
న్యూఢిల్లీ : ఆదివారం సిడ్నీ వేదికగా జరగనున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఓపెన్‌కు మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీ బాగుంటుందని మాజీ ఇండియా బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డారు. ఓ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ రోహిత్ శర్మ అందుబాటులో లేడు కాబట్టి, మయాంక్ శర్మ, శిఖర్ ధావన్‌ల జోడీతో ముందుకెళితే బాగుంటుందని నా అభిప్రాయం. ధావన్ నిలకడగా ఆడతాడు. ఒక వేళ వారు కేల్ రాహుల్‌తో ముందుకెళ్లొచ్చు. అతడు నెంబర్ 5 ఆటగాడిగా భారత జట్టుకు ఎంతో సేవ చేశాడు. కానీ, మయాంక్, శిఖర్ ధావన్‌తో జోడీ అయితేనే బాగుంటుందని భావిస్తున్నా’’నన్నారు.
Comments
Please login to add a commentAdd a comment