sanjay bangar
-
రోహిత్ ప్రాక్టీస్ ఆపేయ్.. ఫస్ట్ ఆ పనిచేయు: భారత మాజీ క్రికెటర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్-2024 తర్వాత రోహిత్ శర్మ ఆటతీరు పేలవంగా మారిపోయింది. టెస్టులు, వన్డేల్లో హిట్‌మ్యాన్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో దారుణంగా విఫలమైన రోహిత్.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో అదే తీరును కనబరుస్తున్నాడు.నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఒకప్పుడు షార్ట్ పిచ్ బంతులను అలోవకగా సిక్సర్లగా మలిచిన రోహిత్.. ఇప్పుడు అదే బంతులకు ఔట్ అవుతుండడం అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ తన ఫామ్‌ను అందుకోవాలని సగటు భారత అభిమాని కోరుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌కు భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మ తన రిథమ్‌ను తిరిగి పొందడానికి గతంలో తను ఆడిన వీడియోలు చూడాలని బంగర్ అభిప్రాయపడ్డాడు."రోహిత్ శర్మ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. తన కెరీర్లో పరుగులు చేయని దశను అనుభవిస్తున్నాడు. అయితే అతడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి ఎక్కువగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. కానీ కొన్నిసార్లు ఎక్కువగా సాధన చేయడం వల్ల ప్రయోజనం ఉండదు. అతడు ఒంటరిగా ఉండి బ్యాటర్‌గా తన గత విజయాలను గుర్తు చేసుకోవాలి. గతంలో తన బ్యాటింగ్ చేసిన వీడియోలను చూడాలి. ప్రస్తుతం ఎక్కడ తప్పు జరుగుతుందో గుర్తించి సరిదిద్దుకోవాలి. కొన్ని సార్లు ఇలా చేయడం ఫలితాన్ని ఇస్తోంది. ఒక్కసారి రిథమ్‌ను అందుకొంటే చాలు. అంతేకానీ ఎక్కువగా ఆలోచించి నిరాశలో కూరుకుపోకూడదు" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా కటక్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో వన్డే ఆదివారం జరగనుంది. ఈ మ్యాచ్‌లోనైనా రోహిత్ తన బ్యాట్‌కు పనిచేబుతాడో లేదో చూడాలి. కాగా ఈ మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి అందుబాటులో ఉండనున్నాడు. గాయం కారణంగా తొలి వన్డేకు దూరమైన కోహ్లి.. ఇప్పుడు తన ఫిట్నెస్ను తిరిగిపొందాడు . ఈ విషయాన్ని భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ ధ్రువీకరించాడు. కింగ్ ఎంట్రీతో యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే ఛాన్స్ ఉంది. రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్చదవండి: SL vs AUS: సూపర్ మేన్ స్మిత్.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్! వీడియో వైరల్ -
CT 2025: ‘నాణ్యమైన బౌలర్.. సిరాజ్‌ను ఎలా పక్కనపెట్టారు?’
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్(Mohammed Siraj)కు భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ బంగర్(Sanjay Bangar)మద్దతుగా నిలిచాడు. అతడిని ఇంగ్లండ్‌తో వన్డేలకు, చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) జట్టుకు ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఈ హైదరాబాదీ స్టార్ నాణ్యమైన నైపుణ్యాలున్న బౌలర్ అని.. అలాంటి ఆటగాడిని పక్కనపెట్టడం సరికాదని యాజమాన్యానికి హితవు పలికాడు.వన్డేలకు సిద్ధమైన రోహిత్ సేనకాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో 3-1తో టెస్టు సిరీస్ కోల్పోయిన అనంతరం.. టీమిండియా స్వదేశంలో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లతో బిజీ అయింది. ఇప్పటికే సూర్యకుమార్ సేన ఐదు టీ20లలో నాలుగింట గెలిచి బట్లర్ బృందాన్ని చిత్తు చేసి సిరీస్ గెలుచుకోగా.. తాజాగా రోహిత్ సేన వన్డేలకు సిద్ధమైంది.అందుకే చోటివ్వలేదుఅయితే, ఆసీస్ పర్యటన తర్వాత విశ్రాంతి పేరిట సిరాజ్‌ను టీ20 సిరీస్ నుంచి తప్పించిన మేనేజ్మెంట్.. వన్డేల్లోనూ చోటివ్వలేదు. అంతేకాదు.. చాంపియన్స్ ట్రోఫీ జట్టు ఎంపిక సమయంలోనూ అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ.. సిరాజ్‌ను పక్కనపెట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు.ఇన్నింగ్స్ ఆరంభంలో కొత్త బంతితో రాణించగలుగుతున్న సిరాజ్.. డెత్ ఓవర్లలో మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ పేర్కొన్నాడు. అందుకే మహ్మద్ షమీతో పాటు అర్ష్‌దీప్ సింగ్‌కు బుమ్రా నాయకత్వంలోని పేస్ దళంలో చోటిచ్చినట్లు తెలిపాడు.నాణ్యమైన బౌలర్.. అతడిని ఎలా పక్కనపెట్టారుఇక ఇంగ్లండ్‌తో గురువారం నుంచి టీమిండియా వన్డే సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో ఈ విషయాలపై సంజయ్ బంగర్ స్పందించాడు. ‘‘జట్టు విజయాల్లో ఎన్నోసార్లు కీలక పాత్ర పోషించిన సిరాజ్‌ను పక్కనపెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. కొన్ని మ్యాచ్‌లలో అయితే తన అద్భుత ప్రదర్శనతో అతడే జట్టును గెలిపించాడు.ఉదాహరణకు అహ్మదాబాద్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై టీమిండియా విజయంలో తన పాత్ర కూడా ఉంది. అయితే, పాత బంతితో రాణింలేకపోతున్నాడన్న కారణం చూపి అతడిని పక్కనపెట్టడం సరికాదు. అతడొక క్వాలిటీ ప్లేయర్. ఏ దశలో బాగా బౌలింగ్ చేస్తాడన్న అంశంతో సంబంధం లేకుండా నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడికి జట్టులో చోటివ్వాలి’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.కాగా ఆసియా వన్డే కప్-2023 ఫైనల్లోనూ సిరాజ్ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఏడు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 21 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ లంక 50 పరుగులకే కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు.తద్వారా టీమిండియా సునాయాస విజయానికి బాటలు వేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక వన్డే వరల్డ్‌కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ రెండు కీలక వికెట్లు తీసి భారత్ విజయంలో పాలుపంచుకున్నాడు. అయితే, ఇటీవల ఆస్ట్రేలియా గడ్డ మీద మాత్రం సిరాజ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అలా అయితే సిరాజ్‌కు చోటుకానీ టెస్టులు.. వన్డే ఫార్మాట్ వేరు కాబట్టి సిరాజ్‌కు ఇంగ్లండ్‌తో వన్డేల్లోనైనా అవకాశం ఇచ్చి చూడాల్సిందని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పి నుంచి పూర్తిగా కోలుకోకపోతే.. సిరాజ్‌కు దుబాయ్ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉందని మరో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే జరుగుతుంది. అనంతరం ఆదివారం(ఫిబ్రవరి 9) కటక్‌లో రెండో వన్డే.. అదే విధంగా అహ్మదాబాద్‌లో బుధవారం(ఫిబ్రవరి 12) మూడో వన్డే జరుగుతాయి. అనంతరం ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్- దుబాయ్ సంయుక్త వేదికలుగా చాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది. ఈ ఐసీసీ టోర్నమెంట్లో భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే ఆడుతుంది.చదవండి: ఇదేం పద్ధతి?: రోహిత్ శర్మ ఆగ్రహం -
కెప్టెన్‌గా సూర్యా ఏంటి?.. నేనైతే షాకయ్యా: టీమిండియా మాజీ కోచ్
ఒకప్పుడు టీమిండియాలో చోటు కోసం పరితపించిపోయిన సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఇప్పుడు కెప్టెన్ స్థాయికి చేరుకున్నాడు. ముప్పై ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన అతడు.. పొట్టి ఫార్మాట్లో తనను తాను నిరూపించుకుని ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. టీ20లో ప్రపంచ నంబర్ వన్(ICC World No.1 Batter) బ్యాటర్‌గా సత్తా చాటిన అతడు.. మూడేళ్ల వ్యవధిలోనే అనూహ్యంగా భారత జట్టు(Team India T20 Captain) నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు.కెప్టెన్‌గా వరుస విజయాలుపూర్తిస్థాయి టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంకలో క్లీన్‌స్వీప్ విజయం అందుకున్న సూర్య... బంగ్లాదేశ్‌పై కూడా ఇదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. యువ జట్టుతో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లి అక్కడా టీ20 సిరీస్‌ను 3-1తో గెలిచి తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సూర్య సారథ్యంలో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో సిరీస్ గెలవడంలో టీమిండియా బిజీగా ఉంది.ఈ నేపథ్యంలో భారత జట్టు బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్(Sanjay Bangar) సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తక్కువ కాలంలోనే అతడు కెప్టెన్ స్థాయికి చేరుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా నియామకం దాదాపు ఖరారైపోయిందన్న తరుణంలో సూర్య సారథిగా ఎంపిక కావడం నిజంగా ఓ షాక్ అన్నాడు.హార్దిక్ పాండ్యాకు బదులు సూర్య.. నేనైతే షాకయ్యాఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ ‘షో’లో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది హార్దిక్ పాండ్యానే కాబోయే కెప్టెన్ అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా సూర్య పేరు బయటకు వచ్చింది. నిజంగా కెప్టెన్‌గా అతడి నియామక ప్రకటన రాగానే.. నేనైతే షాకయ్యా. ఏదేమైనా.. నాయకుడిగా అతడు ఎదిగిన తీరు అద్భుతం.రోహిత్, కోహ్లి, జడేజా రిటైర్మెంట్ తర్వాత.. యువకులతో కూడిన జట్టు లభించడం కూడా అతడికి కలిసి వచ్చింది. వాళ్లలో ఒకడిగా ఉంటూనే.. నవతరం నాయకుడిగా సూర్య సరికొత్తగా తనను తాను ఆవిష్కరించుకునే వీలు కలిగింది.ఇక బ్యాటర్‌గా అతడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. బౌలర్ చేతి నుంచి బంతి వెలువడకముందే.. దానిని అంచనా వేసి అందుకు తగ్గట్లుగా పర్ఫెక్ట్ షాట్‌తో రెడీ ఉండటం కొద్దిమందికే సాధ్యమవుతుంది. అందులో సూర్య ఒకడు.అతడో అద్భుత బ్యాటర్ఆసియా కప్ సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు సూర్యను ఎదుర్కొనేందుకు పడ్డ కష్టాలను మేము చూశాం. వాళ్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక కొత్త షాట్‌తో బంతిని ఎదుర్కోవడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. 360 డిగ్రీలలో షాట్లు బాదగల క్రికెటర్లు ఎంతో మంది ఉన్నారు. అయితే, అప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా.. తన ప్రణాళికను మార్చుకుని షాట్లు ఆడటంలో దిట్ట. అతడో అద్భుత బ్యాటర్’’ అని సంజయ్ బంగర్ సూర్యను ప్రశంసించాడు.గొప్ప కెప్టెన్ కూడామరోవైపు.. ఇదే షోలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘కెప్టెన్‌గానూ అతడిలో టెంపర్మెంట్ సూపర్. గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారీ మరింత ప్రశాంతంగా.. నిరాడంబరంగా ఉండటం అతడికే చెల్లింది. అతడి మనసు మంచిది. టెస్టు కెప్టెన్సీకి బుమ్రా సరైనవాడని ఎలా అనుకుంటున్నామో.. టీ20లకు సూర్య అత్యుత్తమ కెప్టెన్ అని ఇప్పటికే రుజువైంది’’ అని సూర్యకుమార్ యాదవ్‌ను కొనియాడాడు. చదవండి: రెండు వరల్డ్‌కప్‌లు ఆడాడు.. ఇప్పట్లో టీమిండియా రీఎంట్రీ కష్టమే! -
సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!
సంజూ శాంసన్(Sanju Samson)కు తాను పెద్ద అభిమానినైపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) అన్నాడు. గతంలో బ్యాటింగ్ బాగా చేసినా.. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడేవాడని.. ఇప్పుడు మాత్రం దుమ్ములేపుతున్నాడని ప్రశంసించాడు. సంజూ ఆట తీరుకు తాను ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. రానున్న కాలంలో ఈ కేరళ బ్యాటర్ అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అద్భుత నైపుణ్యాలున్నా.. నిలకడలేమి ఆట తీరుకు మారుపేరని అపవాదు ఉంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడి ఆట తీరు అభిమానులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. తొలుత స్వదేశంలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డ సంజూ.. సౌతాఫ్రికా గడ్డ మీద కూడా రెండు సెంచరీలతో రాణించాడు.బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 107, 109 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్(India Vs England)తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ అలాంటి వాడేఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘ఆత్మవిశ్వాసం.. పరిణతితో కూడిన బ్యాటింగ్.. వికెట్‌కు విలువ ఇచ్చే విధానం.. సంజూలోని ఈ గుణాలు నన్ను ఆకట్టుకున్నాయి. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేడని, నిలకడలేని ఆటగాడని విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొంతమంది ఆలస్యంగా పేరు తెచ్చుకుంటారు. సంజూ అలాంటి వాడే. నేనిప్పుడు అతడికి వీరాభిమానిని. గతంలో అతడు బ్యాటింగ్ మాత్రమే బాగా చేస్తాడు.. పరుగులు చేయడని అంతా అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు రెండూ బాగానే చేస్తున్నాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.ఇక ఇదే షోలో మరో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం సంజూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో బాగా ఆడితే.. బ్యాటర్‌పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా అతడు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడు.సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతడికి సానుకూలాంశం. వికెట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అంతేకాదు.. సంజూ సిక్స్ హిట్టర్. ఎంతో ఈజ్‌తో సిక్సర్లు బాదుతాడు. యువరాజ్ సింగ్ తర్వాత.. అదే స్టైల్లో సిక్స్‌లు కొట్టగల మరో బ్యాటర్ సంజూ శాంసనే. అతడు పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి చక్కగా ఉంటుంది’’ అని సంజయ్ బంగర్ కొనియాడాడు.కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ద్వారా 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఆ తర్వాత ఆరేళ్లకు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 37 టీ20లు, 16 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఓ శతకం సాయంతో 510 పరుగులు చేయగా.. టీ20లలో మూడు సెంచరీల సహాయంతో 810 రన్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.చదవండి: IND Vs IRE 1st ODI: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా.. -
Ind vs Eng: తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!
ఆస్ట్రేలియా పర్యటన తాలూకు చేదు అనుభవం తర్వాత.. స్వదేశంలో మరో మెగా సిరీస్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఇంగ్లండ్‌తో టీ20, వన్డేల్లో తలపడనుంది. ఇరు జట్ల మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఈ సిరీస్ కొనసాగనుంది.ఇందులో భాగంగా భారత్- ఇంగ్లండ్ ఐదు టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో టీ20ల నేపథ్యంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్(Rishabh Pant)కు భారత తుదిజట్టులో చోటు దక్కదని అభిప్రాయపడ్డాడు.తుదిజట్టులో పంత్‌కు స్థానం ఉండదు!పంత్‌కు బదులుగా సంజూ శాంసన్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపుతారని సంజయ్ బంగర్ అంచనా వేశాడు. ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గత సిరీస్ ప్రదర్శన ఆధారంగా వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజూ శాంసన్(Sanju Samson) టీ20 జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడని చెప్పవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు.కాబట్టి మరో వికెట్ కీపర్.. అంటే రిషభ్ పంత్‌కు టీ20 జట్టులో చోటు దక్కడం కష్టం. ఒకవేళ సంజూ ఓపెనర్‌గా వస్తే పరిస్థితి ఒకలా ఉంటుంది. అదే మిడిలార్డర్లో వస్తే మరోలా ఉంటుంది. పంత్ టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తుదిజట్టులో సభ్యుడైనా ఈసారి మాత్రం టీమ్‌లో స్థానం కోసం గట్టి పోటీని ఎదుర్కొంటున్నాడు. సంజూ అద్భుత ప్రదర్శన కారణంగా పంత్ చోటు గల్లంతైనా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.తిలక్ వర్మకు లైన్ క్లియర్అదే విధంగా.. తెలుగు తేజం, యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) కూడా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో కచ్చితంగా ఆడతాడని సంజయ్ బంగర్ జోస్యం చెప్పాడు. ‘‘ఎడమచేతి వాటం బ్యాటర్‌గా ఉండటం తిలక్ వర్మకు అదనపు బలం. జట్టుకు ఇలాంటి ఆటగాడు అవసరం. గత సిరీస్‌లో అతడు కూడా దంచికొట్టాడు. అందుకే తిలక్‌కు లైన్ క్లియర్‌గా ఉంది’’ అని పేర్కొన్నాడు.కాగా సౌతాఫ్రికా గడ్డపై సంజూ శాంసన్, తిలక్ వర్మ శతకాలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఇద్దరూ చెరో రెండు సెంచరీలు బాదడంతో ప్రొటిస్ జట్టుతో టీ20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో నాలుగు మ్యాచ్‌లలో మూడు గెలిచి 3-1తో సౌతాఫ్రికాపై నెగ్గింది. సంజూ, తిలక్ ఊచకోతతొలి టీ20లో 107 పరుగులు సాధించిన సంజూ.. తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యాడు. అయితే, నాలుగో టీ20లో మాత్రం 56 బంతుల్లో 109 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.మరోవైపు.. తిలక్ వర్మ మూడు, నాలుగో టీ20లలో శతక్కొట్టేశాడు. సెంచూరియన్ మ్యాచ్‌లో 56 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ స్టార్.. జొహన్నస్‌బర్గ్‌లో 47 బంతుల్లోనే 120 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య జనవరి 22, 25, 28, 31, ఫిబ్రవరి 2వ తేదీల్లో ఐదు టీ20లు జరుగుతాయి.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టెస్టులు ఆడిన టీమిండియా ఆతిథ్య జట్టు చేతిలో 3-1తో ఓడింది. తద్వారా పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కంగారూలకు సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో రిషభ్ పంత్ 255 పరుగులు సాధించాడు.చదవండి: CT 2025: జైస్వాల్, నితీశ్ రెడ్డిలకు ఆఫర్! మెగా టోర్నీకి ఎంపికయ్యే ఛాన్స్! -
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు.. అనయగానే నాకు ఆనందం(ఫొటోలు)
-
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. స్త్రీగా మారినందు వల్ల..
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ బంగర్ అమ్మాయిగా మారిపోయాడు. తండ్రి బాటలోనే క్రికెటర్‌గా అడుగులు వేసిన అతడు.. తన శరీర ధర్మానికి అనుగుణంగా అనయగా మార్పు చెందాడు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అనయ బంగర్.. స్త్రీగా మార్పు చెందడంలో తన ప్రయాణం సాగిన తీరును ప్రస్తావిస్తూ తాజాగా వీడియో షేర్ చేసింది.అంతులేని సంతోషాన్ని పొందాను‘‘శారీరకంగా బలాన్ని కోల్పోయినా.. అంతులేని సంతోషాన్ని పొందాను. నా శరీరం మారిపోయింది. అసంతృప్తి క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇంకా నేను చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. అయితే, వేసే ప్రతీ అడుగు నాకు మరింతగా నచ్చుతోంది’’ అని అనయ తన సంతోషాన్ని పంచుకుంది.టీమిండియా బ్యాటింగ్ కోచ్గానూకాగా మహారాష్ట్రకు చెందిన సంజయ్ బంగర్ కుడిచేతి వాటం బ్యాటర్. అదే విధంగా.. రైటార్మ్ ఫాస్ట్ మీడియం పేసర్ కూడా. 2001- 2004 మధ్య టీమిండియా తరఫున ఈ ఆల్‌రౌండర్ 12 టెస్టులు, 15 వన్డేలు ఆడి.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 470, 180 పరుగులు సాధించాడు. అలాగే.. టెస్టుల్లో ఏడు, వన్డేల్లో ఏడు వికెట్లు తీశాడు.టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గానూ పనిచేసిన 52 ఏళ్ల సంజయ్ బంగర్ వ్యక్తిగత జీవితం విషయానికొస్తే.. కశ్మీరతో అతడికి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. అందులో పెద్దవాడైన ఆర్యన్ బంగర్ ఇప్పుడు అనయ బంగర్గా మారాడు. కాగా అనయ కూడా క్రికెటర్‌గా ఎదగాలనే ఆశయంతో ఉంది.గతంలో భారత దేశీ టోర్నీల్లోనూ ఆడిన అనయ ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉంటున్నట్లు సమాచారం. ట్రాన్స్ వుమన్కు క్రికెట్ ఆడే అవకాశం లేనందు వల్ల తన కలకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని అనయ ఇటీవల ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఓ లేఖ షేర్ చేసింది.మా నాన్న బాటలో నడవాలనున్నాను.. కానీ‘‘నా ప్రేమ.. నా కల.. నా ఆశయం.. నా భవిష్యత్తు.. అంతా క్రికెటే. మా నాన్న టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే కాదు.. కోచ్‌గానూ పనిచేశాడు. ఆయనను చూస్తూ పెరిగిన నేను ఆయన అడుగుజాడల్లో నడవాలని భావించాను. క్రికెట్లో నా నైపుణ్యాలను పెంచుకునేందుకు కృషి చేశాను.కానీ అర్ధంతరంగా ఆటను ఇలా వదిలేయాల్సి వస్తుందని అనుకోలేదు. అయితే, ఈ చేదు నిజాన్ని అంగీకరించకతప్పదు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ చేసుకున్న తర్వాత ట్రాన్స్ వుమన్‌గా నాలో చాలా మార్పులు వచ్చాయి.కండబలం తగ్గిందినా శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది. నా కండబలం తగ్గింది. శక్తిని కోల్పోయాను. అథ్లెట్లకు ఉండాల్సిన పవర్ మెల్లమెల్లగా తగ్గింది. ట్రాన్స్వుమన్కు కూడా క్రికెట్ ఆడే అవకాశాలు ఇవ్వాలి’’ అని అనయ ఉద్వేగపూరిత నోట్ షేర్ చేసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిబంధనల ప్రకారం.. ట్రాన్స్జెండర్లకు ఇంటర్నేషనల్ స్థాయిలో మహిళా క్రికెట్ ఆడే వీలు లేదు. 2023లో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళా క్రికెట్ భవితవ్యం, వుమెన్ ప్లేయర్ల భద్రత, సమగ్రత దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.చదవండి: Ind vs SA: సూర్య చేసిన అతిపెద్ద తప్పు అదే.. అతడిని ఎందుకు ఆడిస్తున్నట్లు మరి? View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) View this post on Instagram A post shared by Anaya Bangar (@anayabangar) -
‘రోహిత్ వేలంలోకి వస్తే.. మేమూ పోటీలో ఉంటాం’
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 వేలంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్‌తో సుదీర్ఘ బంధాన్ని తెంచుకునేందుకు హిట్‌మ్యాన్ సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ గనుక వేలంలోకి వస్తే దక్కించుకునేందుకు మూడు ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉన్నట్లు ఐపీఎల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఈ జాబితాలో పంజాబ్ కింగ్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ఫ్రాంఛైజీ క్రికెట్ డెవలప్మెంట్ హెడ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. కాగా ఐపీఎల్లో ఓ జట్టును అత్యధికసార్లు చాంపియన్‌గా నిలిపిన మొదటి కెప్టెన్‌గా రోహిత్ శర్మ తన పేరును చరిత్రపుటల్లో లిఖించుకున్నాడు.ముంబై యాజమాన్యంతో విభేదాలు?ముంబై జట్టుకు ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించి ఈ ఘనత సాధించాడు. అయితే, గతేడాది ముంబై ఫ్రాంఛైజీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు వేసి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ ధరకు హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ కెప్టెన్‌గా నియమించింది.ఈ క్రమంలో ముంబై యాజమాన్యం- రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయనే సంకేతాలు వెలువడ్డాయి. ఇక మైదానంలో రోహిత్ పట్ల హార్దిక్ వ్యవహరించిన తీరు కూడా విమర్శలు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ముంబై జట్టును వీడేందుకు రోహిత్ శర్మ నిర్ణయించుకున్నాడని ఐపీఎల్ వర్గాలు లీకులు ఇచ్చాయి. అతడు గనుక వేలంలోకి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ పోటీపడనున్నాయని వెల్లడించాయి.తగినంత డబ్బు ఉంటే కొనుక్కుంటాంఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్‌కు చెందిన సంజయ్ బంగర్ ఓ యూట్యూబ్ చానెల్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ రోహిత్ గనుక వేలంలోకి వస్తే మాత్రం.. అతడు భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయం. అయితే, మా పర్సులో ఎంత డబ్బు ఉందనే అంశం మీదే అంతా ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. తమ దగ్గర తగినంత డబ్బు ఉంటే రోహిత్ శర్మను కచ్చితంగా సొంతం చేసుకుంటామని చెప్పకనే చెప్పాడు.సుదీర్ఘ అనుబంధంకాగా తొలుత దక్కన్ చార్జర్స్ హైదరాబాద్‌కు ఆడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఆ తర్వాత రెండేళ్లకు రిక్కీ పాంటింగ్ స్థానంలో ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి పదేళ్లపాటు సారథిగా కొనసాగిన రోహిత్ ప్రయాణానికి హార్దిక్ రాకతో ఈ ఏడాది తెరపడింది. అయితే, ఇదే ఏడాది టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీని రోహిత్ గెలవడం విశేషం. ఈ నేపథ్యంలో ముంబై అతడిని రిటైన్ చేసుకుంటుందా? ఒకవేళ ఆ ఆఫర్ ఇచ్చినా రోహిత్ శర్మ అందుకు సమ్మతిస్తాడా? అన్న సందేహాలకు వేలానికి ముందే సమాధానం దొరకనుంది. చదవండి: రిటైర్మెంట్ తర్వాత.. అభిమానులకు శుభవార్త చెప్పిన ధావన్ -
జో రూట్, స్టీవ్ స్మిత్‌లకు దక్కని చోటు..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ సంజయ్ బాంగర్ ప్రస్తుత తరంలో తన ఫేవరెట్ వరల్డ్ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాడు. ఈ జట్టుకు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్‌లను ఎంపిక చేసిన బాంగర్.. వన్‌డౌన్‌లో కేన్ విలియమ్సన్, నాలుగో స్థానంలో విరాట్ కోహ్లి, వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్, ఆల్‌రౌండర్ల కోటాలో బెన్ స్టోక్స్, రవీంద్ర జడేజా, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్, పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, జోష్ హజిల్‌వుడ్‌ను ఎంపిక చేశాడు. బాంగర్ తన వరల్డ్ ఫేవరెట్ జట్టులో వరల్డ్ టాప్ టెస్ట్ బ్యాటర్లు జో రూట్, స్టీవ్ స్మిత్‌లకు చోటివ్వకపోవడం గమనార్హం.ఇదిలా ఉంటే, రావ్ పోడ్కాస్ట్తో బాంగర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. విరాట్ ఓ దశలో తనతో టెస్ట్ డబుల్ సెంచరీల గురించి డిస్కస్ చేశాడని చెప్పాడు. అప్పటి వరకు విరాట్ టెస్ట్‌ల్లో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదని అన్నాడు. అది అతని కెరీర్లో వెలితిగా ఉండేదని చెప్పాడు. అయితే విరాట్ డబుల్ సెంచరీలు ఎలా చేయాలో తెలుసుకున్న తర్వాత ఒకే సీజన్లో నాలుగైదు డబుల్ సెంచరీలు చేసి తానేంటో నిరూపించుకున్నాడని గుర్తు చేశాడు.బ్యాటింగ్‌లో విరాట్ ఓ జీనియస్ అని కొనియాడాడు. అతను పట్టుపట్టాడంటే సాధించే వరకు వదలడని తెలిపాడు. విరాట్‌లా కష్టపడే వారు జట్టులో మరొకరు లేరని ప్రశంసించాడు. అతను జట్టు కోసం ఎంతో చేశాడని అన్నాడు. అతను దూకుడు మనిషే కానీ, అదే చాలా సందర్భాల్లో జట్టు విజయాలకు దోహదపడిందని గుర్తు చేశాడు. విరాట్ విదేశాల్లో రాణించేందుకు ఎక్కువగా ఇష్టపడతాడని తెలిపాడు. జట్టు సభ్యులు కూడా విదేశీ పిచ్‌లపై రాణించాలని విరాట్ కోరుకుంటాడని అన్నాడు. -
IPL 2024: పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. మరోసారి అతడితో
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు క్రికెట్ డెవలప్మెంట్ హెడ్‌గా టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ నియమించింది. కాగా పంజాబ్ ఫ్రాంచైజీతో బంగర్ జతకట్టడం ఇదేమి మొదటి సారి కాదు. 2014 సీజన్లో పంజాబ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా, 2015, 2016 సీజన్లలో హెడ్కోచ్గాను బంగర్ పనిచేశాడు. వచ్చే ఏడాది సీజన్లో ప్రధాన కోచ్ ట్రెవర్ బేలిస్‌తో కలిసి బంగర్ పనిచేయనున్నాడు. పంజాబ్ డెవలప్మెంట్ హెడ్‌గా బాధ్యతలు చేపట్టడం పట్ల బంగర్ సంతోషం వ్యక్తం చేశాడు. "మరోసారి పంజాబ్ ఫ్రాంచైజీతో మరోసారి జతకట్టడం చాలా సంతోషంగా ఉంది. మేము ఏడాది తక్కువ మంది ప్లేయర్స్‌ను విడుదల చేశాము. మా జట్టులో ప్రస్తుతం అద్బుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అన్ని విభాగాల్లొ మా జట్టు పటిష్టంగా ఉంది. రాబోయే సీజన్లో విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" బంగర్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఐపీఎల్- 2024 సీజన్‌కు సంబంధించిన మినీ వేలం డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా జరగనుంది. చదవండి: అందుకే సడన్‌గా రిటైర్మెంట్ ఇచ్చా.. నా చిన్న కొడుకు వల్ల: డివిలియర్స్ -
కేఎల్ రాహుల్ వద్దే వద్దు.. వికెట్ కీపర్‌గా అతడే బెస్ట్! అలా అయితేనే..
Asia Cup 2023: ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ ఎంపిక గురించి మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గాయంతో సతమతమవుతున్న ఆటగాడికి బదులు ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను తుదిజట్టులోకి తీసుకోవాలని పేర్కొన్నాడు. మెగా టోర్నీలో కేఎల్ రాహుల్‌ను పక్కనపెడితేనే అనుకున్న ఫలితాలు రాబట్టగలమని అభిప్రాయపడ్డాడు. వాళ్లిద్దరి రీఎంట్రీ.. అయితే పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తగా ఆతిథ్యం ఇస్తున్న ఆసియా కప్ ఈవెంట్ ఆగష్టు 30న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ప్రకటించిన జట్టులో గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లకు చోటు దక్కింది. ఈ వన్డే టోర్నీతో ఇద్దరూ పునరాగమనం చేయనున్నారు. అయితే, రాహుల్‌ను గాయం వెంటాడుతున్న కారణంగా అతడు తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం లేదని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. సగం సగం ఫిట్నెస్ ఉన్నవాళ్లెందుకు? ఈ క్రమంలో వికెట్ కీపర్‌గా లెఫ్టాండర్ ఇషాన్ కిషన్‌కు ప్రధాన జట్టులో చోటివ్వడంతో పాటు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ రిజర్వ్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘రెగ్యులర్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ రాణిస్తున్నాడు. తనలో ఎలాంటి ప్రయత్నలోపం లేదు. సగం సగం ఫిట్నెస్తో.. అసలు ఆడతాడా లేడా అన్న సందేహంలో ముంచేసే ఆటగాడి కంటే.. పూర్తి ఫిట్‌గా ఉన్నవాళ్లకే మొదటి వికెట్ కీపర్‌గా ప్రాధాన్యం ఇవ్వాలి. ఇషాన్ కిషన్ బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి కేఎల్ రాహుల్ కీపర్ బ్యాటర్‌గా మాత్రమే జట్టులోకి వస్తాడు. స్పెషలిస్టు బ్యాటర్ మాత్రం కాదు. టాప్-5లో వికెట్ కీపర్ కూడా ఉండాలనుకుంటే.. ఆరు బౌలింగ్ ఆప్షన్లు కూడా దొరుకుతాయి. జట్టు సమతూకంగా ఉంటుంది’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ బంగర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రాహుల్ బదులు ఫిట్‌గా ఉన్న ఇషాన్ కిషన్‌నే వికెట్ కీపర్ బ్యాటర్‌గా తుదిజట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. విండీస్‌లో యువ బ్యాటర్ మెరుపులు కాగా ఇటీవల వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో ఇషాన్ కిషన్ అదరగొట్టిన విషయం తెలిసిందే. మూడు మ్యాచ్లలోవరుసగా 52, 55, 77 పరుగులతో రాణించాడు. కరేబియన్ దీవిలో వరుస హాఫ్ సెంచరీలతో ఆకట్టుకుని రికార్డులు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఈ మేరకు జట్టు కూర్పు విషయంలో తనకైతే ఇషాన్ ఫస్ట్ ఛాయిస్ అని పేర్కొన్నాడు. చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్ Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే నిద్రలేని రాత్రులు కూడా సంతోషాన్నిస్తాయి.. గుడ్‌న్యూస్ చెప్పిన యువీ! -
IPL 2024: ఆర్సీబీని వీడటం చాలా బాధగా ఉంది.. అందరికీ థాంక్స్
Disappointed to be leaving RCB: ‘‘గత నాలుగు సీజన్లలో మూడుసార్లు మెరుగైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌నకు చేరుకున్నాం. కానీ.. అభిమానులు, ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు నేనూ.. మేమంతా కోరుకున్నట్లుగా.. ట్రోఫీ గెలవలేకపోయాం. ఆర్సీబీని వీడటం నిరాశకు గురిచేసినా.. ఇక్కడ నేనెన్నో మధురజ్ఞాపకాలు మూటగట్టుకోగలిగాను. గొప్ప గొప్ప వ్యక్తులతో పనిచేసే అవకాశం నాకు లభించింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన ఆర్సీబీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. ఆర్సీబీకి, జట్టు కొత్త కోచింగ్ సిబ్బందికి ఆల్ ది బెస్ట్. ఇక అద్భుతమైన ఆర్సీబీ అభిమానుల గురించి చెప్పేదేముంది? మీ అందరి అంతులేని ఆదరాభిమానాలకు, ఎల్లవేళలా మద్దతుగా నిలిచినందుకు.. సొంత ఇంట్లో ఉన్న భావన కల్పించినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేసిన మైక్ హసన్ భావోద్వేగానికి లోనయ్యాడు. బాధగా ఉంది.. ఆర్సీబీని వీడటం బాధగా ఉందని.. శాయశక్తులా కృషి చేసినా ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకోయామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏదేమైనా కొత్త సిబ్బంది మార్గదర్శనంలో ఆర్సీబీ మరింత ముందుకు వెళ్లాలని మైక్ హసన్ ఆకాంక్షించాడు. కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు ఆర్సీబీ మేనేజ్మెంట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్సీబీ కీలక నిర్ణయాలు మైక్ హసన్‌ను ఉద్వాసన పలకడంతో పాటు హెడ్‌కోచ్ సంజయ్ బంగర్‌పై వేటు వేసింది. కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్ కప్ విన్నింగ్ కోచ్ ఫ్లవర్‌కు స్వాగతం పలుకుతూ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో ఆర్సీబీతో బంధం ముగిసిన నేపథ్యంలో.. న్యూజిలాండ్‌కు చెందిన 48 ఏళ్ల మైక్ హసన్ సోషల్ మీడియా వేదికగా ఉద్వేగభరిత పోస్ట్ షేర్ చేశాడు. కాగా ఐపీఎల్-2023 సీజన్ ఆరంభంలో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆర్సీబీ.. ప్లే ఆఫ్స్ మాత్రం చేరుకోలేకపోయింది. పాయింట్ల పట్టికలో ఆరోస్థానంతో పదహారో ఎడిషన్‌ను ముగించింది. చదవండి: 'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు View this post on Instagram A post shared by Mike Hesson (@hesson_mike) We thank 𝐌𝐢𝐤𝐞 𝐇𝐞𝐬𝐬𝐨𝐧 and 𝐒𝐚𝐧𝐣𝐚𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐫 for their commendable work during the stints as 𝗗𝗶𝗿𝗲𝗰𝘁𝗼𝗿 𝗼𝗳 𝗖𝗿𝗶𝗰𝗸𝗲𝘁 𝗢𝗽𝗲𝗿𝗮𝘁𝗶𝗼𝗻𝘀 and 𝗛𝗲𝗮𝗱 𝗖𝗼𝗮𝗰𝗵 of RCB. 🙌#PlayBold #ನಮ್ಮRCB @CoachHesson pic.twitter.com/Np2fLuRdC0 — Royal Challengers Bangalore (@RCBTweets) August 4, 2023 -
IPL 2024: ఆర్సీబీలో కీలక మార్పులు..! వాళ్లతో తెగదెంపులు!
2024 ఐపీఎల్ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది. ఫ్రాంచైజీలో కీలక సభ్యులైన డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెస్సన్, హెడ్ కోచ్ సంజయ్ బాంగర్లను వారి పదవుల నుంచి తప్పించాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. అయితే బౌలింగ్ కోచ్ ఆడమ్ గ్రిఫ్ఫిత్ను మాత్రం కొనసాగించేందుకు ఆర్సీబీ మేనేజ్మెంట్ సుముఖంగా ఉందని తెలుస్తోంది. కాగా, బాంగర్, హెస్సన్‌లు గత ఐదు సీజన్లుగా ఆర్సీబీతో అనుబంధం కలిగి ఉన్నారు. భారత మాజీ క్రికెటర్ బాంగర్ను ఆర్సీబీ యాజమాన్యం 2022లో హెడ్ కోచ్‌గా నియమించుకుంది. కాగా, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం దాదాపు అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచి సన్నాహకాలు మొదలుపెట్టాయి. లక్నో సూపర్ జెయింట్స్ అయితే ఏకంగా తన హెడ్ కోచ్‌ను మార్చేసింది. ఆ జట్టు ఆండీ ఫ్లవర్ స్థానంలో ఆసీస్ మాజీ కోచ్ జస్టిన్ లాంగర్‌ను హెడ్ కోచ్‌గా నియమించుకుంది. ప్రస్తుతం ఆర్సీబీ కూడా లక్నో బాటలోనే నడవాలని భావిస్తుంది. ఇదిలా ఉంటే, విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్, జట్టు నిండా స్టార్లతో నిండిన ఆర్సీబీ ఇప్పటివరకు జరిగిన 16 సీజన్లలో ఒక్కసారి కూడా టైటిల్ సాధించింది లేదు. 2009, 2011 సీజన్లలో మాత్రం ఆ జట్టు కొందరు స్టార్ల పుణ్యమా అని రన్నరప్‌గా నిలిచింది. ఇటీవలే ముగిసిన 2023 సీజన్లో అయితే, ఆ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. జట్టు వరుస వైఫల్యాల నేపథ్యంలోనే యాజమాన్యం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని తెలుస్తుంది. -
WTC ఫైనల్ కి ముందు కోహ్లి గాయం...అడతాడ లేదా..
-
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్! గాయపడ్డ కోహ్లి.. అయితే!
ఐపీఎల్-203లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి గాయపడ్డాడు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా కోహ్లి మోకాలికి గాయమైంది. ఇన్నింగ్స్ 15వ వేసిన విజయకుమార్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ ఫుల్ షాట్ ఆడేప్రయత్నం చేశాడు. అయితే షాట్ సరిగ్గా కనక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో కోహ్లి పరిగెత్తుకుంటూ వచ్చి డిప్‌మిడ్ వికెట్లో అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అయితే క్యాచ్‌ను పట్టేక్రమంలో విరాట్ మెకాలి నేలను బలంగా తాకింది. దీంతో విరాట్ మైదానంలో నొప్పితో విలవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో ఫిజియో సాయంతో విరాట్ మైదానాన్ని వీడడాడు. 15 ఓవర్ అనంతరం కోహ్లి తిరిగి మరి ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు కోహ్లి గాయపడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో కోహ్లి గాయంకు సంబంధించిన అప్డేట్ను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, అతడి గాయం అంత తీవ్రమైనది కాదని బంగర్ తెలిపాడు. "విరాట్ మోకాలిలో కొంచెం నొప్పి ఉంది. కానీ అది తీవ్రమైనది కాదు. కోహ్లి వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. విరాట్ కేవలం బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా ఫీల్డింగ్‌లో తనవంతు సహకారం అందిచాలని కోరుకుంటాడు. అతడు బాగా అలసిపోయాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో దాదాపు 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశాడు. అదే విధంగా ఫీల్డింగ్‌లో కూడా 20 ఓవర్ల పాటు ఉన్నాడు. ఈ రోజు మళ్లీ దాదాపు 35 ఓవర్ల పాటు మైదానంలో ఉన్నాడు. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది" అని మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన విలేకురల సమావేశంలో బంగర్ వెల్లడించాడు. చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అతడొక అద్భుతం! కొత్తగా కనిపించాడు: హార్దిక్ -
చేతికి 5 కుట్లు.. అయినా 15 ఓవర్ల మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకం
Virat Kohli: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో విరాట్ కోహ్లి జర్నీ 15 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టింగ్ పార్ట్నర్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోహ్లితో అనుబంధం ఉన్న పలువురు మాజీ క్రికెటర్లను ఓ గొడుగు కిందకు చేర్చిన స్టార్ స్పోర్ట్స్.. కోహ్లితో వారికున్న అనుభవాలను రివీల్ చేయించింది. ఈ సందర్భంగా భారత మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బాంగర్ను పలకరించిన స్టార్‌స్పోర్ట్స్.. కోహ్లితో ఉన్న అనుభవాలను రివీల్ చేయాలని కోరగా, ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. 2016 సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి చేతికి కుట్లు పడినా, ఆ బాధను దిగమింగుతూ విధ్వంసకర శతకం బాదిన వైనాన్ని బాంగర్ గుర్తు చేసుకున్నాడు. కోహ్లి పట్టుదల, అతనికి ఆట పట్ల ఉన్న అంకితభావం ఎలాంటివో తెలియజేయడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని బాంగర్ తెలిపాడు. వర్షం కారణంగా 15 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. విరాట్ కోహ్లి (50 బంతుల్లో 113; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కోహ్లికు జతగా క్రిస్ గేల్ (32 బంతుల్లో 73; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) కూడా వీరవిహారం చేశాడు. అనంతరం బరిలోకి దిగిన పంజాబ్.. 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి 82 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్) ఓటమిపాలైంది. కాగా, ఆ సీజన్లో 16 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 81.08 సగటున రికార్డు స్థాయిలో 973 పరుగులు చేశాడు. ఇప్పటికీ ఐపీఎల్లో ఇదే అత్యధిక సీజన్ స్కోర్ (ఓ సీజన్లో ఓ ఆటగాడు సాధించిన అత్యధిక పరుగులు). -
'ఆస్ట్రేలియా సిరీస్ రోహిత్‌కు చాలా కీలకం.. కెప్టెన్‌గా అదరగొడతాడు'
భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా అద్భుతంగా రాణిస్తాడని బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా వంటి మేటి జట్టుపై టెస్టుల్లో రాణించేందుకు హిట్‌మ్యాన్ ఆసక్తిగా ఉన్నాడని బంగర్ తెలిపాడు. కాగా రోహిత్ శర్మకు ఈ టెస్టు సిరీస్ చాలా కీలకం. ఎందుకంటే కెప్టెన్‌గా రోహిత్ బాధ్యతలు చేపట్టాక పూర్తి స్థాయి టెస్టు సిరీస్ ఆడటం ఇదే తొలిసారి. జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత రోహిత్ కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. "రోహిత్ శర్మకు ఈ సిరీస్ చాలా కీలకం. అతడు గాయం కారణంగా 2015 నుంచి 2018 వరకు చాలా టెస్టు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. 2018లో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణిస్తున్న దశలో రోహిత్.. వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబంతో కలిసి స్వదేశానికి రావాల్సి వచ్చింది. ఇక ఆసీస్‌తో సిరీస్ కోసం రోహిత్ ఆసక్తిగా ఎదురుచూస్తుంటాడు. రోహిత్ ఇప్పటికే టెస్టుల్లో ఇంగ్లండ్ వంటి విదేశీ పిచ్‌లపై ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అదే విధంగా భారత్‌లో కూడా హిట్‌మ్యాన్ టెస్టుల్లో ఎన్నో సంచలన ఇన్నింగ్స్‌లు ఆడాడు. కాబట్టి అతడు ఆస్ట్రేలియాపై కూడా మెరుగ్గా రాణిస్తాడని నేను భావిస్తున్నాను. అదే విధంగా కెప్టెన్‌గా కూడా జట్టుకు సిరీస్‌ను అందిస్తాడని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బంగర్ పేర్కొన్నాడు. చదవండి: BGT 2023: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. భారత్‌కు గుడ్ న్యూస్! యార్కర్ల కింగ్ వచ్చేస్తున్నాడు -
WC 2023: రాహుల్‌కు తుది జట్టులో చోటు కష్టం.. అతడి పని అయిపోయినట్లే!
KL Rahul- ICC ODI World Cup 2023: టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోతున్నాడు. టీ20 ప్రపంచకప్-2022 సహా ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌తో సిరీస్‌లలోనూ ఆకట్టుకోలేకపోయాడు. తొలి వన్డేలో సీనియర్ జోడి రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయగా.. రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో 73 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ కర్ణాటక బ్యాటర్.. ఆ తర్వాతి రెండు వన్డే(14, 8)ల్లో మాత్రం విఫలమయ్యాడు. ముఖ్యంగా మూడో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగగా.. రాహుల్ సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు. రాణిస్తున్న యువ ఓపెనర్లు ఇక టెస్టు సిరీస్‌లో కెప్టెన్‌గా విజయవంతమైన రాహుల్ బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. కాగా బంగ్లాతో వన్డే సిరీస్‌లో రాహుల్‌ను ఐదో స్థానంలో పంపారు. అదే సమయంలో.. ఓపెనర్‌గా ఇషాన్ చెలరేగాడు. ఓపెనింగ్ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. మరో యువ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సైతం తనకు వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. రాహుల్ స్థానానికి ఎసరు ఇదిలా ఉంటే.. టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్ యాదవ్ వన్డేలోనూ రాణించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇంకో వైపు.. రవీంద్ర జడేజా తిరిగివచ్చి సత్తా చాటాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్సీ కోల్పోయిన రాహుల్ ఆటగాడిగా ఓపెనింగ్, మిడిలార్డర్ స్థానాల్లో కూడాచోటు కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రపంచకప్ తుదిజట్టులో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌కు చోటు దక్కడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ ఏడాది స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న నేపథ్యంలో రాహుల్ అవకాశాల గురించి అతడు మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రాణిస్తున్న తరుణంలో టాపార్డర్‌లో కేఎల్ రాహుల్ స్థానం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. తుదిజట్టులో చోటు కోసం అతడు ఇషాన్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారం వన్డేల్లో ఇక రాహుల్‌కు అవకాశాలు రావడం కష్టమే అనిపిస్తోంది’’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. చదవండి: IND Vs SL: శ్రీలంకతో తొలి టీ20.. యువ ఓపెనర్ అరంగేట్రం! అక్షర్‌కు నో ఛాన్స్ -
'కింగ్ పరుగుల వేట మళ్లీ మొదలైంది.. ఇక తిరుగులేదు'
హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు . భారత్ విజయం సాధించడంలో కోహ్లి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 పరుగులు సాధించాడు. అదే విధంగా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మూడో వికెట్‌కు 104 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని విరాట్ నెలకొల్పాడు. ఇక ఈ కీలక పోరులో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. కోహ్లిపై టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడూతూ..."విరాట్ ఛాంపియన్ బ్యాటర్. గతంలో చాలా మ్యాచ్‌లల్లో టీమిండియాను కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. ఇప్పడు విరాట్ తన రిథమ్ తిరిగి మళ్లీ పొందాడు. కొన్నాళ్ల పాటు ఆట నుంచి విరామం తీసుకోవడం విరాట్‌కు కలిసొచ్చింది. అతడి పరుగుల వేట మళ్లీ మొదలైంది. అది విరాట్ బాడీ లాంగ్వేజ్చూస్తే మనకు ఆర్ధమవుతోంది. అదే విధంగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో కూడా కోహ్లి ఇదే జోరును కొనసాగిస్తాడని భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు. ఇక ఆస్ట్రేలియాతో సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. చదవండి: IND vs SA: టీమిండియాతో టీ20 సిరీస్.. భారత్‌కు చేరుకున్న దక్షిణాఫ్రికా జట్టు -
'పంత్ ఓపెనర్‌గా రావాలి.. గిల్‌క్రిస్ట్‌లా చెలరేగి ఆడుతాడు'
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌ను టీమిండియా 2-2తో సమంగా ముగించింది. అయితే ఈ సిరీస్‌లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్ పంత్ పేలవ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పంత్ కేవలం 57 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో అతడి ఆటతీరుపై మాజీ క్రికెటర్లు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు. అదే విధంగా ఈ ఏడాది ఐపీఎల్లో కూడా పంత్ పెద్దగా రాణించలేకపోయాడు. మరో వైపు 37 ఏళ్ల వయస్సులో వెటరన్ ఆటగాడు దినేష్ కార్తీక్ దుమ్ము రేపుతున్నాడు. దీంతో ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు పంత్ స్థానంలో కార్తీక్‌ను ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో పంత్‌ను ఉద్దేశించి టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ కీలక వాఖ్యలు చేశాడు. రిషబ్ పంత్ తన ఫామ్‌ను తిరిగి పొందాలంటే అతడికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలని బంగర్ తెలిపాడు. ఇందుకు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా అభివర్ణించాడు "సచిన్ టెండూల్కర్ తన వన్డే కెరీర్లో తొలి సెంచరీ 75 ఇన్నింగ్స్‌లు తర్వాత సాధించాడు. మిడిలార్డర్లో ఎక్కువగా బ్యాటింగ్ చేసిన సచిన్ అంతగా రాణించలేకపోయాడు. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చిన సచిన్.. తన కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు లెఫ్ట్ రైట్ కాంబినేషన్‌పై కన్నేసింది. ఇషాన్ కిషన్ ప్రస్తుతం అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒక వేళ భారత్ ఎక్కువ కాలం పాటు ఇదే కాంబినేషన్ కొనసాగించాలంటే.. పంత్‌కు కూడా ఓపెనర్‌గా రాణించగల సత్తా ఉంది. ఆస్ట్రేలియాకు ఓపెనర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఏ విధంగా అయితే చెలరేగి ఆడేవాడో.. పంత్ కూడా అదే విధంగా ఆడగలడు" అని బంగర్ పేర్కొన్నాడు. చదవండి: Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
డుప్లెసిస్ సూపర్.. ఒకవేళ కోహ్లి కెప్టెన్‌గా ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు!
IPL 2022 RCB- Virender Sehwag Comments: ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జైత్రయాత్రలో హెడ్ కోచ్ సంజచ్ బంగర్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌దే కీలక పాత్ర అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. వారిద్దరి విధానాల వల్లే జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరుకోగలిగిందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. జట్టులో పెద్దగా మార్పులు చేయకుండా మంచి ఫలితాలు రాబట్టారని కొనియాడాడు. నిలకడైన ఆట తీరుతో ఆర్సీబీ ఈ ఏడాది ఆకట్టుకుందని పేర్కొన్నాడు. ఒకవేళ కోహ్లిలా సంజయ్, డుప్లెసిస్ ఆలోచించి ఉంటే ఇది సాధ్యం కాకపోయేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా గత ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ మెగా వేలం-2022లో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను కొనుగోలు చేసిన యాజమాన్యం అతడిని కెప్టెన్‌గా నియమించింది. వీరేంద్ర సెహ్వాగ్ ఈ క్రమంలో ఈ ఎడిషన్‌లో ఆడిన 14 మ్యాచ్‌లలో ఎనిమిది గెలిచి 16 పాయింట్లతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంది. అందని ద్రాక్షగా ఉన్న ఐపీఎల్ టైటిల్‌ను ఎలాగైనా గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2022లో ఆర్సీబీ ప్రదర్శన గురించి సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రెడిట్ మొత్తం హెడ్‌కోచ్ సంజయ్ బంగర్, కెప్టెన్ డుప్లెసిస్‌కే చెందుతుందన్నాడు. ‘‘సంజయ్ బంగర్ హెడ్‌కోచ్‌గా రావడం.. కొత్త కెప్టెన్ చేరిక ఆర్సీబీ వ్యూహాల్లో మార్పులు తీసుకువచ్చింది. గతంలో విరాట్ కోహ్లి కెప్టెన్‌గా ఉన్నపుడు.. ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌లలో సరిగా ఆడకపోతే తుదిజట్టు నుంచి తప్పించే వాడు. కానీ బంగర్, డుప్లెసిస్ టోర్నీ ఆసాంతం ఒకరిద్దరు మినహా అందరినీ కొనసాగించారు. అనూజ్ రావత్ మినహా చెత్త ప్రదర్శన కారణంగా వారు ఎవరినీ పక్కనపెట్టిన దాఖలాలు కనిపించలేదు. నిలకడగా ముందుకు సాగడం వారికి కలిసి వచ్చింది’’ అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో తన అభిప్రాయం పంచుకున్నాడు. ఇక గతంలో కోహ్లి, డివిల్లియర్స్ ఉంటే ప్రత్యర్థులు భయపడేవారని.. ఈసారి దినేశ్ కార్తిక్, గ్లెన్ మాక్స్వెల్ కూడా వారి పాలిట సింహస్వప్నంలా మారారని కితాబిచ్చాడు. చదవండి👉🏾IPL 2022: గొప్ప నాయకుడు.. కెప్టెన్‌గా అతడికి వందకు వంద మార్కులు వేస్తాను! చదవండి👉🏾IPL 2022: వర్షం పడితే కథేంటి.. ఫైనల్ చేరే దారులు ఎలా ఉన్నాయంటే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); The King has his 👀 focused on the prize. Less than 👆 day to go.#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB pic.twitter.com/w4jw67crSs — Royal Challengers Bangalore (@RCBTweets) May 24, 2022 -
IPL 2022: కోహ్లి గోల్డెన్ డక్.. కోచ్ అంటే ఇలా ఉండాలి! వైరల్
IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్-2022 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం(మే 8) జరిగిన మ్యాచ్‌లో కోహ్లి గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. రైజర్స్ బౌలర్ జగదీశ సుచిత్ వేసిన మొదటి బంతికే కోహ్లి పెవిలియన్ చేరాడు. దీంతో 0-1 స్కోరుతో ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆరంభమైంది. కాగా తాను అవుట్ కాగానే కోహ్లి తీవ్ర నిరాశలో మునిగిపోయాడు. విసుగు, కోపం కలగలిసిన చిరునవ్వుతో క్రీజును వీడాడు. కోహ్లి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ డ్రెస్సింగ్ రూమ్‌లో అతడిని ఓదార్చాడు. తల నిమురుతూ మరేం పర్లేదు అన్నట్లుగా ఊరట కలిగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘కోచ్ అంటే ఇలా ఉండాలి.. సంజయ్ సర్ మీరు కోహ్లి పట్ల వ్యవహరించిన తీరుకు హ్యాట్సాఫ్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో కెప్టెన్ డుప్లెసిస్ అజేయ అర్ధ శతకాని(73- నాటౌట్)కి తోడు రజత్ పాటిదార్(48), గ్లెన్ మాక్స్వెల్(33).. దినేశ్ కార్తిక్(8 బంతుల్లో 30) రాణించారు. దీంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఆర్సీబీ బౌలర్ వనిందు హసరంగ చుక్కలు చూపించాడు. ఏకంగా ఐదు వికెట్లు పడగొట్టి రైజర్స్ పతనాన్ని శాసించాడు దీంతో 67 పరుగుల తేడాతో విజయం ఆర్సీబీ సొంతమైంది. ఇదిలా ఉంటే.. కోహ్లి గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఈ సీజన్లో ఇది మూడోసారి. మొత్తంగా ఆరోసారి కావడం గమనార్హం. ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్కోర్లు ఆర్సీబీ-192/3 (20) ఎస్ఆర్హెచ్- (19.2) చదవండి👉🏾IPL 2022 - MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని What a gesture by Sanjay Bangar after Kohli's dismissal. #RCBvsSRH #ViratKohli pic.twitter.com/PHdGEbI0Pj — Avneet ⍟ (@Avneet_Shilpa) May 8, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Transition from bowler to batter 👌 Learnings from seniors ✅ Crucial victory 🔥@mdsirajofficial interviews @RCBTweets' rising star Rajat Patidar after the side’s comprehensive win at Wankhede.👍 👍 - By @28anand Full interview 📹 🔽 #TATAIPL | #SRHvRCBhttps://t.co/LT8cptY8m2 pic.twitter.com/ClnONRZPgF — IndianPremierLeague (@IPL) May 9, 2022 -
ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్ కాదు!
రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లి మరోసారి విఫలమైన సంగతి తెలిసిందే. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో రెండుసార్లు గోల్డెన్ డక్‌లు ఉండడం విశేషం. దీంతో కోహ్లి పని అయిపోయిందని.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్ ఇస్తే అన్ని సర్దుకుంటాయని మాజీ క్రికెటర్లు సహా ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి ఫామ్‌పై తమకు ఆందోళన లేదని.. ఇది మాకు అలవాటేనని ఆర్సీబీ హెడ్‌కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. ''కోహ్లి ఫామ్‌పై ఆందోళన వద్దు. నిజానికి అతను ఒక గొప్ప క్రికెటర్. ఇంతకముందు కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు చాలానే చూశాడు. నేను కోహ్లిని చాలా దగ్గర్నుంచి గమనించాను. కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినప్పటికి ఫుంజుకునే అవకాశం ఉంది. ఈ మాత్రానికే జట్టు నుంచి తొలగించమనడం కరెక్ట్ కాదు. ఏమో చెప్పలేం.. రానున్న మ్యాచ్‌ల్లో కోహ్లి రాణించి మ్యాచ్‌లు గెలపించవచ్చేమో. అతని బ్యాటింగ్‌పై మాకు అనుమానం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్ సమయంలో కోహ్లినే అందరికంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. అతని షాట్ల ఎంపికలో కూడా కచ్చితత్వం ఉంటుంది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. అంతకముందు ఓపెనింగ్ చేసిన అనూజ్ రావత్ ముంబై ఇండియన్స్‌పై 66 మినహా... మిగతా ఆరు మ్యాచ్‌లు కలిపి 63 పరుగులు సాధించాడు. కోహ్లికి ఓపెనింగ్ చేసిన అనుభవం ఉంది.. డుప్లెసిస్‌కు సరైన జోడి కోహ్లినే అని అభిప్రాయపడి ఓపెనింగ్ స్థానంలో పంపించాం. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక కోహ్లి మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్, కార్తిక్, షాబాజ్ అహ్మద్ అంతా ఫామ్‌లో ఉన్నారు. ఏదో ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తప్పుబట్టనవసరం లేదు. మా జట్టులో ఇప్పుడు ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేసే సమర్థులు ఉన్నారు. ఇది మాకు బలం అని చెప్పొచ్చు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్ 30న గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా! -
'కోహ్లి స్ధానంలో అతడే సరైనోడు'
India vs Sri Lanka 2022: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కేవలం 28 బంతుల్లోనే 57 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఇక శ్రీలంకతో సిరీస్‌కు కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో మూడో స్ధానంలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కోహ్లి స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లికి బ్యాకప్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోందని భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. కోహ్లి అందుబాటులో లేని పక్షంలో అయ్యర్ మూడో స్ధానంలో అద్భుతంగా రాణించగలడని అతడు తెలిపాడు. "టీమిండియా బెంచ్ బలంగా ఉంది. శ్రేయాస్‌ని బ్యాటింగ్‌కు పంపుతున్న స్థానం సరైనది. ఒక వేళ విరాట్ కోహ్లి ఏదైనా మ్యాచ్‌లో గాయపడితే.. అయ్యర్ ఆ స్ధానాన్ని భర్తీ చేయగలగడు. టీమ్ మేనేజ్మెంట్ కూడా విరాట్‌కి బ్యాకప్‌గా అయ్యర్‌పై దృష్టి సారించింది" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 662 పరుగులు సాధించాడు. చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్! -
'భయ్యా నేనంత సోమరిని కాదు.. కావాలంటే చెక్ చేసుకో'
ఆటలో కామెంటరీకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. టీవీల్లో మ్యాచ్ చూస్తున్న అభిమానులకు తమ పదునైన మాటలు.. క్రీడా విశ్లేషణలతో మరింత రసవత్తరంగా మార్చడం కామెంటేటర్ల పని. అయితే కొన్ని సందర్భాల్లో కామెంటేటర్లు కూడా తమకు తెలియకుండానే నోరు జారడం చూస్తుంటాం. తాజాగా టీమిండియా మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ బంగర్ అదే తప్పు చేశాడు. ఆట బ్రేక్ సమయంలో మైక్ ఆఫ్ చేయడం మరిచిపోయిన సంజయ్ మైక్ రికార్డర్లో అడ్డంగా దొరికిపోయాడు. టీమిండియా, సౌతాఫ్రికా మధ్య జరిగిన తొలి వన్డేలో ఇది చోటుచేసుకుంది. చదవండి: జింబాబ్వే బౌలర్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు టీమిండియా బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 39వ ఓవర్ పూర్తైన తర్వాత బ్రాడ్‌కాస్టర్ బ్రేక్ ఇవ్వాలి. కానీ స్కోర్ కార్డ్ చూపించడం.. అదే సమయంలో బ్రేక్ అని భావించిన బంగర్ మైక్ ఆఫ్ చేయకుండానే బ్యాక్ఎండ్ టీంతో పర్సనల్ విషయాలు మాట్లాడాడు. ''నేనంత సోమరిని కాదు భయ్యా.. కావాలంటే చెక్ చేసుకో'' అంటూ పేర్కొన్నాడు. అయితే బ్రేక్ తర్వాత అసలు విషయం తెలుసుకున్న బంగర్ తన పొరపాటును గుర్తించి నవ్వుకున్నాడు. ప్రస్తుతం సంజయ్ బంగర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్‌తో బుధవారం జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. వాన్ డర్ డసెన్ (96 బంతుల్లో 129 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ తెంబా బవుమా (143 బంతుల్లో 110; 8 ఫోర్లు) సెంచరీలతో కదం తొక్కారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 30.4 ఓవర్లలో 204 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు సాధించి ఓడిపోయింది. శిఖర్ ధావన్ (84 బంతుల్లో 79; 10 ఫోర్లు), విరాట్ కోహ్లి (63 బంతుల్లో 51; 3 ఫోర్లు), శార్దుల్ ఠాకూర్ (43 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: IND vs SA: ఎనిమిదేళ్ల తర్వాత బౌలింగ్‌లో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో అదుర్స్ #SAvsIND pic.twitter.com/HYgiAx7VkJ — Amanpreet Singh (@AmanPreet0207) January 20, 2022 -
ముత్తయ్య మురళీధరన్ రికార్డును బద్దలు కొట్టేది అతడే..
Ravi Ashwin to break Muttiah Muralitharan Test record: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై బారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శ్రీలంక గ్రేట్ ముత్తయ్య మురళీధరన్‌ను అధిగమించి టెస్ట్ క్రికెట్లో ఆల్ టైమ్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచే సత్తా అశ్విన్‌కు ఉందని అతడు తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్.. ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ల వికెట్లకు దగ్గరగా ఉన్నడాని బంగర్ చెప్పాడు. ఇప్పటికే అశ్విన్ టెస్ట్ క్రికెట్లో 427 వికెట్లు పడగొట్టాడని, మురళీధరన్‌ను అధిగమించే అన్ని అవకాశాలు అశ్విన్‌కు ఉన్నాయని బంగర్ అభిప్రాయపడ్డాడు. "అతను కొన్నాళ్లపాటు పాటు ఫిట్‌గా ఉంటే మురళీధరన్ రికార్డును అధిగమించగలడు. ఎందుకంటే అతని రికార్డును ఎవరైనా బ్రేక్ చేయగలిగితే అది రవిచంద్రన్ అశ్విన్ అని ముత్తయ్య మురళీధరన్ స్వయంగా చెప్పాడు" అని బంగర్ స్టార్ స్పోర్ట్స్‌లో పేర్కొన్నాడు. "అశ్విన్ టెస్ట్క్రికెట్లో లాంగ్ స్పెల్ బౌలింగ్ బౌలింగ్ చేస్తాడు. అతను టెస్ట్ క్రికెట్లో ఆడుతున్నప్పుడు తన ఆఫ్ స్పిన్‌పై ఎక్కువగా దృష్టి సారిస్తాడు. కాబట్టి మురళీధరన్ రికార్డు బ్రేక్ చేయగలడని నేను భావిస్తున్నాను" అని బంగర్ తెలిపాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. న్యూజిలాండ్‌తో జరగిన రెండో టెస్ట్‌లో టీమిండియా 372 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో అశ్విన్ మొత్తం 8 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND Vs NZ: ముంబై టెస్ట్‌లో రికార్డు సృష్టించిన భారత్.. 1-0 తేడాతో సిరీస్ కైవసం -
ఆర్సీబీ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
AB De Villiers Could Return To RCB Batting Coach: సౌతాఫ్రికా మాజీ క్రికెటర్, ఆర్సీబీ విద్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుని అభిమానులకు షాక్‌కు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్సీబీ.. ఫ్యాన్స్‌కు త్వరలో ఓ గుడ్ న్యూస్ చెప్పనుంది. వచ్చే సీజన్‌కు గాను ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా డివిలియర్స్‌ను నియమించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిస్టర్ 360తో ఆర్సీబీ సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ సంకేతాలను ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. న్యూజిలాండ్- భారత్ రెండో టెస్ట్‌లో కామెంటేటర్‌గా సంజయ్ బంగర్ వ్యవహరిస్తున్నాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు. ఏబీ డివిల్లియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్ పదవిని ఇస్తే మా జట్టు ఆటగాళ్లకి ఎంతో ఉపయోగకరమని అతడు తెలిపాడు. ‘ప్రధాన కోచ్‌గా నాకు ఎక్కువ సమయం ఉండదు. బ్యాటింగ్ కోచ్ ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆటగాళ్ల లోపాలపై దృష్టిసారిస్తాడు. అందువల్ల, ప్రతి జట్టుకు ప్రధాన కోచ్ కాకుండా బ్యాటింగ్ కోచ్ అవసరం. అందుకే ఏబీ డివిలియర్స్‌ను బ్యాటింగ్ కోచ్‌గా లేదా కన్సల్టెంట్ కోచ్‌గా నియమించడానికి ప్రయత్నిస్తున్నాం" అని బంగర్ తెలిపాడు. కాగా సంజయ్ బంగర్ ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌నుంచి హెడ్ కోచ్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: IND Vs NZ: అది నా డ్రీమ్ బాల్.. ఆసక్తికర వాఖ్యలు చేసిన మహ్మద్ సిరాజ్ -
ఆర్సీబీ హెడ్ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు..
RCB appoint Sanjay Bangar as head coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ ఎంపికయ్యాడు. తదుపరి రెండు ఐపీఎల్ సీజన్లకు ప్రధాన కోచ్‌గా అతడిని ఆర్సీబీ నియమించింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బంగర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్-2021 తొలి దశలో ఆర్సీబీకు ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్ ఫేజ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. అతడి స్ధానంలో మైక్ హెస్సన్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చదవండి: Virat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్ యూ భాయ్! -
క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ని ప్రారంభించిన వీరేంద్రుడు
న్యూఢిల్లీ: భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లెర్నింగ్ వెబ్సైట్ CRICURUని ప్రారంభించాడు. భారత మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌తో కలిసి అతను ఈ వెబ్‌సైట్‌ని బుధవారం లాంచ్ చేశాడు. క్రికెట్ కోచింగ్‌కు సంబంధించి భారత్‌లో ఇదే మొట్టమొదటి వెబ్సైట్ అని పేర్కొన్నాడు. ఈ వెబ్సైట్ ద్వారా దేశ వ్యాప్తంగా యువ క్రికెటర్లకు పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించాడు. CRICURU సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి కొత్త టెక్నాలజీతో పాటు భారత క్రికెటర్లకి శిక్షణ ఇచ్చే స్థాయిలో కోచింగ్ ఇవ్వనున్నట్లు తెలిపాడు. తనతో పాటు సంజయ్ బంగర్ కూడా యూజర్లకి పర్సనల్‌గా కోచింగ్ ఇవ్వనున్నట్లు వెల్లడించాడు. ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోచింగ్ ఎక్స్‌ఫర్ట్‌లతో తమ యూజర్లకు శిక్షణ ఇప్పిస్తామని, తామిచ్చే కోచింగ్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉంటుందని వివరించాడు. ఈ సందర్భంగా వెబ్సైట్ కో ఫౌండర్ సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రికెటర్లకి కోచింగ్ అందించడమే తమ లక్ష్యమని, ఇంట్లో కూర్చోనే సౌకర్యంగా కోచింగ్ తీసుకునే వెసలుబాటును తమ వెబ్సైట్ కల్పిస్తుందని, ఇందుకు కేవలం స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలని వివరించాడు. ఈ వెబ్సైట్లో కోచింగ్‌తో పాటు దిగ్గజ క్రికెటర్ల ఇంటర్వ్యూలు కూడా ఉండనున్నాయని, అలాగే కోచింగ్ క్లాస్‌లను రికార్డ్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నాడు. తమతో భాగస్వాములు కావాలనుకున్న ఔత్సాహికులు www.cricuru.comకి వెళ్లి సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమ వెబ్సైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ ఫీజు రూ.299 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. చదవండి: టీమిండియాలో అతని ఎంపికే ఓ వివాదం.. -
సంజయ్ బంగర్‌కు ఆర్సీబీ కీలక పదవి
బెంగళూరు: టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌కు ఆర్సీబీ కీలక పదవి ఇచ్చింది. ఐపీఎల్ 14వ సీజన్‌కు సంబంధించి ఆర్సీబీ బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా నియమించకుంది. ఈ సందర్భంగా ఆర్సీబీ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని పేర్కొంది. 'సంజయ్ బంగర్.. ఆర్సీబీ ఫ్యామిలీలోకి మీకు స్వాగతం. బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మా జట్టుకు సహాయపడతారని ఆశిస్తున్నాం.. 'అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా సంజయ్ బంగర్ గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుకు 2014 నుంచి 2017 వరకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. అంతేగాక 2017 నుంచి 2019 ప్రపంచకప్ వరకు కోహ్లి సారధ్యంలోని టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించాడు. కాగా సంజయ్ బంగర్ అనంతరం విక్రమ్ రాథోర్ టీమిండియా నూతన బ్యాటింగ్ కోచ్‌గా నియామకమయ్యాడు. కాగా బంగర్ టీమిండియా తరపున 12 టెస్టుల్లో 470 పరుగులు, 15 వన్డేల్లో 180 పరుగులు చేశాడు. చదవండి: ఆ బెయిల్ ఎలా కిందపడింది : ఇషాంత్ ఐసీసీపై విరాట్ కోహ్లి ఆగ్రహం We are delighted to welcome Sanjay Bangar to the RCB Family as a batting consultant for #IPL2021! 🤩 Welcome aboard, Coach! 🤜🏻🤛🏻#PlayBold #WeAreChallengers #NowARoyalChallenger pic.twitter.com/SWKLthSyXl — Royal Challengers Bangalore (@RCBTweets) February 10, 2021 -
మయాంక్, ధావన్‌ల జోడీ మేలు: బంగర్
న్యూఢిల్లీ : ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్‌కు మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీ బాగుంటుందని మాజీ ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి, మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీతో ముందుకెళితే బాగుంటుందని నా అభిప్రాయం. ధావన్ నిలకడగా ఆడతాడు. ఒక వేళ వారు కేల్ రాహుల్‌తో ముందుకెళ్లొచ్చు. అతడు నెంబర్ 5 ఆటగాడిగా భారత జట్టుకు ఎంతో సేవ చేశాడు. కానీ, మయాంక్, శిఖర్ ధావన్‌తో జోడీ అయితేనే బాగుంటుందని భావిస్తున్నా’’నన్నారు. -
ధోని కెప్టెన్సీ వదులుకుంటే.. అతడికే అవకాశం!
న్యూఢిల్లీ: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు పగ్గాలను సౌతాఫ్రికా క్రికెటర్ ఫాఫ్ డుప్లెసిస్ చేపట్టే అవకాశాలు ఉన్నాయని టీమిండియా బ్యాటింగ్ మాజీ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. ఆటగాడిగా కొనసాగేందుకే మొగ్గుచూపే క్రమంలో ధోని కెప్టెన్సీ విధుల తప్పుకొని, ఆ బాధ్యతలను డుప్లెసిస్‌కు అప్పగిస్తాడని భావిస్తున్నానన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో సీఎస్కే కొత్త కెప్టెన్ చూడబోతున్నామని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్- 2020 సీజన్లో ప్లే ఆఫ్స్ దశలోనే నిష్క్రమించిన తొలి జట్టుగా చెన్నై అపఖ్యాతి మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా, దాదాపు ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచిన సీఎస్కే లీగ్ దశలోనే ఇంటిబాట పట్టడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ సీజన్ ఆరంభానికి ముందే ఆటగాళ్లు కరోనా బారిన పడటం, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఆదిలోనే జట్టుకు దూరం కావడం వంటి అంశాలు జట్టు వైఫల్యాలపై ప్రభావం చూపాయి. వరుస ఓటములు వెంటాడటంతో ధోని సేన ప్లేఆఫ్స్‌కు కూడా చేరకుండా వెనుదిరిగింది. (చదవండి: వచ్చే ఏడాది కూడా ధోనీ సారథ్యంలోనే!) ఈ క్రమంలో కెప్టెన్ ధోనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొంటే మంచిదని, జట్టును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే సీఎస్కే జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ మాత్రం ఐపీఎల్ 2021 సీజన్లో కూడా ధోనియే, చెన్నై టీంకు సారథ్యం వహిస్తారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ధోని కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పనున్నాడనే ఊహాగానాలకు తెరపడలేదు. ఈ నేపథ్యంలో సంజయ్ బంగర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ నాకు తెలిసినంత వరకు 2011 తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్న సమయంలో కెప్టెన్ క్యాండిడేట్ సిద్ధంగా లేనందు వల్లే ధోని సారథ్య బాధ్యతలు మోయక తప్పలేదు. ఆ తర్వాత సరైన సమయం చూసి విరాట్ కోహ్లికి జట్టు పగ్గాలు అందించాడు. ఆ తర్వాత ధోని ఆటగాడిగా కొనసాగాడు. ఇప్పుడు కూడా ధోని అదే తరహాలో ఆలోచిస్తాడనుకుంటున్నా. వచ్చే ఏడాది తను సీఎస్కే కెప్టెన్‌గా ఉండకపోవచ్చు. డుప్లెసిస్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పి తను ఆటగాడిగా కొనసాగుతాడేమో. ఇప్పుడు వాళ్లకు డుప్లెసిస్ ఒక్కడే మెరుగైన ఆప్షన్. ఎందుకంటే అద్భుతంగా రాణించే ఆటగాడిని ఏ జట్టు వదులుకోదు. సీఎస్‌కు కెప్టెన్ అయ్యే స్థాయి ఉన్న వ్యక్తి అసలు వేలంలోకే రాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా దక్షిణాఫ్రికా సీనియర్ బ్యాట్స్‌మన్, కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఈ ఏడాది ఆరంభంలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. తమ జట్టుకు ఇప్పుడు కొత్త తరం నాయకత్వం అత్యవసరమని వ్యాఖ్యానిస్తూ టెస్టు, టి20 జట్ల సారథ్యానికి గుడ్‌బై చెప్పాడు. అలాంటి వ్యక్తి ఐపీఎల్-2021 సీజన్లో ధోని నిజంగానే కెప్టెన్సీ వదులుకుంటే, ఆ బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా అన్నది చర్చనీయాంశం. ఇక గతంలో ధోని దమ్మున్న నాయకుడంటూ డుప్లెసిస్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అతనో అసాధారణ, ప్రత్యేకమైన నాయకుడంటూ మహీ నాయకత్వ లక్షణాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని చదవడంలో ధోని దిట్ట. మైదానంలో ఉన్నపళంగా తీసుకునే సరైన నిర్ణయాలే ధోనిని ప్రత్యేకంగా నిలిపాయి’’ అంటూ కొనియాడాడు. -
రిషబ్ పంత్‌పై నెహ్రా ఆసక్తికర వ్యాఖ్యలు
ఢిల్లీ : ఐపీఎల్ 13వ సీజన్ సీరియస్‌గా సాగుతున్న వేళ టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా ఆసక్తికర ప్రతిపాదనతో ముందుకొచ్చాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు ఎంఎస్ ధోని గుడ్‌బై చెప్పి ఆరు సంవత్సరాలైపోయింది. ఈ ఆరు సంవత్సరాల్లో ధోని లాంటి ఆటగాడు మరొకరు రాకపోవడం.. ఒకవేళ వచ్చిన అడపా దడపా జట్టులోకి వచ్చిపోతుండడం చేస్తున్నారు. ఈ ఆరేళ్లలో టీమిండియా తన టెస్టు జట్టులో వృద్ధిమాన్ సాహా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లను ప్రయత్నించింది. వీరిలో ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు ఇన్నింగ్స్‌లతో మెరిసేవారే గాని నిలకడగా ఆడిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే ఇప్పటికీ టెస్టు జట్టులో వికెట్‌కీపర్ స్థానం సుస్థిరంగా లేదు. ఈ నేపథ్యంలో టెస్టుల్లో ధోని స్థానాన్ని భర్తీ చేసే సత్తా రిషబ్ పంత్‌కు ఉందంటూ.. అతని వారసుడు పంత్ మాత్రమేనని ఆశిష్ నెహ్రా అంటున్నాడు. ఇదే విషయమై టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నట్లు పేర్కొన్నాడు. (చదవండి : పేరు మాత్రమే పంత్.. కానీ పనులు మాత్రం) 'ఇప్పుడు మనం ఏ ఫార్మాట్ గురించి మాట్లాడుతున్నామనేది ముఖ్యం కాదు. బంగర్ చెప్పిన మాటలను నేను పూర్తిగా సమర్థిస్తాను. రిషబ్ పంత్‌ను టీమిండియాలో ఆడించాలని కోరుకుంటున్నా. ఈ ఐపీఎల్లో అతను మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐపీఎల్ ద్వారా పంత్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి ఆటగాడికి మద్దతు అనేది చాలా అవసరం 'అని తెలిపాడు. అంతకముందు స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో టీమిండియా సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది ఐపీఎల్లో పంత్ ప్రారంభించిన విధానం చాలా బాగుందన్నారు. లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్‌గా రాణిస్తున్న పంత్.. టీమిండియా మిడిల్ ఆర్డర్‌ను బ్యాలెన్సింగ్ చేయడానికి సరిగా సరిపోతాడని అన్నారు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా రైట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పారు. టీమిండియా మిడిల్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ ఉండటం చాలా అవసరమని అభిప్రాయపడ్డారు. (చదవండి : ఇలా అయితే కష్టం పృథ్వీషా!) ప్రస్తుతం రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ సీజన్లో మంచి ఆటతీరు కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లో 171 పరుగులు చేశాడు. కాగా, టీమిండియా తరఫున 13 టెస్ట్‌లు, 16 వన్డేలు, 28 టీ-20లు ఆడిన పంత్‌ను పలువురు ధోని వారసుడిగా అభివర్ణిస్తున్నారు. అయితే టీమిండియా తరఫున నిలకడగా రాణించడంలో పంత్ విఫలమవుతున్నాడు. -
మీ కోచింగ్ పదవి నాకొద్దు..
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు జట్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేయాలంటూ చేసిన ప్రతిపాదనను భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ తిరస్కరించాడు. ముందే కుదుర్చుకున్న ప్రొఫెషనల్ ఒప్పందాలతో పాటు వ్యక్తిగత అం శాలు కూడా ఇందుకు కారణమని అతను చెప్పాడు. 12 టెస్టులు, 15 వన్డేలు ఆడిన బంగర్ భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఐదేళ్ల పాటు అద్భుతమైన ఫలితాలు సాధించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ లోపాలను సరిదిద్ది వారిని అత్యుత్తమంగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడు. తమ టెస్టు జట్టును పటిష్టపర్చేందుకు బంగ్లాదేశ్ బంగర్ సేవలను కోరింది. అయితే ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న అతను తన వల్ల కాదని చెప్పాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. -
బంగ్లా బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా సంజయ్ బంగర్?
ఢాకా : అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) సంజయ్ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే యోచనలో ఉంది. ' మేము సంజయ్ బంగర్‌తో ఈ విషయమై చర్చించాము.. కానీ తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ బంగర్ రాలేని అవకాశం ఉంటే మిగతావాళ్లతో కూడా టచ్‌లో ఉంటాము' అని బీసీబీ ఎగ్జిక్యూటివ్ కోచ్ నిజాముద్దీన్ చౌదరీ పేర్కొన్నాడు. (టెస్టు చాంపియన్‌షిప్‌పై వకార్ యూనిస్ అసంతృప్తి) కాగా ఇప్పటికే బంగ్లాదేశ్ బ్యాటింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు నీల్ మెకెంజీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాను పరిమిత ఓవర్లు, టీ 20లకు మాత్రమే బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతానని కొద్దిరోజుల క్రితం బీసీబీకి తెలిపాడు. దీంతో టెస్టు ఫార్మాట్‌కు కొత్త బ్యాటింగ్ కోచ్‌కు అన్వేషణ మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే బీసీబీ సంజయ్ బంగర్‌ను కలిసినట్లు తెలిసింది. కాగా టెస్టులకు కొత్త బ్యాటింగ్ కోచ్ వచ్చేవరకు మెకేంజీనే మూడు ఫార్మాట్లలో బ్యాటింగ్ కోచ్‌గా కొనసాగుతాడని బీసీబీ స్పష్టం చేసింది. కాగా సంజయ్ బంగర్ 2014 నుంచి 2019 వరకు టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సంగతి తెలసిందే. ఒకవేళ బంగర్ బంగ్లా జట్టుకు టెస్టు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వస్తే మాత్రం జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 వరకు కొనసాగే అవకాశం ఉంది. ('ధోని ఇక జట్టులోకి రావడం కష్టమే') -
రోహిత్‌కు ఆ చాన్స్ మాత్రమే ఉంది: బంగర్
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న మూడు టెస్టుల సిరీస్ నుంచి టిమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను తప్పించడంతో ఇప్పుడు రోహిత్ శర్మ ఓపెనింగ్ రేసులోకి వచ్చాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న రోహిత్.. టెస్టుల్లో ఓపెనర్‌గా మాత్రం పెద్దగా రాణించలేదనే చెప్పాలి. ఇక మిడిల్ ఆర్డర్లో రోహిత్ పలు టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రోహిత్‌కు మిడిల్ ఆర్డర్లో చాన్సే లేదని అంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. కేవలం రోహిత్ ముందున్న ఒకే ఒక్క ఆప్షన్ ఓపెనర్‌గా రాణించడమేనని పేర్కొన్నాడు. ‘భారత క్రికెట్ జట్టులో రోహిత్ కీలక ఆటగాడు. సఫారీలతో టెస్టు సిరీస్ ద్వారా రోహిత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడనే ఆశిస్తున్నా. తన సహజ సిద్ధమైన ఆటతో రోహిత్ ఆడాలి. అతని సక్సెస్ సూత్రం అదే. దీన్ని టెస్టు ఫార్మాట్లో కూడా కొనసాగించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత టెస్టు జట్టులో మిడిల్ ఆర్డర్లో పోటీ ఉంది. దాంతో రోహిత్‌కు ఓపెనింగ్ చాలెంజ్ ఎదురుకానుంది. సుదీర్ఘ ఫార్మాట్లో రోహిత్ సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలో రోహిత్‌కు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఓపెనర్‌గా మాత్రమే చాన్స్ ఉందనేది నా అభిప్రాయం’ అని బంగర్ పేర్కొన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకూ 27 టెస్టు మ్యాచ్‌లు ఆడి 1585 పరుగులు చేశాడు. మూడు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు రోహిత్ సాధించగా, సగటు మాత్రం 39.62గా ఉంది. టెస్టుల్లో రోహిత్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 177. గత వెస్టిండీస్ పర్యటనకు రోహిత్‌ను ఎంపిక చేసినా టెస్టుల్లో ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్‌గా కేఎల్ రాహుల్-మయాంక్ అగర్వాల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభించగా, హనుమ విహారి ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి రాణించాడు. దాంతో రోహిత్ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పడు రాహుల్‌కు జట్టులో చోటు దక్కకపోవడంతో రోహిత్‌ను ఓపెనర్‌గా దింపే అవకాశాలే మెండుగా ఉన్నాయి. -
బంగర్... ఏమిటీ తీరు?
న్యూఢిల్లీ: టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన అనంతరం సంజయ్ బంగర్ ప్రవర్తించిన తీరు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మిగతా కోచింగ్ సిబ్బందికి పొడిగింపు ఇచ్చి తనను విస్మరించినందుకు రగిలిపోయిన బంగర్... ఇటీవలి వెస్టిండీస్ పర్యటనలో జట్టుతో పాటు ఉన్న జాతీయ సెలక్టర్ దేవాంగ్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించాడు. హోటల్లోని దేవాంగ్ గాంధీ గదికి వెళ్లి వాగ్వాదానికి దిగాడు. ఓ దశలో మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఈ విషయమంతా బోర్డు దృష్టికి వచ్చింది. దీంతో బంగర్‌ను ప్రశ్నించాలని నిర్ణయించింది. అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ సునీల్ సుబ్రమణియన్, చీఫ్ కోచ్ రవిశాస్త్రిలను ఘటనపై నివేదిక కోరింది. బంగర్ ఆవేదనలో అర్థం ఉన్నా సెలక్టర్లను ప్రశ్నించే హక్కు అతడికి లేదని స్పష్టంచేసింది. ‘రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ల పనితీరు బాగున్నందుకే కొనసాగింపు ఇచ్చాం. అదేమీ లేని బంగర్ మళ్లీ అవకాశం దక్కుతుందని ఎలా అనుకుంటాడు? ఎవరైనా సరే నిబంధనలు పాటించాల్సిందే. జట్టు మేనేజ్మెంట్ నివేదిక వచ్చాక దానిని క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) ముందుంచుతాం’ అని బోర్డు అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఇటీవలి ప్రక్రియలో హెడ్ కోచ్ నియామకాన్ని క్రికెట్ సలహా మండలి చూసుకోగా, సహాయ కోచ్‌లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. మరోవైపు జట్టులోకి తీసుకోకపోవడంపై ఆటగాళ్లు సోషల్ మీడియాలో సెలక్టర్లపై కామెంట్లు చేస్తుండటం పైనా చర్చ నడుస్తోంది. గత సీజన్లో 850 పైగా పరుగులు చేసినా దులీప్ ట్రోఫీకి పరిగణనలోకి తీసుకోని వైనాన్ని సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ షెల్డన్ జాక్సన్ ప్రశ్నించాడు. ఇలాంటివాటిపై చర్యలు తీసుకునేలా సీవోఏ ఓ విధానం రూపొందించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నారు. -
సెలక్టర్లకు సంజయ్ బంగర్ బెదిరింపు!
న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపికతో పాటు సహాయక సిబ్బంది ఎంపిక కూడా జరిగిన సంగతి తెలిసిందే. టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రిని నియమిస్తూ కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకోగా, సహాయక సిబ్బందిని చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. అయితే బ్యాటింగ్ కోచ్‌గా తనను తప్పించడంపై సంజయ్ బంగర్ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడానికి మొగ్గుచూపిన సమయంలో బంగర్ కాస్త అతి చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా ఇంటర్వ్యూలు జరుగుతున్న సమయంలో భారత క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీలో సభ్యుడైన దేవాంగ్ గాంధీ గదికి బంగర్ వెళ్లడమే కాకుండా తనను మళ్లీ బ్యాటింగ్ కోచ్ గా ఎంపిక చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడట. తన మద్దతు దారులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారంటూ బంగర్ దురుసుగా ప్రవర్తించాడని సమాచారం. సంజయ్ బంగర్‌కు మరోసారి అవకాశం ఇవ్వకపోవడానికి ఇదొక కారణంగా జాతీయ మీడియాలో వార్తలు వెలుగుచూశాయి. -
‘అందుకే రోడ్స్‌ను ఫైనల్ లిస్ట్‌లో చేర్చలేదు’
ముంబై: టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్ శ్రీధర్‌నే తిరిగి ఎంపిక చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికా మాజీ ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్.. టీమిండియా ఫీల్డింగ్ కోచ్ పదవికి పోటీ పడినప్పటికీ శ్రీధర్‌వైపు సెలక్షన్ కమిటీ మొగ్గుచూపింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి అండదండలతోనే శ్రీధర్‌ను మళ్లీ నియమించారనేది కాదనలేని వాస్తవం. అయితే రోడ్స్‌ను కనీసం ఫైనలిస్టులో చేర్చకపోవడమే చర్చనీయాంశంగా మారింది. దీనిపై చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ‘ఫీల్డింగ్ కోచ్ ఫైనలిస్టులో శ్రీధర్‌తో పాటు, అభయ్ శర్మ, టి దిలీప్‌లతోనే సరిపెట్టాం. వీరిద్దరికీ భారత్-ఏ జట్టుతో పని చేసిన అనుభవంతో పాటు ఎన్సీఏ(నేషనల్ క్రికెట్ అకాడమీ)లో కూడా సేవలందించారు. దాంతో రోడ్స్‌ను తుది జాబితాలో ఎంపిక చేయలేదు’ అని ఎంఎస్కే తెలిపాడు. అయితే శ్రీధర్‌నే తిరిగి నియమించడాన్ని ఎంఎస్కే సమర్ధించుకున్నాడు.‘ ఆర్ శ్రీధర్ ఒక అత్యుత్తమ ఫీల్డింగ్ కోచ్. అందులో సందేహం లేదు. టీమిండియా ఫీల్డింగ్ మెరుగు పడటంలో శ్రీధర్ పాత్ర చాలానే ఉంది. దాంతో మాకు వేరే ఆలోచన లేకుండా శ్రీధర్‌నే ఎంపిక చేశాం’ అని చెప్పుకొచ్చాడు. (ఇక్కడ చదవండి: సంజయ్ బంగర్‌పై వేటు) -
సంజయ్ బంగర్‌పై వేటు
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన సహాయక సిబ్బందిలో ఇద్దరు కొనసాగనుండగా... మరొకరిపై వేటు పడింది. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దడంలో కీలక పాత్ర పోషించాడని స్వయంగా విరాట్ కోహ్లి పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించినా సరే... బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు మాత్రం పొడిగింపు లభించలేదు. మెరుగైన రికార్డే ఉన్నా, వరల్డ్ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో పంపడానికి కారణమయ్యాడంటూ విమర్శలపాలు కావడమే బంగర్ తన పదవిని కోల్పోయేలా చేసినట్లు సమాచారం. బంగర్ స్థానంలో మరో మాజీ ఆటగాడు విక్రమ్ రాథోడ్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. రాథోడ్ భారత్ తరఫున 6 టెస్టులు, 7 వన్డేలు ఆడాడు. మూడేళ్ల క్రితం వరకు భారత సెలక్టర్‌గా కూడా పని చేసిన అతనికి పంజాబ్ రంజీ టీమ్, ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. బ్యాటింగ్ శిక్షణలో కొత్తదనం తీసుకురావడం కోసమే ఈ మార్పు చేసినట్లు సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. రోడ్స్‌కు దక్కని అవకాశం... : కోచ్ రవిశాస్త్రి అండదండలతో పాటు కొన్నేళ్లుగా భారత పేస్ బౌలింగ్ పదునెక్కడంలో ప్రధాన పాత్ర పోషించిన భరత్ అరుణ్‌నే బౌలింగ్ కోచ్‌గా కొనసాగించనున్నారు. మరో వైపు జాంటీ రోడ్స్ స్థాయి వ్యక్తి పోటీపడినా... హైదరాబాదీ ఆర్.శ్రీధర్‌నే ఫీల్డింగ్ కోచ్‌గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. టీమ్ అడ్మినిస్ట్రే్టటివ్ మేనేజర్‌గా కూడా హైదరాబాద్‌కే చెందిన గిరీశ్ డోంగ్రే ఎంపికయ్యారు. ఒక్కో పదవికి ప్రాధాన్యతా క్రమంలో మూడు పేర్లను కమిటీ ప్రతిపాదించింది. దీనిపై బీసీసీఐ అధికారిక ముద్ర వేస్తుంది. -
ఆ నిర్ణయం నా ఒక్కడిదే అంటే ఎలా?: బంగర్
ఫ్లోరిడా: ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌పై వేటు ఖాయంగా కనబడుతోంది. గత ఐదేళ్లలో రవిశాస్త్రి, అనిల్ కుంబ్లేలతో కలిసి బంగర్ పని చేసినప్పటికీ భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచలేకపోయాడనే అపవాదు బంగర్‌పై ఉంది. ముఖ్యంగా నాల్గో స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉండటంతో బంగర్‌పై బీసీసీఐ ఆసక్తిగా లేదు. అదే సమయంలో వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై ప్రధానంగా బంగర్‌నే టార్గెట్ చేశారు. ఇదే బంగర్ నిర్ణయమేనంటూ వార్తలు వ్యాపించాయి. ఈ తరుణంలో బంగర్ స్పందించాడు. వరల్డ్‌కప్‌లో కివీస్‌తో జరిగిన నాకౌట్ పోరులో ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిన నిర్ణయం తన ఒక్కడిదే కాదంటూ పేర్కొన్నాడు. అది సమిష్టిగా అక్కడ ఉన్న వారితో చర్చించిన తర్వాతే ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపామని పేర్కొన్నాడు. ‘ ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడంపై అంతా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇది నేను ఒక్కడినే తీసుకున్న నిర్ణయం కాదు. ఆ సమయంలో అది సమంజసం అనిపించింది కాబట్టి అక్కడ ఉన్న మేమంతా కలిసి చర్చించిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకున్నాం. మిడిల్ ఆర్డర్లో ఐదు, ఆరు, ఏడు స్థానాలపై చర్చించిన తర్వాత దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యాల తర్వాత ధోనిని బ్యాటింగ్‌కు పంపాం. 30-40 ఓవర్ల స్లాబ్ ఆధారంగా అప్పడు ఉన్న పరిస్థితుల్ని బట్టే టీమిండియా కోచింగ్ విభాగం అంతా కలిసే ధోనిని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కి పంపాల్సి వచ్చింది. ఈ విషయంపై ఇప్పటికే రవిశాస్త్రి వివరణ ఇచ్చాడు. అయినా నేను ఒక్కడినే జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై నిర్ణయం తీసుకున్నాననంటూ నిందలు వేస్తారెందుకు’ అని బంగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. -
బ్యాటింగ్ కోచ్ రేసులో ఆమ్రే..
న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే టీమిండియా బ్యాటింగ్ కోచ్ పదవి చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్ పదవికి దరఖాస్తు చేశాడు. టీమిండియా కోచింగ్ స్టాఫ్ ప్రక్షాళన షురూ అయిన నేపథ్యంలో ఇందుకు పలువురు మాజీ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే తిరిగి కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నా, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌పై వేటు ఖాయంగా కనబడుతోంది. గత ఐదేళ్లలో రవిశాస్త్రి, అనిల్ కుంబ్లేలతో కలిసి బంగర్ పని చేసినప్పటికీ భారత క్రికెట్ జట్టు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్ట పరచలేకపోయాడనే అపవాదు ఉంది. ముఖ్యంగా నాల్గో స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉండటంతో బంగర్‌పై బీసీసీఐ ఆసక్తిగా లేదు. ఈ నేపథ్యంలో ఆమ్రే దరఖాస్తు చేసుకోవడంతో అతను ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. అనేక మంది భారత క్రికెటర్లకు గురువుగా వ్యవహరించడం ఆమ్రేకు కలిసొచ్చే అంశం. ప్రధానంగా అజింక్యా రహానే, సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రాబిన్ ఊతప్పులు ఆమ్రే శిక్షణలు రాటుదేలిన వారే. రహానే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగు పరుచుకునేందుకు ఆమ్రేనే సంప్రదిస్తూ ఉంటాడు.రమాకాంత్ ఆచ్రేకర్ స్కూల్ నుంచి వచ్చి ఆమ్రే.. కొంతకాలంగా యూఎస్ఏ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. మరొకవైపు ఐపీఎల్లో రెగ్యులర్‌గా కోచింగ్ సర్క్యూట్లో ఉంటూ తన బ్యాటింగ్ పాఠాలు చెబుతూనే ఉన్నాడు. గత ఐపీఎల్ సీజన్లో రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీలతో కలిసి ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు. టీమిండియా కోచింగ్ విభాగంలో మార్పులు అవసరమని భావించిన బీసీసీఐ.. అందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జూలై 30వ తేదీ సాయంత్ర ఐదు గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆపై కపిల్‌దేవ్ నేతృత్వంలోన క్రికెట్ సలహా కమిటీ టీమిండియా కోచింగ్ బృందాన్ని ఎంపిక చేస్తుంది. -
బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా!
న్యూఢిల్లీ: ముందుగా ఊహించిన మేరకు భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక బాధ్యతను దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)నే చేపట్టనుంది. ఈ మేరకు క్రికెట్ పాలకుల కమిటీ (సీవోఏ) చీఫ్ వినోద్ రాయ్ శుక్రవారం ప్రకటించారు. ‘కోచ్ ఎంపికకు కపిల్ బృందం ఆగస్టు రెండో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇది తాత్కాలిక కమిటీ కాదు. కపిల్, శాంత రంగస్వామిలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం వర్తిస్తుందా? లేదా? అనేది మేం చూసుకుంటాం. ఇది పూర్తిగా న్యాయబద్ధమైనదే’ అని ఆయన పేర్కొన్నారు. కోచ్ ఎంపిక ప్రక్రియపై కెప్టెన్ కోహ్లి ఏమీ చెప్పలేదని రాయ్ వివరించారు. బంగర్‌కు ఉద్వాసన..భరత్‌కు భరోసా! కొత్త సహాయ బృందం ఎంపిక సందర్భంగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. నాలుగేళ్ల పదవీ కాలంలో బలమైన మిడిలార్డర్‌ను తయారు చేయలేకపోవడం బంగర్ ప్రధాన వైఫల్యంగా చెబుతున్నారు. ప్రపంచ కప్ సెమీస్‌లో ధోనిని ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలన్న నిర్ణయమూ అతడిదేనని సమాచారం. బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ స్థానానికి భరోసా దక్కుతోంది. ఏడాదిన్నరగా పేస్ విభాగాన్ని అతడు తీర్చిదిద్దిన తీరే ఇందుకు కారణం. ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్.శ్రీధర్ పై మంచి అభిప్రాయమే ఉన్నా... జాంటీ రోడ్స్ (దక్షిణాఫ్రికా) వంటి మేటి ఫీల్డర్ పోటీ పడుతుండటం ప్రతికూలంగా మారింది. సహాయ కోచ్ పదవులకు సెలక్టర్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. -
‘హిట్‌మ్యాన్’తో కెప్టెన్ ఇంటర్వ్యూ..
లీడ్స్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఐదో సెంచరీతో భారత్ ఏడో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి... తన వైస్‌కెప్టెన్ రో‘హిట్‌మ్యాన్’ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు. ఐదు శతకాల ఆటతీరుపై స్పందన ఏంటని కోహ్లి అడిగితే ‘క్రికెటర్‌గా మేం గతాన్ని పట్టించుకోం. ప్రస్తుతం జరిగేదే మాకవసరం. ఇప్పుడు నేనూ అదే చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితి, ఫామ్ కొనసాగడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టాను. బ్యాటింగ్‌లో జట్టును ఇలా ముందుండి నడిపించాలని ఆశిస్తున్నా. ఈ ప్రపంచకప్ ముఖ్యమైన టోర్నమెంట్. ఇందులో జట్టు రాణించడం బాగుంది. ఓ టాపార్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఓపెనర్‌గా నా బాధ్యతేంటో నాకు తెలుసు. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టాక... ఇకపై కూడా ఇలాంటి ప్రదర్శనే కనబరచాలని భావించాను’ అని అన్నాడు. ఈ సీజన్ ఐపీఎల్ సందర్భంగా ముంబై సహచరుడు, సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనతో పంచుకున్న అనుభవాలు, ఇచ్చిన సూచనలే తన రాణింపునకు దోహదం చేశాయని మరోవైపు రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ‘యువీ నాకు పెద్దన్నలాంటివాడు. మేం ఎప్పుడు మాట్లాడుకున్నా క్రికెట్ గురించే! 2011 ప్రపంచకప్‌లో తను ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో నాకు వివరించాడు. ఓపిగ్గా ఆడటంపై దృష్టిపెట్టాలని సూచించాడు. ఇవన్నీ నాకిపుడు బాగా ఉపయోగపడ్డాయి’ అని రోహిత్ అన్నాడు. రోహిత్ ఉరకలెత్తిస్తాడు : బ్యాటింగ్ కోచ్ ఈ ప్రపంచకప్‌లో అదేపనిగా శతక్కొట్టే ప్రదర్శనతో దూసుకెళ్తున్న ఓపెనర్ రోహిత్ శర్మను భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ‘రోహిత్ ఆటతీరు, నిలకడైన ప్రదర్శన అద్భుతం. బరిలోకి దిగిన ప్రతీసారి అదే పట్టుదలతో ఆడుతున్నాడు. ఈ క్రమంలో తన పరుగులకే పరిమితం కాకుండా జోడీ కట్టిన రెండో ఓపెనర్‌నూ ఉరకలెత్తిస్తున్నాడు. ఆసీస్‌తో జరిగిన పోరులో శిఖర్ ధావన్‌ను అలాగే ఉత్సాహపరిచాడు. ఇప్పుడు శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ను పరుగుపెట్టించాడు. దీంతో తదుపరి బ్యాట్స్‌మెన్‌కు బ్యాటింగ్ తేలికవుతోంది. ఇలా జట్టు మొత్తానికి ఉపయోగపడేలా రోహిత్ ఇన్నింగ్స్‌లు సాగుతున్నాయి. అతని ఆటతీరుతో జట్టు కూడా నిలకడైన విజయాలతో దూసుకెళ్తోంది’ అని అన్నాడు. భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ కాగా దీనిపై స్పందించిన బంగర్... టీమిండియా తమ ఆటతీరుపైనే దృష్టి పెట్టింది కానీ ప్రత్యర్థి ఎవరనే దానిపై కాదని అన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా కనబరిచిన ప్రదర్శనను సెమీఫైనల్లోనూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ప్రత్యర్థి జట్టు బలహీనతలపై దృష్టిపెట్టకుండా తమ జట్టు బలాన్నే నమ్ముకున్నామని బంగర్ అన్నాడు -
న్యూజిలాండ్ బెంగ లేదు..!
మాంచెస్టర్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్ నాకౌట్ సమరంలో భాగంగా న్యూజిలాండ్‌తో భారత జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం మాంచెస్టర్ వేదికగా ఇరు జట్ల మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. అయితే న్యూజిలాండ్ బెంగ లేదని అంటున్నాడు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. ‘ మాకు న్యూజిలాండ్ సామర్థ్యం ఏమిటో తెలుసు. వారి బలాలు, బలహీనతలు భారత్‌కు బాగా తెలుసు. కివీస్‌తో సిరీస్ ఆడి ఎంతో కాలం కాకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లపై మాకు ఒక అంచనా ఉంది. కివీస్‌పై మ్యాచ్‌లో గెలుపు కోసం కసరత్తు చేస్తున్నాం’ అని బంగర్ తెలిపాడు. ఇక టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఎక్కువగా ఆలోచించడం లేదన్నాడు. ఏ స్థానంలో ఎవరు అనే దాని కోసం చర్చ అనవసరమన్నాడు. ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్న కారణంగా బ్యాటింగ్ ఆర్డర్ గురించి చింతించాల్సిన పని లేదన్నాడు. మరొకవైపు శ్రీలంకతో మ్యాచ్‌లో సెంచరీ చేసి ఒకే వరల్డ్‌కప్‌లో ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా నిలిచిన రోహిత్ శర్మపై బంగర్ ప్రశంసలు కురిపించాడు. వన్డే ఫార్మాట్లో రోహిత్ శర్మ విశేషంగా రాణించడానికి అతను గేమ్‌ను పూర్తిగా అర్థం చేసుకోవడమే కారణమన్నాడు. బేసిక్స్‌ను ఫాలో కావడమే రోహిత్ శర్మ సెంచరీలు కారణమని బంగర్ తెలిపాడు. ఒక మెగా టోర్నీలో నిలకడగా రాణించడం వెనుక క్రెడిట్ అంతా అతనిదే అని పేర్కొన్నాడు. -
మళ్లీ రిటైరవుతున్నా అంటారేమో: ధోని
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో మూడో వన్డే ముగిశాక పెవిలియన్‌కు వస్తూ ఎంఎస్ ధోని ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తన చేతిలో ఉన్న బంతిని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌కు ఇస్తూ...‘నా దగ్గరి నుంచి బంతి తీసేసుకో. లేదంటే నేను రిటైరవుతున్నానని మళ్లీ అంటారేమో’ అని నవ్వుతూ చెప్పడం టీవీలో రికార్డయింది. ఇంగ్లండ్‌లో వన్డే తర్వాత ధోని అప్పట్లో బంతి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అప్పట్లో అలా చేయడం క్రికెట్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడనే వార్తలు హల్‌చేశాయి. ఇక తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి ధోని మాట్లాడుతూ.. ‘నేను నాలుగో స్థానంలో ఆడినా ఆరో స్థానంలో ఆడినా జట్టు సమతూకం గురించి ఆలోచించాలి. ఆరో స్థానంలో ఆడేందుకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ జట్టు కోసం ఎక్కడైనా ఆడేందుకు సిద్ధమే. పిచ్ నెమ్మదిగా ఉండటం వల్ల షాట్లు ఆడటం కష్టంగా మారింది. అందుకే మ్యాచ్ చివరి వరకు వెళ్లింది’ అని ధోని అన్నాడు. -
టీమిండియా అసంతృప్తి.. వెంటనే ఫిర్యాదు!
జొహన్నెస్‌బర్గ్ : అసలే దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో భారత్ తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలైంది. మరో టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్ కోల్పోయి తీవ్ర విమర్శలపాలైన విరాట్ కోహ్లీ సేన జొహన్నెస్ బర్గ్‌లో జరగనున్న మూడో టెస్టులో విజయం సాధించాలని భావిస్తోంది. 24న వాండరర్స్ మైదానంలో ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తోంది. బౌలర్లు భువనేశ్వర్, షమీ, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ కొంతసేపు బౌలింగ్ సాధన చేశారు. అయితే అక్కడే ఉన్న బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రాక్టీస్ పిచ్‌లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసేందుకు పిచ్ అనుకూలంగా లేదని క్యూరేటర్లకు ఫిర్యాదు చేశారు. ఆదివారం నుంచి టీమిండియా కసరత్తులు మొదలుపెట్టగా.. ప్రాక్టీస్ కోసం ఏర్పాటు చేసిన మూడు పిచ్‌లను పరిశీలించిన బంగర్ భారత జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. చీఫ్ క్యూరేటర్ బూటియల్ బూటెలెజితో సమస్యను చర్చించిన రవిశాస్త్రి ప్రాక్టీస్ వికెట్లను మళ్లీ రోలింగ్ చేసి సిద్ధం చేయాలని సూచించారు. రీ రోలింగ్ చేసి ప్రాక్టీస్ పిచ్ మళ్లీ తయారు చేయగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలుపెట్టినట్లు సమాచారం. బంతి బౌన్స్ అవ్వడం లేదని, బ్యాట్‌పైకి కూడా రాకపోవడంతో బ్యాట్స్‌మెన్ ఇబ్బందులు పడతారని గమనించి రీ రోలింగ్ చేయమని సూచించినట్లు కోచ్ బృందం వెల్లడించింది. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం ఫాస్ట్, బౌన్సీ పిచ్ భారత ఆటగాళ్ల కోసం ఎదురుచూస్తోందని సిద్ధంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశాడు. చీఫ్ క్యూరేటర్ సైతం డుస్లెసిస్ నిర్ణయానికి కట్టుబడి పిచ్ సిద్ధం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరి టెస్టుల్లో నెగ్గి సిరీస్ దక్షిణాఫ్రికా ఆధిక్యాన్ని 2-1కు తగ్గించాలని కోహ్లీ సేన భావిస్తోంది. -
మీడియా సమావేశానికి కోహ్లి గైర్హాజరు
కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో కాన్పిడెంట్‌గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా.. ‘కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. అంతేకాదు సౌతాఫ్రికా కెప్టెన్ హాజరవుతున్నాడన్న సమాచారం లేదని తెలిపాడు. ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం గురువారం ప్రాక్టీస్ సెషన్‌నూ ఎగ్గొట్టారు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్మెంట్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉండే. కానీ, ఎవరూ రాలేదు. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. గతంలో ఇలా భారత కెప్టెన్ మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం ఎప్పుడు జరగలేదు. మాజీ కెప్టెన్ ధోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ సారి ఇషాంత్‌ను పంపించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది. -
'అందుకు రవిశాస్త్రినే కారణం'
కేప్‌టౌన్: ఇటీవల కాలంలో భారత క్రికెట్ జట్టు దూకుడైన ప్రదర్శనతో వరుస విజయాల్ని సాధిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా 2017లో టీమిండియా అన్ని ఫార్మాట్లలో కలిపి 53 మ్యాచ్‌లు ఆడితే 37 విజయాల్ని సొంతం చేసుకుంది. ఇది 2016 విజయాల శాతం కంటే దాదాపు రెండు శాతం అధికం. 2016లో 67.4 శాతం విజయాల్ని టీమిండియా నమోదు చేస్తే.. గడిచిన ఏడాది 69.8 శాతంతో విజయాల్ని సొంతం చేసుకుంది. ఈ తరహాలో టీమిండియా విజయాలు సాధించడానికి ప్రధాన కోచ్ రవిశాస్త్రినే కారణమంటున్నాడు బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. రవిశాస్త్రి పర్యవేక్షణ బాధ్యత చేపట్టిన తరువాత భారత క్రికెట్ జట్టులో మార్పు స్పష్టంగా కనబడుతోంది. బ్యాట్స్‌మన్ మైండ్‌సెట్‌ను రవిశాస్త్రి క్రమంగా మారుస్తున్నాడు. దూకుడైన ఆటను అలవాటు చేస్తూ వారిలో ఉన్న భయాన్ని, ఆందోళనను పోగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ జట్టును ముందుకు తీసుకెళుతున్నాడు. భారత జట్టు తెగింపుతో క్రికెట్ ఆడుతూ విజయాలు సాధిస్తుందంటే అందుకు కారణం రవిశాస్త్రినే. రిస్క్ చేయడానికి ఆటగాళ్లకు రవిశాస్త్రి స్వేచ్ఛనిస్తున్నాడు. దాంతో క్రికెటర్లు ఆత్మరక్షణ ధోరణిని వీడి.. జట్టులో ఎలాంటి బాధ్యతలనైనా స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవేళ తాము విఫలమైనా.. తమకి అండగా ఒకరున్నారనే భావనతో ఆటగాళ్లు ఎటువంటి ఒడిదుడుకు లేకుండా ఆడుతున్నారు' అని సంజయ్ బంగర్ విశ్లేషించాడు.గతేడాది మధ్యలో టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు స్వీకరించాడు. అనిల్ కుంబ్లే స్థానంలో రవిశాస్త్రిని కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. -
పంతం నెగ్గింది!
♦ రవిశాస్త్రి కోరుకున్నవారే సహాయక బృందంలోకి ♦ భారత బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ♦ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా ♦ ఫీల్డింగ్ కోచ్‌గా ఆర్. శ్రీధర్ ఏడాది క్రితం ఇంటర్వ్యూలో కోచ్ పదవిని దక్కించుకోలేకపోయిన రవిశాస్త్రి సంవత్సరం తిరిగే లోపే భారత క్రికెట్‌కు సంబంధించి మరోసారి ప్రధాన కేంద్రంగా ఎదిగారు. నాటి సలహాదారుల కమిటీ ద్వారానే మళ్లీ కోచ్‌గా ఎంపికవడమే కాకుండా... తనతో కలిసి పని చేసే సహాయక సిబ్బంది ఎంపికలో కూడా తన ముద్ర చూపించారు. కమిటీ ఎంచుకున్న బౌలింగ్, బ్యాటింగ్ సలహాదారులు జహీర్ ఖాన్, రాహుల్ ద్రవిడ్‌లను కాదంటూ తనకు నచ్చినవారినే బృందంలోకి తీసుకురాగలిగారు. కోహ్లి అండతో హెడ్ కోచ్‌గా మారి, ఇప్పుడు తన పంతం కూడా నెగ్గించుకోగలిగిన రవిశాస్త్రి రాబోయే రెండేళ్లు ఎలా పని చేస్తారన్నది ఆసక్తికరం. ముంబై: భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కగా... ఆర్. శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. మంగళవారం బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. బౌలింగ్ కోచ్‌గా అరుణ్ కావాలంటూ కొద్ది రోజులుగా పట్టుబట్టిన హెడ్ కోచ్ రవిశాస్త్రి... సోమవారమే దీనిపై బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరి, సీఈఓ రాహుల్ జోహ్రి, సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీలతో చర్చించారు. ఆయన సూచనల మేరకు వీరి నియామకాలకు బోర్డు అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డైరెక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు. అనేక మలుపుల తర్వాత... గత మంగళవారం రవిశాస్త్రిని కోచ్‌గా ఎంపిక చేసిన సమయంలో బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్, బ్యాటింగ్ సలహాదారుడిగా రాహుల్ ద్రవిడ్ పేర్లను కూడా సీఏసీ ప్రకటించింది. అయితే వారు తమ పరిధి దాటారంటూ సీఓఏ నుంచి విమర్శలు రావడం... శాస్త్రితో సంప్రదించిన తర్వాతే పేర్లు ప్రకటించామంటూ సీఏసీ లేఖ రాయడం... అసలు వారిద్దరి ఎంపికను ఖరారు చేయలేదని, కేవలం ప్రతిపాదనలు మాత్రమేనని మళ్లీ బోర్డు నుంచి వివరణ రావడం వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది. చివరకు శాస్త్రి చెప్పిన వారికే బోర్డు ఓటు వేసింది. అయితే బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి మాత్రం ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఈ విషయంలో సమస్య ఎప్పుడూ లేదని ఆయన వివరణ ఇచ్చారు. ‘నాకు తెలిసి ఇందులో ఎలాంటి గందరగోళం చోటు చేసుకోలేదు. ఒకసారి శాస్త్రి హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాక తనతో కలిసి పని చేసే వ్యక్తులను ఎంచుకునే హక్కు ఆయనకు ఉంది’ అని చౌదరి అన్నారు. నేను మాత్రం వెళ్లను... భారత క్రికెట్ జట్టుకు సంబంధించి ద్రవిడ్, జహీర్ పాత్ర ఏమిటో, వారి బాధ్యతలు ఎలాంటివో స్పష్టత లేదు. వీరిద్దరు సలహాదారులుగా ఉంటారని మాత్రం చౌదరి అన్నారు. అయితే తాను విదేశీ పర్యటనలకు వెళ్లనని ద్రవిడ్ ఇప్పటికే బీసీసీఐకి చెప్పినట్లు సమాచారం. భారత్‌లో జరిగే ఏదైనా శిక్షణా శిబిరానికి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు, తన అనుభవాన్ని పంచుకునేందుకు మాత్రం సిద్ధమని చెప్పినట్లు తెలిసింది. వారిద్దరి సలహాలు తీసుకుంటా! తాను అనుకున్న రీతిలోనే సహాయక సిబ్బందిని ఎంపిక చేయడం పట్ల రవిశాస్త్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘నేను ఇంగ్లండ్‌లో వింబుల్డన్ చూస్తున్నా, నా మనసులో ఇతర కోచింగ్ సిబ్బంది గురించి స్పష్టమైన ఆలోచనలు ఉన్నాయి. నేను కోరుకున్న వ్యక్తులనే ఇప్పుడు మీరు చూస్తున్నారు’ అని ఆయన మీడియాతో చెప్పారు. జహీర్, ద్రవిడ్‌ల సూచనలు తీసుకునేందుకు కూడా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ‘నేను వారిద్దరితో విడివిడిగా మాట్లాడాను. వారు అద్భుతమైన క్రికెటర్లు. వారిచ్చే సూచనలు వెల కట్టలేనివి. సంబంధిత అధికారులతో చర్చించిన తర్వాత వారు కూడా మా బృందంలో భాగమవుతారు’ అని శాస్త్రి అన్నారు. భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా పని చేయడం గొప్ప గౌరవమని, తనకు ఆ అర్హత ఉందని భావించి తనను ఎంపిక చేసిన సలహాదారుల కమిటీకి శాస్త్రి కృతజ్ఞతలు తెలిపారు. రూ. 8 కోట్ల వేతనం! భారత జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఏడాదికి రూ. 8 కోట్ల వరకు వేతనంగా చెల్లించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. గత కోచ్ కుంబ్లేకు (రూ. 6.5 కోట్లు) ఇచ్చిన దానికంటే ఇది మరింత ఎక్కువ కావడం విశేషం. దీనిపై బోర్డులోని ప్రముఖుడు ఒకరు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నట్లు తెలిసింది. భరత్ అరుణ్, సంజయ్ బంగర్, శ్రీధర్‌లకు రూ. 2–3 కోట్ల మధ్య దక్కే అవకాశం ఉంది. భరత్ అరుణ్ ప్రొఫైల్ విజయవాడలో పుట్టిన ఈ మాజీ పేస్ బౌలర్ తమిళనాడు తరఫున ఆడారు. భారత్‌కు కేవలం 2 టెస్టులు (4 వికెట్లు), 4 వన్డేల్లో (1వికెట్) మాత్రమే ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌కు దేశవాళీ క్రికెట్లో మాత్రం మెరుగైన రికార్డు ఉంది. భారత బౌలింగ్ కోచ్‌గా మంచి ఫలితాలు సాధించిన ఆయన, గత ఏడాది హైదరాబాద్ రంజీ టీమ్ కోచ్‌గా కూడా పని చేసి జట్టును నాకౌట్ దశకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అండర్–19 స్థాయి నుంచి రవిశాస్త్రితో ఉన్న సాన్నిహిత్యం ఇప్పుడు ఆయనకు మరోసారి కీలక అవకాశం కల్పించింది. -
'మహిళా క్రికెట్ నుంచి నేర్చుకోండి'
ఆంటిగ్వా:ఇటీవల పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుపై విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుపై సంజయ్ బంగర్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం భారత పురుషుల క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కోచ్ గా ఉన్న బంగర్.. వరుసగా మూడు విజయాలు సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు అభినందనలు తెలియజేశాడు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ తో నాల్గో వన్డేలో ఓటమి పాలైన పురుషుల క్రికెట్ జట్టుకు బంగర్ చురకలంటించాడు. భారత మహిళా క్రికెట్ జట్టు నుంచి స్ఫూర్తి పొందాలంటూ విరాట్ సేనకు సూచించాడు. 'ఇక్కడ మన భారత మహిళా క్రికెట్ జట్టును తప్పక అభినందించాలి. వన్డే వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ విజయాలతో భారత మహిళలు దూసుకుపోతున్నారు. ఈ మేరకు పాకిస్తాన్ పై సాధించిన విజయం నిజంగా అద్భుతం. భారత మహిళలు తొలుత స్వల్ప స్కోరుకే పరిమితమైనా దాన్ని కాపాడుకుని విజయం సాధించారు. భారత మహిళలు 169 పరుగులు చేసినా బౌలింగ్ లో చెలరేగిపోయి పాకిస్తాన్ ను కట్టడి చేశారు. ఇక్కడ మన మహిళా క్రికెటర్లే పురుష క్రికెటర్లకు ఆదర్శం. వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. భారత పురుషుల జట్టు చాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో విఫలమైన లోటును మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ గెలిచి భర్తీ చేస్తుందని ఆశిస్తున్నా'అని బంగర్ పేర్కొన్నాడు. -
చెత్త బ్యాటింగే కొంపముంచింది!
ఆంటిగ్వా:ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్ తో జరిగిన నాల్గో వన్డేలో భారత్ జట్టు ఓటమి చెందడం పట్ల బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాధారణ స్కోరును ఛేదించడంలో విఫలం కావడానికి బ్యాట్స్మెన్ల వైఫల్యమే ప్రధాన కారణమన్నారు. తమ కుర్రాళ్ల చెత్త బ్యాటింగ్ వల్ల గెలిచే మ్యాచ్ ను చేజార్చుకున్నామని బంగర్ అసహనం వ్యక్తం చేశాడు. 'విండీస్ విసిరిన లక్ష్యం కష్టమైనది ఎంతమాత్రం కాదు. మా బ్యాట్స్‌మెన్ స్ట్రైక్ రొటేట్ చేయడంలో విఫలయ్యారు. ప్రధానంగా తొలి పది ఓవర్లలో కీలక వికెట్లు కోల్పోవడం కూడా మా ఓటమిపై ప్రభావం చూపింది. మరొకవైపు పిచ్ కూడా స్లోగా ఉంది. దాంతో షాట్ సెలక్షన్ అనేది అంత సులభం కాదనే విషయం అర్ధమైంది. అయినప్పటికీ ఇది చాలా తక్కువ స్కోరు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కల్గిన భారత్ జట్టు తన శక్తి సామర్ధ్యాలకు తగ్గట్టు ఆడకపోవడం వల్లే పరాజయం చెందాం. గెలవాల్సిన మ్యాచ్ ను చేజాతులా వదులుకున్నాం. దాంతో కడవరకూ వచ్చి పరాజయం చెందాల్సి వచ్చింది. ఓపెనర్ అజింక్యా రహానే అవుటయ్యే ముందు వరకూ మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. రహానే అవుటయ్యాక ఒక్కసారి పరిస్థితి మారిపోయింది. ఛేదనకు కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ వచ్చింది'వరుసగా వికెట్లను కోల్పోయి ఓటమి అంచున నిలిచాం'అని బంగర్ తెలిపాడు. నాల్గో వన్డేలో 190 పరుగుల లక్ష్యాన్ని విండీస్ నిర్దేశించగా, భారత్ 178 పరుగులకు ఆలౌటైంది. -
'కుంబ్లే లేకపోవడం లోటే'
న్యూఢిల్లీ: విజయవంతమైన కోచ్ అనిల్ కుంబ్లే లేకపోవడం లోటేనన్న భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సీనియర్లు జట్టుకు అవసరమేనని చెప్పారు. తామంతా ప్రొఫెషనల్స్ అని... ఇలాంటివి తమ కెరీర్లో భాగమేనన్నారు. ఇలాంటి సమయంలోనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది పరిణతితో సవాళ్లను అధిగమించాలని సూచించారు. కుంబ్లే రాజీ నామాపై స్పందిస్తూ ‘నిజమే... అనిల్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్లారు. చెప్పుకోదగ్గ ఫలితాలు ఆయన కోచింగ్‌లోనే వచ్చాయి. ఆ విజయాల్ని జట్టంతా ఆస్వాదించింది. అలాంటి కోచ్ లేకపోవడం కచ్చితంగా లోటే! జట్టు విజయాలేవీ ఒక్క కోచ్‌తోనూ, కెప్టెన్‌తోనూ రావు. ఆలోచనల్ని పంచుకోవడం... ప్రణాళికల్ని ఆచరణలో పెట్టడం వల్లే వస్తాయి’ అని బంగర్ వివరించారు. -
'కోహ్లి ఆటపై మాట్లాడటం సరికాదు'
బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వరుసగా నాలుగు ఇన్నింగ్స్ ల్లో విఫలమైనంత మాత్రాన అతని ఆట గురించి పదే పదే చర్చించడం అనవసరమని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. అతని కెరీర్ లోఒకటి రెండు ఫెయిల్యూర్ ఇన్నింగ్స్ వచ్చినంత మాత్రన అతని బ్యాటింగ్ ను తప్పుపట్టడం సమంజసం కాదన్నాడు. మిగతా మ్యాచ్ ల్లో కోహ్లి గాడిలో పడతాడన్న బంగర్.. వైఫల్యాల నుంచి పాఠాలను నేర్చుకుని ముందుకు సాగడం విరాట్ నైజం అన్నాడు. భారత్ రెండో్ ఇన్నింగ్స్ లో విరాట్ అవుటైన తీరు తీవ్రంగా నిరాశపరిచిందన్నాడు.విరాట్ అవుట్ పై కచ్చితత్వం లేకుండా అంపైర్ అవుట్ గా ప్రకటించిన తీరు నిరుత్సాహానికి గురి చేసిందన్నాడు. ఇలాంటి వికెట్‌పై ఎంత లక్ష్యం సరిపోతుందో తాను చెప్పలేనని బంగర్ పేర్కొన్నాడు. -
'ఎవ్వరికీ అంతు చిక్కని బౌలర్ అతను'
ముంబై: భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్‌పై బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ప్రశంసల వర్షం కురింపిచాడు. రోజు రోజుకీ పరిణితి చెందుతున్న అశ్విన్ చాలా తెలివైన క్రికెటరే కాకుండా, బ్యాటింగ్ లో సమయోచిత టెక్నిక్‌ను కల్గిన ఆటగాడని బంగర్ కొనియాడాడు. ఎప్పుడూ తన టెక్నిక్‌ను మెరుగుపరుచుకోవడానికి అత్యంత ఉత్సుకత చూపించడమే అశ్విన్ ను నంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చిందన్నాడు. 'అశ్విన్ చాలా తెలివైన క్రికెటర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అణుకువుగా ఉంటూ తన సాంకేతికతను మెరుగుపరుచుకోవడానికి అశ్విన్ ఎక్కువ కృషి చేస్తాడు. అదే అతన్ని ఉన్నత స్థానంలో నిలిపింది. ప్రస్తుతం టెక్నిక్ పరంగా ఎంతో మెరుగ్గా ఉన్న అశ్విన్ ను కట్టడి చేయడమంటే ప్రత్యర్థి ఆటగాళ్లకు అంత సులువు కాదు. ఒక ఆటగాడ్ని ఊపిరిపీల్చుకోకుండా చేసే టెక్నిక్ అశ్విన్ సొంతం. ఒకవేళ అశ్విన్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేయడానికి ప్రయత్నిస్తే వికెట్‌ను సమర్పించుకోవాల్సిఉంటుంది. అవతలి జట్టు స్పిన్నర్లకు కూడా అశ్విన్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం కష్టంగానే ఉంటుంది. ఎవరికీ అంతుచిక్కని బౌలర్ అశ్విన్.దాంతో పాటు బ్యాటింగ్ లో అశ్విన్ టెక్నిక్ చాలా మెరుగ్గా ఉంది' అని బంగర్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించిన క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అశ్విన్ గెలుచుకున్నాడు. ఈ ఏడాది 72 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న అశ్విన్, 612 పరుగులు నమోదు చేసి 'బెస్ట్'గా నిలిచాడు. -
'అవే టీమిండియాను గాయపరిచాయి'
-
'అవే టీమిండియాను గాయపరిచాయి'
రాజ్‌కోట్:ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కీలక క్యాచ్‌లను వదిలేయడం జట్టును తీవ్రంగా గాయపరిచిందని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు.భారత్ కు అనుకూలంగా కొన్ని పరిస్థితులు చోటు చేసుకున్నా, వాటిని సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం జట్టు సభ్యులు విఫలమయ్యారన్నాడు. ఇదే ఇంగ్లండ్ జట్టు పటిష్టస్థితిలో నిలవడానికి ప్రధాన కారణమన్నాడు. 'తొలుత బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా అది పెద్ద సమస్య కాదు. దురదృష్టం కొద్దీ కొన్ని క్యాచ్‌లను మా ఆటగాళ్లు వదిలేశారు. అవతల ప్రత్యర్థి ఇంగ్లండ్ వారికి వచ్చిన అవకాశాల్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. బ్యాటింగ్ అనుకూలించే పిచ్‌పై ఇంగ్లండ్ ఆటగాళ్లు ఏ అవకాశాన్ని జార విడుచుకోలేదు. ఆ లెక్కను సరి చేయాలంటే ఈ రోజు ఆట చాలా ముఖ్యం. ఇక్కడ తొలి సెషన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది'అని బంగర్ పేర్కొన్నాడు. -
'నన్ను ఆమె తిట్టలేదు'
న్యూఢిల్లీ: ప్రీతి జింతా తనను ఏమీ అనలేదని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీమ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపాడు. తనను ఆమె దూషించిందని వచ్చిన వార్తలు కల్పితమని కొట్టిపారేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ఒక్క పరుగు తేడాతో ఓడిపోవడంతో బంగర్ పై ప్రీతి నోరు పారేసుకుందని, అతడిని కోచ్ పదవికి నుంచి పీకేస్తానని హెచ్చరించిందని ముంబైకి చెందిన దినపత్రిక ప్రచురించింది. 'మ్యాచ్ ముగిసిన తర్వాత కింగ్స్ టీమ్ యాజమానులతో మామూలుగానే మాట్లాడా. దీనికి మీడియా విపరీత అర్థాలు తీసి కల్పిత కథనాలు అల్లింది. అసభ్య, అగౌరవపరిచే మాటలు నన్ను అనలేదు. ఒక్క పరుగుతో మ్యాచ్ ఓడిపోవడం బాధ కలిగించింది. ఓడిపోయినప్పటికీ మా టీమ్ బాగా క్రికెట్ ఆడింది. టోర్నమెంట్ లో చివరి వరకు నిలిచేందుకు పోరాటం కొనసాగిస్తామ'ని బంగర్ తెలిపారు. బంగర్ ను తాను తిట్టినట్టు వచ్చిన వార్తలను ప్రీతి జింతా తీవ్రంగా ఖండించింది. కల్పిత కథనాలు ప్రచురించిన పత్రికలపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చింది. -
కోచ్‌ను నోటికొచ్చినట్టు తిట్టిన ప్రీతి జింటా!
సొట్టబుగ్గల హీరోయిన్ ప్రితీ జింతా యాజమానిగా ఉన్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఈ ఐపీఎల్ కూడా ఏమాత్రం కలిసిరాలేదు. ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడింటిలో ఓడి.. మూడింటిని మాత్రమే గెలిచి.. గత ఐపీఎల్ మాదిరిగానే పంజాబ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున మగ్గుతోంది. ఇక, ఫ్లే ఆఫ్ ఆ జట్టుకు దాదాపు అవకాశాలు లేనట్టే. ఈ నేపథ్యంలో సోమవారం మొహాలిలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్- పంజాబ్ మ్యాచ్ అనంతరం ప్రీతి జింటా జట్టు కోచ్ సంజయ్ బంగర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఒక్క పరుగు తేడాతో పంజాబ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. సంజయ్ బంగార్ తన ఇష్టానుసారం బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం.. అక్సర్ పటేల్ కన్నా ముందే ఫర్మాన్ బెహర్దీన్తో పంపించడం ప్రీతికి కోపం తెప్పించిందట. దీంతో జట్టు ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ముందే బంగార్‌ను కోపంలో ప్రీతి అనరాని మాటలు అన్నదని, తిట్టిపోసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు మీడియా కథనాలు వచ్చాయి. అయితే, ఈ కథనాలపై బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటా వివరణ ఇచ్చింది. ఈ కథనాలు రుజువైతే తాను దీనికైనా సిద్ధమేనని, ఒకవేళ రుజువు కాలేదని తేలితే ఈ కథనాలు రాసిన జర్నలిస్టులు ఏం చేస్తారని ఆమె ప్రశ్నించింది. తాను కోచ్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వచ్చిన కథనాలను ఆమె ఖండించింది. -
సెహ్వాగ్ లో ఆ సత్తా ఉంది: బంగర్
న్యూఢిల్లీ: డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటాడని పంజాబ్ ఎలెవన్ కింగ్స్ కోచ్ సంజయ్ బంగర్ విశ్వాసం వ్యక్తం చేశాడు. టీమిండియాలో స్థానం సంపాదించే సత్తా ఇప్పటికీ సెహ్వాగ్ ఉందని అభిప్రాయపడ్డాడు. 36 ఏళ్ల సెహ్వాగ్ ఫిట్ నెస్ కాపాడుకునేందుకు అతడు చాలా కష్టపడుతున్నాడని బంగర్ వెల్లడించాడు. దేశీయ క్రికెట్ లోనూ రాణించాడని తెలిపాడు. పుణెలో పంజాబ్ ఎలెవన్ కింగ్స్ టీమ్ ప్రాక్టీస్ లో సెహ్వాగ్ ను గమినించిన తర్వాత బంగర్ ఈ అభిప్రాయం వెలిబుచ్చాడు. సెహ్వాగ్ ఎలా ఆడతాడో మనకందరికీ తెలుసునని, మునుపటిలా ఆడగల సత్తా అతడిలో ఉందని తెలిపాడు. ఐపీఎల్-8లో మురళీ విజయ్ తో కలిసి సెహ్వాగ్ ఓపెనర్ గా వచ్చే అవకాశముంది. -
కోచ్ లకు ప్రామాణికం జాతీయత కాదు!
న్యూఢిల్లీ: క్రీడల్లో కోచ్ పాత్ర అనేది చాలా ప్రాముఖ్యత కల్గినదని, అటువంటి కోచ్ లకు జాతీయతను అంటగట్టడం సరికాదని భారత క్రికెట్ అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో జాతీయత ఆధారంగా కోచ్ ల పాత్రలపై విమర్శల వినిపిస్తున్న నేపథ్యంలో బంగర్ పై విధంగా స్పందించాడు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఈ మాజీ ఆటగాడు.. కోచ్ అనే వాడు స్వదేశీయుడు(భారత్), విదేశీయుడా?అనే ప్రశ్నే ఉండకూదన్నాడు. ఆ క్రమంలోనే కోచ్ బాధ్యత చేపట్టిన వ్యక్తి నిరంతరం టీం ఎఫెర్ట్ లో పాలుపంచుకుంటూ జట్టును అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేయాలన్నాడు.కోచ్ నిరంతరం కొత్త కొత్త ప్రణాళికలతో జట్టను ముందుకు తీసుకువెళ్లాలని సూచించాడు. ప్రస్తుతం భారత టీం ప్రధాన కోచ్ గా డంకెన్ ఫ్లెచర్ ను కొనసాగిస్తుండగా, టీం డైరెక్టర్ గా మాజీ ఆటగాడు రవిశాస్త్రి బాధ్యతలు చేపట్టాడు. వీరికి అదనంగా సంజయ్ బంగర్, బి అరుణ్, శ్రీధర్ లను సహాయ కోచ్ లుగా నియమించిన సంగతి తెలిసిందే.