ఆర్సీబీతో బంధం ముగిసిన తర్వాత పీఎస్‌ఎల్‌లో మైక్ హసన్ (PC: RCB/IPL)
Mike Hesson- Pakistan Super League: న్యూజిలాండ్ మాజీ హెడ్‌కోచ్ మైక్ హసన్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగం కానున్నాడు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు అతడు హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఐపీఎల్ ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో బంధం తెంచుకున్న తర్వాత ఈ మేరకు కొత్త బాధ్యతలు చేపట్టనున్నాడు.
కాగా ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందు ఆర్సీబీ కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలు అందించిన మైక్ హసన్‌కు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలో ఆర్సీబీని వీడుతున్నందుకు బాధగా ఉందంటూ మైక్ ఉద్వేగానికి లోనయ్యాడు.
ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి పూర్తిగా బయటికొచ్చిన ఈ న్యూజిలాండ్ స్టార్ పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటికే రెండుసార్లు టైటిల్ గెలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు మార్గదర్శనం చేయనున్నాడు.
కాగా గత ఐదు సీజన్లలో ఇస్లామాబాద్ జట్టు నాలుగుసార్లూ నాకౌట్ దశకు చేరుకున్నా ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో కోచ్ అజర్ మహ్మూద్‌పై వేటు వేసిన యాజమాన్యం ఆ స్థానాన్ని మైక్ హసన్‌తో భర్తీ చేసింది.
సంతోషంగా ఉంది
ఇక తన నియామకంపై హర్షం వ్యక్తం చేసిన మైక్ హసన్.. ‘‘ఇస్లామాబాద్ యునైటెడ్‌లో భాగం కావం సంతోషంగా ఉంది. ఎక్స్‌లెన్స్, ఎంపవర్‌మెంట్, ఎడ్యుకేషన్, ఎన్విరాన్‌మెంట్.. ఇలా నాలుగు E-లను ప్రధాన లక్షణాలుగా చేసుకుని ముందుకు సాగుతున్న జట్టుతో చేరడం గొప్ప విషయం. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది కలిగి ఉన్న ఈ టీమ్‌తో ప్రయాణం సాగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా’’ అని పేర్కొన్నాడు.
ఆర్సీబీతో దాదాపు ఐదేళ్లు
కాగా గతంలో న్యూజిలాండ్‌తో పాటు అర్జెంటీనా, కెన్యా జట్లకు మైక్ హసన్ కోచ్‌గా వ్యవహరించాడు. అదే విధంగా 2019-2023 వరకు ఆర్సీబీ డైరెక్టర్‌గా ఉన్నాడు. అతడి మార్గదర్శనంలో ఆర్సీబీ 2020- 2022 వరకు వరుసగా మూడుసార్లు ప్లే ఆఫ్స్ చేరుకుంది. కానీ టైటిల్ గెలవడంలో మాత్రం విఫలమైంది.
చదవండి: WC 2023 Semis Race: అలా అయితే న్యూజిలాండ్‌కు షాక్ తగిలినట్లే! ఇప్పటికి భారం వరణుడిపైనే!
Comments
Please login to add a commentAdd a comment