వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు వెస్టిండీస్ కళ్లెం వేసింది. సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. ఇక మంగళవారం జరగనున్న మూడో టీ20లో విజయం సాధించి విండీస్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది. కాగా విండీస్-భారత్ మధ్య మూడో టీ20 సెయింట్స్ కిట్స్ వేదికగానే జరగనుంది.
ఈ మ్యాచ్ కూడా 90 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మూడో టీ20 రాత్రి 9:30 గంటలకు మొదలు కానుంది. ఇక రెండో టీ20లో భారత బౌలర్లు రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా నిరాశపరిచారు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన నిరాశపరిచిన శ్రేయస్ అయ్యర్(0 ,10)ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టే అవకాశం ఉంది.
అతడి స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో రోహిత్ జోడిగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో పంత్‌ను పంపే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన సూర్య స్థాయికి తగ్గట్లు రాణించలేదు. దీంతో అతడిని ఎప్పటిలాగే నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు పంపాలని కోచ్, కెప్టెన్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు భారత్ ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక వేళ ముగ్గురు స్పిన్నర్లను భారత్ ఆడించాలని భావిస్తే అవేశ్ ఖాన్ స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రానున్నాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: Ind Vs WI T20 Series: ఓపెనర్‌గా డీకే! ఐదో స్థానంలో రోహిత్ ఎందుకు రాకూడదు? రూల్ అంటే రూలే మరి!
Comments
Please login to add a commentAdd a comment