వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (171), రోహిత్ శర్మ (103) సెంచరీతో కదంతొక్కగా.. 12 వికెట్లతో అశ్విన్ చెలరేగిపోయాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150, రెండో ఇన్నింగ్స్‌లో 130 పరుగులకు పరిమితం కాగా.. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి టెస్ట్ గెలుపుతో 2 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా, కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వైరలైంది.
అదేంటంటే.. టెస్ట్‌ల్లో హిట్‌మ్యాన్ సెంచరీ చేసిన ప్రతిసారి టీమిండియా విజయం సాధించింది. దీంతో అతని అభిమానులు.. హిట్‌మ్యాన్ సెంచరీ చేశాడంటే టీమిండియా గెలవాల్సిందే అంటూ సంకలు గుద్దుకుంటున్నారు. టెస్ట్ కెరీర్‌లో 10 శతకాలు బాదిన రోహిత్.. విండీస్‌పై మూడో సెంచరీ నమోదు చేశాడు.
2013లో ఇదే విండీస్‌పై భారీ సెంచరీ (177) చేసి టీమిండియాను గెలిపించిన రోహిత్.. ఆతర్వాత అదే ఏడాది విండీస్‌పైనే మరో సెంచరీ (111 నాటౌట్), 2017లో శ్రీలంకపై మూడో సెంచరీ (102 నాటౌట్), 2019లో సౌతాఫ్రికాపై నాలుగో సెంచరీ (176), అదే సిరీస్‌లో మరో సెంచరీ (127), అదే సిరీస్‌లో సౌతాఫ్రికాపై డబుల్ సెంచరీ (212), 2021లో ఇంగ్లండ్‌పై ఏడో సెంచరీ (161), అదే ఏడాది మరో సెంచరీ (127), ఈ ఏడాది ఆసీస్‌పై తొమ్మిదో సెంచరీ (120), తాజాగా విండీస్‌పై 10వ సెంచరీ చేసి టీమిండియాను గెలిపించాడు. కెరీర్‌లో ఇప్పటివరకు 51 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్.. 10 సెంచరీలు, 14 అర్ధసెంచరీల సాయంతో 3540 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment