IPL 2022: Sanjay Bangar Says Virat Kohli Will Emerge From This Run of Low Scores - Sakshi
Sakshi News home page

Virat Kohli: ఎత్తుపల్లాలు సహజం.. జట్టు నుంచి తీసేయాలనడం కరెక్ట్‌ కాదు!

Published Wed, Apr 27 2022 10:42 AM | Last Updated on Wed, Apr 27 2022 5:36 PM

Sanjay Bangar Support Kohli Experience Highs-Lows Before Emerge Out This - Sakshi

Courtesy: IPL Twitter

రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆర్‌సీబీ సీనియర్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి మరోసారి విఫలమైన సంగతి తెలిసిందే. కాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 128 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో రెండుసార్లు గోల్డెన్‌ డక్‌లు ఉండడం విశేషం. దీంతో కోహ్లి పని అయిపోయిందని.. కొన్ని మ్యాచ్‌లకు రెస్ట్‌ ఇస్తే అన్ని సర్దుకుంటాయని మాజీ క్రికెటర్లు సహా ఫ్యా‍న్స్‌ అభిప్రాయపడ్డారు. అయితే కోహ్లి ఫామ్‌పై తమకు ఆందోళన లేదని.. ఇది మాకు అలవాటేనని ఆర్‌సీబీ హెడ్‌కోచ్‌ సంజయ్‌ బంగర్‌ పేర్కొన్నాడు.

''కోహ్లి ఫామ్‌పై ఆందోళన వద్దు. నిజానికి అతను ఒక గొప్ప క్రికెటర్‌. ఇంతకముందు కూడా ఇలాంటి ఎత్తుపల్లాలు చాలానే చూశాడు. నేను కోహ్లిని చాలా దగ్గర్నుంచి గమనించాను. కొన్ని మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినప్పటికి ఫుంజుకునే అవకాశం ఉంది. ఈ మాత్రానికే జట్టు నుంచి తొలగించమనడం కరెక్ట్‌ కాదు. ఏమో చెప్పలేం.. రానున్న మ్యాచ్‌ల్లో కోహ్లి రాణించి మ్యాచ్‌లు గెలపించవచ్చేమో. అతని బ్యాటింగ్‌పై మాకు అనుమానం లేదు. ఎందుకంటే ప్రాక్టీస్‌ సమయంలో కోహ్లినే అందరికంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. అతని షాట్ల ఎంపికలో కూడా కచ్చితత్వం ఉంటుంది. కానీ కొన్ని పొరపాట్ల వల్ల బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్నాడు. ఇక రాజస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఓపెనర్‌గా వచ్చాడు. అంతకముందు ఓపెనింగ్‌ చేసిన అనూజ్‌ రావత్‌ ముంబై ఇండియన్స్‌పై 66 మినహా... మిగతా ఆరు మ్యాచ్‌లు కలిపి 63 పరుగులు సాధించాడు.

కోహ్లికి ఓపెనింగ్‌ చేసిన అనుభవం ఉంది.. డుప్లెసిస్‌కు సరైన జోడి కోహ్లినే అని అభిప్రాయపడి ఓపెనింగ్‌ స్థానంలో పంపించాం. రానున్న మ్యాచ్‌ల్లోనూ ఇది కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక కోహ్లి మినహాయిస్తే మిగతా ఆటగాళ్ల విషయానికి వస్తే మ్యాక్స్‌వెల్‌, కార్తిక్‌, షాబాజ్‌ అహ్మద్‌ అంతా ఫామ్‌లో ఉన్నారు. ఏదో ఒక్క మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రానా తప్పుబట్టనవసరం లేదు. మా జట్టులో ఇప్పుడు ఏడో స్థానం వరకు బ్యాటింగ్‌ చేసే సమర్థులు ఉన్నారు. ఇది మాకు బలం అని చెప్పొచ్చు.'' అంటూ పేర్కొన్నాడు. ఇక ఆర్‌సీబీ తన తర్వాతి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 30న గుజరాత్‌ టైటాన్స్‌తో ఆడనుంది.

చదవండి: Trolls On Virat Kohli: ఓపెనర్‌గా వచ్చినా అదే ఆటతీరు.. పక్కన పెట్టాల్సిందేనా!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement