RCB Head Coach 2022: RCB Appoint Sanjay Bangar as Head Coach for Next Two IPL Seasons - Sakshi
Sakshi News home page

ఆర్సీబీ హెడ్‌ కోచ్‌గా భారత మాజీ ఆటగాడు..

Published Tue, Nov 9 2021 1:15 PM | Last Updated on Tue, Nov 9 2021 2:17 PM

RCB appoint Sanjay Bangar as head coach for next two IPL seasons - Sakshi

RCB appoint Sanjay Bangar as head coach: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్‌కోచ్‌గా భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్‌ ఎంపికయ్యాడు.  తదుపరి రెండు ఐపీఎల్‌ సీజన్‌లకు ప్రధాన కోచ్‌గా అతడిని ఆర్సీబీ నియమించింది. అయితే గత కొద్ది సీజన్ల నుంచి ఆ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బంగర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ఐపీఎల్‌-2021 తొలి దశలో ఆర్సీబీకు ప్రధాన కోచ్‌గా ఉన్న సైమన్ కటిచ్.. సెకెండ్‌ ఫేజ్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు.

అతడి స్ధానంలో మైక్ హెస్సన్  తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టాడు. ఇక మైక్ హెస్సన్ ఆజట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నాడు. అయితే ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి ఆర్సీబీ సారథి  ఎవరన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

చదవండిVirat Kohli: ఓటమితో ఆరంభించి.. 'ఓటమి'తో ముగించినా.. లవ్‌ యూ భాయ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement