PC; IPL Twitter
ఐపీఎల్ 2022లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, ఆర్‌సీబీ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే బిగ్‌షాక్ తగిలింది. కెప్టెన్ డుప్లెసిస్ ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ దశలో ఇన్నింగ్స్ రెండో ఓవర్ తొలి బంతిని కోహ్లి కొట్టిన స్టైలిష్ బౌండరీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫిదా అయ్యాడు.
కోల్‌కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్‌కు గంగూలీ జైషాతో కలిసి గ్యాలరీలో కూర్చొని ఎంజాయ్ చేశాడు. చమీర బౌలింగ్‌లో మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే బౌండరీ బాదాడు. దీనికి గంగూలీ.. ''వారెవ్వా క్యా షాట్ హై'' అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక తొలి పవర్ ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులతో మంచి స్థితిలో నిలిచింది. పాటిదార్ 33 పరుగులతో కాస్త వేగంగా ఆడగా.. కోహ్లి అతనికి సహకరించాడు. ఆ తర్వాత 25 పరుగులు చేసిన కోహ్లి ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
Reaction from Ganguly after the flick for a boundary by Kohli. pic.twitter.com/TNwA6li0xm
— Johns. (@CricCrazyJohns) May 25, 2022
Comments
Please login to add a commentAdd a comment