కేప్‌టౌన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా సమావేశానికి డుమ్మా కొట్టాడు. సాధారణంగా టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు ఇరు జట్ల కెప్టెన్‌లు మీడియా సమావేశంలో పాల్గొనడం ఆనవాయితీ. అలాంటిది గురువారం నిర్వహించిన మీడియా సమావేశానికి కోహ్లీ హాజరుకాకుండా భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను పంపించాడు. దీంతో దక్షిణాఫ్రికా మీడియా అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘ఆటగాళ్లంతా సానుకూల దృక్పథంతో కాన్పిడెంట్‌గా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. కోహ్లీ హాజరుకాకపోవడంపై వివరణ కోరగా.. ‘కోహ్లీ-రవిశాస్త్రి ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. అంతేకాదు సౌతాఫ్రికా కెప్టెన్ హాజరవుతున్నాడన్న సమాచారం లేదని తెలిపాడు.
ఇక టీమిండియా ఆటగాళ్లు సైతం గురువారం ప్రాక్టీస్ సెషన్‌నూ ఎగ్గొట్టారు. గురువారం ఉదయమే టీమ్ మేనేజ్‌మెంట్ ఆటగాళ్లకు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అని చెప్పింది. దీంతో ఒక్క ఆటగాడు కూడా ప్రాక్టీస్ సెషన్‌కు హాజరుకాలేదు. భారత జట్టు సిబ్బందితో పాటు ప్రధాన కోచ్ రవిశాస్త్రి, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాత్రమే టెస్టు జరిగే పిచ్‌ను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశానికి రవిశాస్త్రితో కలిసి కోహ్లీ హాజరుకావాల్సి ఉండే. కానీ, ఎవరూ రాలేదు. సుమారు గంట తర్వాత అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వచ్చాడు. గతంలో ఇలా భారత కెప్టెన్ మీడియా సమావేశానికి హాజరుకాకపోవడం ఎప్పుడు జరగలేదు. మాజీ కెప్టెన్ ధోని ఈడెన్ గార్డెన్స్‌లో ఓ సారి ఇషాంత్‌ను పంపించాడు. ఈ రోజు మధ్యాహ్నం 2గంటల నుంచి భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.
Comments
Please login to add a commentAdd a comment