పాకిస్తాన్ సూపర్ లీగ్-2024 విజేతగా ఇస్లామాబాద్ యునైటెడ్ నిలిచింది. కరాచీ వేదికగా జరిగిన ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్‌ను 2 వికెట్లతో ఓడించిన ఇస్లామాబాద్.. ముచ్చటగా మూడోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో హునైన్ షా ఫోర్ కొట్టి ఇస్లామాబాద్‌ను గెలిపించాడు. ఆఖరి ఓవర్‌లో ఇస్లామాబాద్ విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి.
చివరి ఓవర్ వేసే బాధ్యతను ముల్తాన్ కెప్టెన్ రిజ్వాన్ పేసర్ మహ్మద్ అలీకి అప్పగించాడు. ఈ క్రమంలో తొలి బంతిని ఇమాద్ వసీం సింగిల్ తీసి నసీం షాకు స్ట్రైక్ ఇచ్చాడు. నసీం షా రెండో బంతిని ఫోర్‌గా మలిచాడు. దీంతో యూనైటడ్ విజయ సమీకరణం నాలుగు బంతుల్లో 3 పరుగులగా మారింది. మూడో బంతి నసీం సింగ్ తీసి వసీంకు మళ్లీ స్ట్రైక్ ఇచ్చాడు. దీంతో ఆఖరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరమయ్యాయి.
ఇక నాలుగో బంతికి ఇమాద్ వసీం సింగిల్ తీసి స్కోర్లను సమం చేశాడు.
అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆఖరి రెండు బంతుల్లో ఒక్కపరుగు కావల్సిన సమయంలో నషీం ఔటయ్యాడు. ఐదో బంతికి రిజ్వాన్ క్యాచ్‌కు ఔటయ్యాడు. దీంతో ఇస్లామాబాద్ డగౌట్‌లో టెన్షన్ వాతవారణం నెలకొంది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన హునైన్ షా ఆఖరి బంతికి ఫోరు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది.
ముల్తాన్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖాన్(57) హాఫ్ సెంచరీతో చెలరేగగా, ఆఖరిలో ఇఫ్తికర్ ఆహ్మద్(20 బంతుల్లో 32, 3 సిక్స్‌లు, 3 ఫోర్లు) మెరుపులు మెరిపించాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో స్పిన్నర్ ఇమాద్ వసీం 5 వికెట్లతో చెలరేగాడు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఇస్లామాబాద్ ఛేదించాడు. ఇస్లామాబాద్ బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు.
కాగా ఐదు వికెట్లతో ఇస్లామాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఇమాద్ వసీం 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డ్ షదాబ్ ఖాన్‌కు దక్కింది.
Shadab Khan won at this life! 😭♥️#HBLPSLFinal I #PSL2024 I #PSLFinal pic.twitter.com/gd53bAzPpy
— Rizwan Babar Army (@RizwanBabarArmy) March 18, 2024
Comments
Please login to add a commentAdd a comment