వెస్టిండీస్‌తో మరో పోరుకు టీమిండియా సిద్దమైంది. ఫ్లోరిడా వేదికగా శనివారం జరగనున్న నాలుగో టీ20లో విండీస్‌తో భారత్ తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి మరో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది. విండీస్‌తో జరిగిన రెండో టీ20లో ఓటమి చెందిన భారత్.. మూడో టీ20లో విజయం సాధించి అద్భుతమైన పునరాగమనం చేసింది. టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్ బౌలింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన ఓపెనర్ సూర్య కుమార్ యాదవ్.. మూడో టీ20లో మాత్రం దుమ్మురేపాడు.
ఈ మ్యాచ్‌లో సూర్య 44 బంతుల్లో 77 పరుగులుచేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.మిడిలార్డర్‌లో రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అఖరిలో దినేష్ కార్తీక్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది. ఇక మూడో టీ20లో గాయపడిన కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. దీంతో అతడు నాలుగో టీ20కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఒక వేళ రోహిత్ దూరమైతే అతడి స్థానంలో ఇషాన్ కిషన్ తుది జట్టులోకి రానున్నాడు.
మరోవైపు ఈ మ్యాచ్‌కు కూడా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ జడ్డూ దూరమైతే అతడి స్థానంలో దీపక్ హుడానే కొనసాగించడం ఖాయం. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. అర్ష్‌దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా రాణిస్తున్నారు. గత రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన అవేష్‌ఖాన్‌ను ఈ మ్యాచ్‌కు పక్కన పెట్టే అవకాశం ఉంది. అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఇక విండీస్ గత మ్యాచ్‌లో ఓటమికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. విండీస్ ఈ మ్యాచ్‌లో భారత్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. అయితే విండీస్ గత మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా అద్భుతంగా రాణించింది. బౌలింగ్‌లో మాత్రం పూరన్ సేన విఫలమైంది. కాగా ఓపెనర్లు కైల్ మైర్స్, బ్రాండన్ కింగ్ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు సానుకూలాంశం. మిడాలర్డర్‌లో పూరన్, పావెల్ కూడా పర్వాలేదనిపిస్తున్నారు. ఇక బౌలింగ్‌లో మెక్‌కాయ్, హోసన్ మరోసారి చెలరేగితే భారత్‌కు కష్టాలు తప్పవు.
చదవండి: Asia Cup 2022: 'కోహ్లికి బ్యాకప్ ఎవరన్నది సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలి'
Comments
Please login to add a commentAdd a comment