![Saba Karim on dilemma over Shreyas Iyer and Deepak Hooda - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/6/deepak-hooda.jpg.webp?itok=KciI3WfY)
వెస్టిండీస్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరం కావడంతో అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న శ్రేయస్ అయ్యర్( 0 ,10,24) ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అయ్యర్ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో అయ్యర్ స్థానంలో దీపక్ హుడాకు అవకాశం ఇవ్వాలని మాజీలు క్రికెట్ నిపుణులు సూచిస్తున్నారు.
ఐర్లాండ్ సిరీస్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా అదరగొట్టాడు. ఈ సిరీస్‌లో అతడు అద్భుతమైన సెంచరీ కూడా సాధించాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు సబా కరీమ్ కీలక వాఖ్యలు చేశాడు. ఆసియాకప్‌లో టీమిండియా బ్యాకప్ నంబర్ త్రీ బ్యాటర్‌గా శ్రేయాస్ అయ్యర్, దీపక్ హుడాలో ఎవరు ఉండాలనేది సెలక్టర్లు నిర్ణయించడానికి ఇదే సరైన సమయమని కరీం అభిప్రాయపడ్డాడు.
ఇండియా న్యూస్ స్పోర్ట్స్‌తో కరీం మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లి జట్టులో ఉంటే అతడే సహజంగా నంబర్ 3లో బ్యాటింగ్‌కు వస్తాడు. ఒక వేళ కోహ్లి అందుబాటులో లేకపోతే అతడికి బ్యాకప్ బ్యాటర్‌గా ఎవరు ఉండాలో సెలెక్టర్లు నిర్ణయించే సమయం ఆసన్నమైంది. సెలెక్టర్లు శ్రేయస్ అయ్యర్ కొనసాగించాలని అనుకుంటే అతడికి ప్రతీ మ్యాచ్‌లోనూ అవకాశాలు ఇవ్వాలి. అతడు తన ఫామ్‌ను తిరిగి పొందుతాడని ఆశిస్తున్నాను.
అయితే జట్టు మేనేజేమెంట్ ప్రయోగాలు చేయాలని భావిస్తే దీపక్ హుడాకు కూడా ఛాన్స్ ఇవ్వడానికి ఇదే సరైన సమయం. హుడా బ్యాట్‌తో బాల్‌తోనూ అద్భుతంగా రాణించగలడు. అది జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. అయితే అతడిని నాలుగో స్థానానికి భారత్ సిద్దం చేస్తున్నట్లు ఉంది. ఎందుకంటే ఒకట్రెండు ఓవర్లలో ఓపెనర్ల వికెట్లను భారత్ కోల్పోతే ఇన్నింగ్స్ చక్కదిద్దే సత్తా హుడాకి ఉంది" అని పేర్కొన్నాడు.
చదవండి: India Probable XI: ఓపెనర్‌గా ఇషాన్ కిషన్.. అవేష్ ఖాన్‌కు నో ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment