ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్‌కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.
శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment