
India vs Sri Lanka 2022: లక్నో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కేవలం 28 బంతుల్లోనే 57 పరుగులు సాధించి విధ్వంసం సృష్టించాడు. ఇక శ్రీలంకతో సిరీస్‌కు కోహ్లి గైర్హాజరీ నేపథ్యంలో మూడో స్ధానంలో అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. కోహ్లి స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ అదరగొడుతున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లికి బ్యాకప్‌గా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందని భారత మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లి అందుబాటులో లేని పక్షంలో అయ్యర్ మూడో స్ధానంలో అద్భుతంగా రాణించగలడని అతడు తెలిపాడు. "టీమిండియా బెంచ్ బలంగా ఉంది. శ్రేయాస్‌ని బ్యాటింగ్‌కు పంపుతున్న స్థానం సరైనది. ఒక వేళ విరాట్ కోహ్లి ఏదైనా మ్యాచ్‌లో గాయపడితే.. అయ్యర్ ఆ స్ధానాన్ని భర్తీ చేయగలగడు. టీమ్ మేనేజ్‌మెంట్ కూడా విరాట్‌కి బ్యాకప్‌గా అయ్యర్‌పై దృష్టి సారించింది" అని బంగర్ పేర్కొన్నాడు. కాగా ఇప్పటి వరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన అయ్యర్.. 662 పరుగులు సాధించాడు.
చదవండి: Rohit Sharma: టీమిండియా సరికొత్త చరిత్ర.. తొలి కెప్టెన్‌గా రోహిత్!