IPL 2022 Eliminator LSG Vs RCB: Kohli Hillarious Reaction After Police Takes Intruder Out, Video Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022 LSG Vs RCB: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్‌ వైరల్‌

Published Thu, May 26 2022 4:25 PM | Last Updated on Thu, May 26 2022 5:41 PM

IPL 2022: Kohli Hillarious Reaction After Police Takes Intruder Out - Sakshi

మ్యాచ్‌ సీరియస్‌గా జరుగుతున్న సమయంలో తన ఫెవరెట్‌ ఆటగాడిని దగ్గరి నుంచి చూడాలనే కోరిక చాలా మంది ఫ్యాన్స్‌లో ఉంటుంది. అయితే మ్యాచ్‌ జరిగే సమయంలో అది కష్టమని భావించి ఆ కోరికను చంపేసుకుంటారు. కానీ కొందరు మాత్రం తమ కోరికను అణుచుకోలేక ఏం జరిగినా సరే మైదానంలోకి దూసుకొచ్చి తమ అభిమాన ఆటగాడిని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి సంఘటనే ఐపీఎల్‌ 2022 సీజన్‌లో చోటు చేసుకుంది. బుధవారం ఆర్సీబీ, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరిగింది.

లక్నో బ్యాటింగ్‌ సమయంలో ఆర్‌సీబీ ఆటగాడు కోహ్లి బౌండరీ లైన్‌ వద్ద సీరియస్‌గా ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో కోహ్లి వద్దకు ఒక అభిమాని పరిగెత్తుకు వచ్చాడు. అది చూసిన కోహ్లి.. అతనికి దూరంగా వెళ్లాడు. సెక్యూరిటీని పిలిచి ఆ వ్యక్తిని స్టేడియం నుంచి తీసుకెళ్లాలని అరిచాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సదరు వ్యక్తిని వడ్డ బస్తా ఎత్తినట్లుగా భుజంపై పెట్టుకొని స్టాండ్స్‌లోకి తీసుకెళ్లారు.

ఇది చూసిన కోహ్లి తన నవ్వును కంట్రోల్‌ చేసుకోలేకపోయాడు.. అభిమానుల వైపు తిరిగి జాన్‌సీనా(డబ్ల్యూడబ్యూఈ ఫేమ్‌) తరహాలో అదిరిపోయే రియాక్షన్‌ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ క్వాలిఫయర్‌-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్‌-2లో అమితుమీ తేల్చుకోనుంది. 

చదవండి: IPL 2022: సెంచరీతో లక్నోకు చుక్కలు చూపించాడు.. ఎవరీ రజత్‌ పాటిదార్‌..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement