
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో రోహిత్ సేన మ్యాచ్ వేదిక పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకుంది. క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో మంగళవారం నుంచి ప్రాక్టీస్ సెషన్ మొదలుపెట్టనుంది.
కాగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడే నిమిత్తం భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూలై 12న ఇరు జట్ల మధ్య మొదటి టెస్టు మొదలుకాగా.. టీమిండియా ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది.
టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తమ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లను బోల్తా కొట్టించగా.. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన యశస్వి జైశ్వాల్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అరంగేట్రంలోనే సెంచరీ(171)తో మెరిసి సరికొత్త రికార్డులు సృష్టించాడు.
ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ సీజన్ 2023-25లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లోనే అదరగొట్టి ఘన విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో.. రెండు దశాబ్దాలుగా టీమిండియాపై గెలవాలని కోరుకుంటున్న విండీస్‌కు మరోసారి నిరాశే ఎదురైంది.
ఇక రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. బలహీనంగా ఉన్న విండీస్‌పై పటిష్ట రోహిత్ సేనకు అదేమీ అంత కష్టంకాదు. అయితే, తొలి టెస్టులో విఫలమైన శుబ్‌మన్ గిల్, అజింక్య రహానే ఏ మేరకు రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
కాగా జూలై 20 నుంచి ఇరు జట్ల మధ్య ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్ల ఫొటోలు, వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చదవండి: పాతికేళ్లకే ఇషాన్ ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టాడా! కోహ్లికి కూడా సాధ్యం కానివి..
సూర్యకు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలికా?: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్
Happy faces in Trinidad 👋 😊#TeamIndia | #WIvIND pic.twitter.com/OuMCLeXOoc
— BCCI (@BCCI) July 17, 2023