
PC: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఆర్‌సీబీ క్వాలిఫయర్-2కు చేరుకున్న సంగతి తెలిసిందే. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆర్‌సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ సూపర్ బౌలింగ్ చేశాడు. ఆ ఓవర్‌లో తొలి రెండు బంతులు వైడ్ వేసినప్పటికి ఒత్తిడిని దరి చేరనీయకుండా సూపర్ స్పెల్ వేశాడు. రెండు వైడ్లు సహా కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన హర్షల్ కీలకమైన స్టోయినిస్ వికెట్‌ను పడగొట్టి ఆర్‌సీబీకి ఊరటనిచ్చాడు.
ఒక రకంగా ఆర్సీబీ మ్యాచ్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది ఈ ఓవర్‌లోనే అని చెప్పొచ్చు. ఆర్సీబీ ఫ్రంట్‌లైన్ బౌలర్‌గా ఉన్న హర్షల్.. లక్నోతో మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గానూ పేరు సంపాదించాడు. కాగా మ్యాచ్ విజయం అనంతరం హర్షల్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
''డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఎప్పుడు ఒత్తిడిని కలిగిస్తుంది. కానీ ఆ ఒత్తిడి అంటేనే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒక బౌలర్‌లో నెర్వస్‌లో సూపర్ బౌలింగ్ చేయడం ముఖ్యం. దానిని ఇవాళ లక్నోతో మ్యాచ్‌లో సాధించాను. గత రెండు- మూడేళ్లుగా హర్యానా తరపున డెత్ ఓవర్లలో బౌలింగ్ చేస్తూ బాగా రాటుదేలాను. అలాంటి సందర్భాలను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలనుకున్నా. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆ అవకాశం వచ్చింది.
మ్యాచ్ ఓడిపోతే ఇంటిబాటే అన్న సందర్భంలో బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఇలాంటి చాలెంజ్‌లను సమర్థంగా స్వీకరిస్తా. వచ్చే సౌతాఫ్రికా సిరీస్‌కు భువనేశ్వర్‌తో కలిసి కొత్త బంతిని పంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నా'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌పై 14 పరుగుల తేడాతో గెలిచిన ఆర్‌సీబీ క్వాలిఫయర్-2కు చేరుకుంది. మే 27(శుక్రవారం) రాజస్తాన్ రాయల్స్‌తో ఆర్సీబీ క్వాలిఫయర్-2లో అమితుమీ తేల్చుకోనుంది.
చదవండి: IPL 2022 LSG Vs RCB: 'వడ్ల బస్తా మోసుకెళ్లినట్లు సింపుల్‌గా'.. కోహ్లి రియాక్షన్ వైరల్
కార్తీక్ క్యాచ్‌ను విడిచి పెట్టిన రాహుల్.. గంభీర్ రియాక్షన్ ఇదే
Comments
Please login to add a commentAdd a comment