్యాటర్... రికార్డులకు చేరువలో ఉన్నా జట్టు ప్రయోజనాల కోసం రిస్క్ చేసేందుకైనా వెనుకాడని ధీరుడు.. ప్రేక్షకులను అలరించడమే ముందుకు సాగే అసలు సిసలు క్రికెటర్... ‘నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్’ వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు నేడు. బుధవారంతో ఈ లెజెండ్ 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా బీసీసీఐ సెహ్వాగ్‌కు శుభాకాంక్షలు తెలిపింది. ‘‘374 అంతర్జాతీయ మ్యాచ్‌లు. 17253 పరుగులు. టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించిన ఏకైక టీమిండియా క్రికెటర్. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్. 2007 వరల్డ్ టీ20, 2011 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు’’ అంటూ అతడి ఘనతను కీర్తిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. అప్పటి నుంచి రెగ్యులర్ బ్యాటర్‌గా.. 1999లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి వీరూ భాయ్... తొలినాళ్లలో అంతగా రాణించలేకపోయాడు. పాకిస్తాన్‌తో ఆడిన వన్డేలో ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించడం, 2001 న్యూజిలాండ్ సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలో దిగి సెంచరీ చేయడంతో వీరూ కెరీర్ మలుపు తిరిగింది. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్ బ్యాట్స్‌మెన్‌గా అతడు కొనసాగాడు. ఇక 2003 వన్డే వరల్డ్‌కప్‌లో వీరేంద్ర సెహ్వాగ్ ఇన్నింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారీ(360) లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో.. 10 ఫోర్లు..3 సిక్పర్లతో వీరూ చెలరేగిన విధానం అందరికీ గుర్తుండే ఉంటుంది. ట్రిపుల్ సెంచరీ.. ముల్తాన్ కా సుల్తాన్.. పాక్ పర్యటనలో భాగంగా 2004లో ముల్తాన్‌లో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. సిక్సర్ బాది మరీ త్రిశతకం పూర్తి చేసుకోవడం విశేషం. ►కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు సెహ్వాగ్ వీడ్కోలు పలికాడు. సెహ్వాగ్ గురించిన విశేషాలు క్లుప్తంగా... ►1978, అక్టోబరు 20న ఢిల్లీలో జననం ►1999లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం ►2001లో టెస్టుల్లో అడుగుపెట్టిన సెహ్వాగ్ ►2006లో టీ20 ఫార్మాట్లో అరంగేట్రం ►టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా గుర్తింపు ►టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక టీమిండియా క్రికెటర్ ►సిక్సర్‌తో త్రిశతకం పూర్తిచేసుకున్న క్రికెటర్‌గా రికార్డు ►2007 టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడు ►వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మెన్ ►వన్డేల్లో సెహ్వాగ్ అత్యధిక స్కోరు 219 ►టెస్టుల్లో అత్యధిక స్కోరు 319 ►2015లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చదవండి: టెస్ట్ క్రికెట్‌కు ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ గుడ్‌బై... 3⃣7⃣4⃣ intl. matches 👌 1⃣7⃣2⃣5⃣3⃣ intl. runs 💪 Only #TeamIndia cricketer with two Test triple tons 🙌 Second batsman to score an ODI double hundred 👍 2⃣0⃣0⃣7⃣ World T20 & 2⃣0⃣1⃣1⃣ World Cup-winner 🏆 🏆 Here's wishing @virendersehwag a very happy birthday. 🎂 👏 pic.twitter.com/kBVgNvhJFf — BCCI (@BCCI) October 20, 2021 -
కారు నడిపిన 5 ఏళ్ల బాలుడు.. తల్లిదండ్రులపై చర్యలు
ఇస్లామాబాద్: అయిదేళ్ల బాలుడు పాకిస్తాన్‌లోని అత్యంత రద్దీ రోడ్డుపై కారు నడుపుతున్న వీడియో స్థానికంగా కలకలం రేపుతోంది. దీంతో పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. వివరాలు.. పాకిస్తాన్‌లోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన ముల్తాన్ రహదారిలో ఓ బాలుడు బ్లాక్ టయోట కారు నడుపుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఆ బాలుడు స్టీరింగ్ ఎదురుగా నిలబడి బిజీ రోడ్డుపై అతి వేగంగా కారు నడుపుతూ కనిపించాడు. అయితే ఈ కారులో పెద్దవారు ఎవరూ లేకపోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ వీడియో పోలీసుల కంటపడింది. ఇక బాలుడి తల్లిదండ్రులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాకిస్తాన్ పోలీసు ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. (చదవండి: వాలెంటైన్స్ డే: బాయ్‌ఫ్రెండ్ లేకపోతే కాలేజీకి రావొద్దు) కాగా చీఫ్ ట్రాఫిక్ ఆఫీసర్ జాఫర్ బుజ్గార్ మీడియాతో మాట్లాడుతూ.. ఆ చిన్నారితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన బాలుడి తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా ఆ బాలుడి వయసు కేవలం 5 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. దీంతో అతి చిన్న వయసులోనే కారు నడపడానికి అనుమతి ఇచ్చిన అతడి తల్లిదండ్రులపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘తల్లిదండ్రుల బాధ్యత రాహిత్యానికి ఇది నిదర్శనం’, ‘అతడితో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ఈ బాలుడి తల్లిదండ్రులు ప్రమాదంలో పడేశారు’, ‘తమ సొంత పిల్లవాడిపై కూడా వారు శ్రద్ధ పెట్టలేక పోయారు’ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. (చదవండి: బాడీ ఉంటే సరిపోదు.. బుర్ర కూడా ఉండాలి) -
‘తనను చంపినందుకు బాధ లేదు’
ముల్తాన్/పాకిస్తాన్ : పాకిస్తాన్లో సంచలనం సృష్టించిన సోషల్ మీడియా స్టార్ కందీల్ బలోచ్ హత్య కేసులో ఆమె సోదరుడికి స్థానిక కోర్టు జీవితఖైదు విధించింది. పరువు హత్యకు పాల్పడిన అతడు జీవితాంతం జైలులో ఉండాలని శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాలు... పాకిస్తాన్‌కు చెందిన బలోచ్ సెల్ఫీ స్టార్‌గా ఫేమస్ అయ్యింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో పూర్తి వ్యక్తిగతమైన ఫొటోలను కూడా ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. తద్వారా ‘పాకిస్తాన్ కిమ్ కర్ధాషియన్’గా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన బలోచ్ సోదరుడు మహ్మద్ వసీం 2016 జూలైలో ఆమెను గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అతడు విలేకరులతో మాట్లాడుతూ... తన సోదరిని చంపినందుకు ఏమాత్రం బాధ పడటం లేదని, తన అసభ్య ప్రవర్తన కారణంగానే ఆమెను అంతమొందించానని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం... పరువు హత్యగా నమోదైన ఈ కేసులో ముల్తాన్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. వసీంకు జీవితఖైదు విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే తన క్లైంట్‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చినప్పటికీ.. హైకోర్టులో అతడికి న్యాయం జరుగుతుందని వసీం తరఫు న్యాయవాది పేర్కొన్నాడు. ఇక వసీం తల్లి మాట్లాడుతూ.. తన కొడుకు అమాయకుడని, చనిపోయిన కూతురు కంటే ప్రస్తుతం జీవించి ఉన్న వసీం జీవితం తనకు ముఖ్యమని పేర్కొన్నారు. కాగా పాకిస్తాన్లో కిసాస్ అండ్ దియాత్ చట్ట ప్రకారం సమీప బంధువు హత్య కేసులో నిందితుడైన ఓ వ్యక్తి బాధితుల బంధువుల నుంచి క్షమాభిక్ష పొంది నేరం నుంచి తప్పించుకునే వీలు ఉండేది. దీంతో అక్కడ పరువు హత్యలు యథేచ్ఛగా సాగేవి. ఈ క్రమంలో బలోచ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పరువు హత్యకు పాల్పడిన వారికి జీవితఖైదు విధించేలా పాక్ పార్లమెంట్ చట్టం రూపొందించింది. అయితే ఒక హత్య పరువుకు సంబంధించిందా కాదా అనే విషయాన్ని నిర్ధారించడం జడ్జి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. ఇక బలోచ్ కేసు విషయంలో తొలుత తమ కుమారుడిని శిక్షించాలని కోరిన ఆమె తల్లిదండ్రులు.. తర్వాత మనసు మార్చుకుని అతడిని క్షమిస్తున్నామని కోర్టుకు తెలిపారు. -
అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్
-
సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!
-
సోషల్ మీడియా సెన్సేషన్ విషాదాంతం!
అన్న చేతిలో హత్యకు గురైన ఖందిల్ పాకిస్థాన్ ఇంటర్నెట్ సెన్సెషన్ పేరొందిన ఖందిల్ బలోచ్ శనివారం ముల్తాన్‌లో హత్యకు గురయింది. సొంత సోదరుడే ఆమెను తుపాకీతో కాల్చిచంపినట్టు ప్రాథమిక కథనాలను బట్టి తెలుస్తోంది. కుటుంబం పరువు కోసం బలోచ్ సోదరుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. ముల్తాన్‌లోని తన సొంతూరు ముజఫర్బాద్ గ్రీన్టౌన్కు బలోచ్ ఈద్ పర్వదినాన్ని నిర్వహించుకునేందుకు వెళ్లింది. అయితే, ఇంటర్నెట్లో ఫొటోలు పెడుతుండటంపై ఆమె సోదరుడు ఆమెను బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె హత్య జరిగింది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడంతో ఖందిల్ బలోచ్‌కు గతంలోనే పలుసార్లు ఛాందసవాదుల నుంచి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో భద్రత కోసం ఆమె పాక్ హోంశాఖకు విజ్ఞప్తి చేసినా.. హోంశాఖ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఈద్ అనంతరం ఆమె విదేశాల్లో స్థిరపడాలని నిశ్చయించుకున్నారని ఇంతలోనే ఈ దారుణం జరిగిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఖందిల్ తాజాగా విడుదల చేసిన ’బ్యాన్’ అనే మ్యూజిక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో పాకిస్థాన్ లో పెద్ద చర్చను లేవనెత్తింది. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ఉన్న బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్ గా ఖందిల్ బలోచ్‌ను తీసుకోవాలని మొదట భావించారు. కానీ కుదరలేదు. సోషల్ మీడియాలో ఫొటొలు పెట్టి.. కామెంట్లు చేయడం ద్వారా ఫేమస్ అయిన ఖందిల్ ను పాక్ పూనం పాండేగా పేరు తెచ్చుకుంది. -
పెళ్లికి నిరాకరించాడని పాకిస్తాన్ లో..
ఇస్లామాబాద్ : :పాకిస్తాన్ లో ముస్లిం మహిళలపై ఆంక్షలు, ఇస్లాం మత నమ్మకాలు,వాటి ప్రభావం ఎక్కువ ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మధ్య పాకిస్తాన్ లోని నగరంలో మహిళ, పురుషుడిపై యాసిడ్ దాడి చేయడం కలంకలం రేపింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన మఖ్దుం రషీద్ అనేవ్యక్తిపై యాసిడ్ పోసిందో మహిళ. పోలీసులు అందించిన సమాచారం ముల్తాన్ కుచెందిన మొనిల్ మాయ్ (32) పొరుగుననివసించే రషీద్ పై గురువారం ఈ దాడికి పాల్పడింది. మొనిల్ ను నిఖా చేసుకోవానికి అంగీకరించపోవడంతో ఆగ్రహానికి గురైన ఆమె రషీద్ పై యాసిడ్ గుమ్మరించినట్టు స్థానిక పోలీసు అధికారి బషీర్ అహ్మద్ తెలిపారు. ఆమెను అదుపులోకి ప్రశ్నిస్తున్నామన్నారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా మహిళలపై యాసిడ్ దాడులు, పరువు హత్యలు కామన్ గా మారిన పాకిస్తాన్ దేశంలో మహిళలు పురుషులకు వ్యతిరేకంగా హింసకు దిగడం అరుదైన విషయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని.. తగలబెట్టాడు!
ముల్తాన్: పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. పెళ్లికి ఒప్పుకోలేదని ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో 40 నుంచి 50శాతం కాలిన గాయాలైన బాధితురాలు సోనియా బిబి (20) ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నది. సెంట్రల్ పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఈ ఘటన జరిగింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా సోనియా బిబిను లతీఫ్ అహ్మద్ (24) ఒత్తిడి చేశాడు. గతంలో ఇద్దరు కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే పెళ్లికి సోనియా బిబి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్న లతీఫ్.. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించాడు. ఆస్పత్రిలో బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తల్లిదండ్రులు, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన సోనియాబిబి ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నది. -
టీవీలు పగిలాయి .. శవయాత్ర .. అంత్యక్రియలు
ఇస్లామాబాద్: ఒకసారి కాదు... వరుసగా రెండో సారి కూడా పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓటిమి పాలవడాన్ని ఆ దేశ క్రికెట్ అభిమానులు తట్టుకోలేక పోయారు. ఆగ్రహాంతో ఊగిపోయారు. వీళ్లేప్పుడు ఇంతే నంటూ చూస్తున్న టీవీలను ముక్కలు ముక్కలుగా పగలు కొట్టారు. బ్యాట్లు, వికేట్లు, బంతులు మూట కట్టి శనివారం నగర వీధుల్లో శవయాత్ర నిర్వహించారు. అనంతరం సదరు క్రీడా సామాగ్రి మొత్తానికి అంత్యక్రియలు నిర్వహించారు. మీరు క్రికెట్ ఆటకు స్వస్తి చెప్పి... జాతీయ క్రీడలు హకీ, ఫూట్ బాల్‌పై దృష్టి సారించండి అంటూ పాక్ క్రికెట్ జట్టుకు క్రీడాభిమానులు హితవు పలికారు. ఇదంతా పాకిస్థాన్‌లోని ముల్తాన్ పట్టణంలో శనివారం చోటు చేసుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో వెస్టిండీస్‌తో శనివారం జరిగిన పూల్-బి మ్యాచ్‌లో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. పాక్ 150 పరుగుల తేడాతో విండీస్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. 311 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ 39 ఓవర్లలో 160 పరుగులకు కుప్పకూలింది. అలాగే గత ఆదివారం భారత్ చేతిలో పాక్ ఓటమి పాలైంది. దీంతో పాక్ క్రికెట్ జట్టుపై ఆ దేశ ప్రజలు కారాలుమిరాయలు నూరుతున్నారు. దీంతో పాకిస్థాన్ క్రికెటర్లు నివాసాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.