Disappointed to be leaving RCB: ‘‘గత నాలుగు సీజన్లలో మూడుసార్లు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్నాం. కానీ.. అభిమానులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు నేనూ.. మేమంతా కోరుకున్నట్లుగా.. ట్రోఫీ గెలవలేకపోయాం. ఆర్సీబీని వీడటం నిరాశకు గురిచేసినా.. ఇక్కడ నేనెన్నో మధురజ్ఞాపకాలు మూటగట్టుకోగలిగాను.
గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఆర్సీబీకి, జట్టు కొత్త కోచింగ్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్. ఇక అద్భుతమైన ఆర్సీబీ అభిమానుల గురించి చెప్పేదేముంది?
మీ అందరి అంతులేని ఆదరాభిమానాలకు, ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు.. సొంత ఇంట్లో ఉన్న భావన కల్పించినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేసిన మైక్ హసన్ భావోద్వేగానికి లోనయ్యాడు.
బాధగా ఉంది..
ఆర్సీబీని వీడటం బాధగా ఉందని.. శాయశక్తులా కృషి చేసినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా కొత్త సిబ్బంది మార్గదర్శనంలో ఆర్సీబీ మరింత ముందుకు వెళ్లాలని మైక్ హసన్ ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆర్సీబీ కీలక నిర్ణయాలు
మైక్ హసన్‌ను ఉద్వాసన పలకడంతో పాటు హెడ్‌కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేసింది. కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ కప్ విన్నింగ్ కోచ్ ఫ్లవర్‌కు స్వాగతం పలుకుతూ ప్రకటన విడుదల చేసింది.
ఈ క్రమంలో ఆర్సీబీతో బంధం ముగిసిన నేపథ్యంలో.. న్యూజిలాండ్‌కు చెందిన 48 ఏళ్ల మైక్ హసన్ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ మాత్రం చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో పదహారో ఎడిషన్‌ను ముగించింది.
చదవండి: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
We thank 𝐌𝐢𝐤𝐞 𝐇𝐞𝐬𝐬𝐨𝐧 and 𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐫 for their commendable work during the stints as 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿 𝗼𝗳 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 and 𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 of RCB. 🙌#PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0
— Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023
Comments
Please login to add a commentAdd a comment