series win
-
India vs England 4th Test Day 4: కుర్రాళ్లు కొట్టేశారు
కింగ్ కోహ్లి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ గాయంతో తర్వాత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వైఫల్యంతో శ్రేయస్ అయ్యర్‌ను తీసేశారు. ఇక ప్రధాన బ్యాటింగ్ దళానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పెద్ద దిక్కు. రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్... వీళ్లంతా పూర్తిగా కొత్తవాళ్లు! ఈ సిరీస్‌తోనే అరంగేట్రం చేశారు. 11 మందిలో నలుగురు కొత్తవాళ్లతో... మిగతా అనుభవం లేనివారితో... సంప్రదాయ మ్యాచ్‌లాడి ఇంగ్లండ్‌లాంటి ‘బజ్‌బాల్’ దూకుడు జట్టును ఓడించడం ఆషామాషీ కానేకాదు. కానీ కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఆడి గెలిచింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తర్వాత టీమిండియా భవిష్యత్తుకు కొండంత విశ్వాసాన్ని ఈ సిరీస్ ఇచి్చంది. రాంచీ: ఐదు టెస్టుల సిరీస్‌ను ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3–1తో కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌ల్లాగే నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగో టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్, కెపె్టన్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (124 బంతుల్లో 52 నాటౌట్; 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్ ధ్రువ్ జురెల్ (77 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు) టెస్టు విజయానికి అవసరమైన పరుగుల్ని అజేయంగా చేసి పెట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా, రూట్, హార్ట్లీలకు చెరో వికెట్ దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకమైన పరుగులు చేసిన కొత్త వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రోహిత్, గిల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ ఈ టెస్టుతో పాటు సిరీస్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉండగా... ఓవర్‌నైట్ స్కోరు 40/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ ఒడిదొడుకుల్లేకుండా నడిపించారు. కుదురుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 37; 5 ఫోర్లు)ను జట్టు స్కోరు 84 పరుగుల వద్ద రూట్ బోల్తా కొట్టించాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక మరో ఓపెనర్ రోహిత్‌ను హార్ట్లీ పెవిలియన్ చేర్చాడు. 99/2 వద్ద ఓపెనర్లే అవుటయ్యారు. ఇక్కడిదాకా టీమిండియా మంచి స్థితిలోనే ఉంది. అయితే బషీర్ స్పిన్నేయడంతో రజత్ పటిదార్ (0), జడేజా (4), సర్ఫరాజ్ (0)లు బ్యాట్లెత్తారు. అప్పుడు భారత్ స్కోరు 120/5. సగం వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన సగంలో జురెల్ తప్ప అంతా స్పెషలిస్టు బౌలర్లే! లక్ష్యమింకా 72 పరుగుల దూరంలో ఉంది. ఇలాంటి గడ్డు స్థితిలో శుబ్‌మన్, జురెల్ మొండి పోరాటం చేశారు. ఇంగ్లండ్ సారథి స్టోక్స్ వరుసబెట్టి స్పిన్ త్రయం బషీర్, హార్ట్లీ, రూట్‌లతోనే బౌలింగ్ వేయించాడు. అయినా ప్రత్యర్థి జట్టుకు పట్టుబిగించే అవకాశమివ్వకుండా... మరో వికెట్ పడకుండా గిల్–జురెల్ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలో శుబ్‌మన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... టీ విరామానికి ముందే భారత్ విజయతీరాలకు చేరుకుంది. ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో టెస్టుతోపాటు సిరీస్ కూడా మన జట్టు వశమైంది. ► వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 3–1తో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ 64.58 శాతంతో ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (75) అగ్రస్థానంలో, ఆ్రస్టేలియా (55) మూడోస్థానంలో ఉన్నాయి. ► ఈ టెస్టూ నాలుగో రోజుల్లో ముగియడం... ధర్మశాలలో ఆఖరి టెస్టు (మార్చి 7 నుంచి)కు 9 రోజుల విరామం ఉండటంతో ఇంగ్లండ్ జట్టు సభ్యులు రెండు వేర్వేరు చోట్ల విశ్రాంతి తీసుకోనున్నారు. కొన్నాళ్లు చండీగఢ్, ఆ తర్వాత బెంగళూరుల్లో స్టోక్స్ బృందం సేద తీరుతుంది. మూడో టెస్టుకు ముందూ ఇలాంటి గ్యాపే ఉండటంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో విశ్రాంతి తీసుకొని వచి్చంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353; భారత్ తొలి ఇన్నింగ్స్: 307; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145; భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫోక్స్ (బి) హార్ట్లీ 55; యశస్వి (సి) అండర్సన్ (బి) రూట్ 37; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 52; రజత్ పటిదార్ (సి) పోప్ (బి) బషీర్ 0; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) బషీర్ 4; సర్ఫరాజ్ (సి) పోప్ (బి) బషీర్ 0; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–84, 2–99, 3–100, 4–120, 5–120. బౌలింగ్: జో రూట్ 7–0–26–1, హార్ట్లీ 25–2–70–1, బషీర్ 26–4–79–3, అండర్సన్ 3–1–12–0. 17: స్వదేశంలో భారత్‌కిది వరుసగా 17వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి టీమిండియా సొంతగడ్డపై 2012లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది. -
‘జులన్‌కు ఘనంగా వీడ్కోలు ఇస్తాం’
కాంటర్బరి: వరుసగా రెండు మ్యాచ్‌ల విజయాలతో 2–0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇక ఏ ఒత్తిడి లేకుండా ఆఖరి పోరు ఆడుతుందని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘తొలి మ్యాచ్ గెలిచిన మాకు రెండో మ్యాచ్ కీలకమైంది. ఇందులో గెలిచి సిరీస్ సాధించాలనే పట్టుదలతో ఆడాం. అనుకున్నది సాధించాం. ఎన్నో ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక మాకు లార్డ్స్‌లో జరి గే ఆఖరి మ్యాచ్ నామమాత్రమైంది. అక్కడ ఏ బెంగ లేకుండా ఆడేయొచ్చు. అంతేకాదు... దిగ్గజ సీమ ర్ జులన్ గోస్వామి కెరీర్లో ఆఖరి మ్యాచ్ కాబట్టి విఖ్యాత లార్డ్స్ మ్యాచ్ మాకిపుడు ప్రత్యేకమైంది. మా పేసర్‌కు విజయంతో వీడ్కోలు ఇస్తాం’ అని హర్మన్ మ్యాచ్ ముగిసిన అనంతరం పేర్కొంది. ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత... భారత అమ్మాయిల జట్టు బుధవారం జరిగిన రెండో వన్డేలో 88 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై జయభేరి మోగించింది. తద్వారా 2–0తో ఇంగ్లండ్ గడ్డపై 23 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ గెలిచింది. చివరి సారిగా 1999లో అక్కడ సిరీస్ నెగ్గింది. బుధవారం జరిగిన పోరులో మొదట భారత్ 5 వికెట్ల నష్టానికి 333 పరుగుల భారీస్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి దాకా చెలరేగింది. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 245 పరుగుల వద్ద ఆలౌటైంది. వ్యాట్ (58 బంతుల్లో 65; 6 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కాప్సీ (39; 6 ఫోర్లు), కెప్టెన్ అమీ జోన్స్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడారు. రేణుక సింగ్ (4/57) చావుదెబ్బ తీయగా, హేమలత 2 వికెట్లు పడగొట్టింది. రేపు లార్డ్స్‌లో ఆఖరి వన్డే జరుగుతుంది. -
బంగ్లాదేశ్‌కు మరోసారి ఊహించని షాక్.. వన్డే సిరీస్ జింబాబ్వే సొంతం!
జింబాబ్వేతో టీ20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్.. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కాపాడకోలేకపోయింది. హరారే వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో జింబాబ్వే 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో జింబాబ్వే కైవసం చేసుకుంది. జింబాబ్వే విజయంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ సికందర్ రజా, కెప్టెన్ చక్‌బావ సెంచరీలతో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మదుల్లా (80), కెప్టెన్ తమీమ్(50), అఫీఫ్ హుస్సేన్(41) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో రజా మూడు వికెట్లు, మాధేవేరే రెండు, న్యాచి, చివంగా తలా వికెట్ సాధించారు. అనంతరం 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 49 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో రజా, చక్‌బావ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో జట్టును అదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు ఏకంగా 201 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం మ్యాచ్‌ను జింబాబ్వే వైపు మలుపు తిప్పింది. అనంతరం జింబాబ్వే కెప్టెన్ చక్‌బావ 75 బంతుల్లో 102 పరుగులు చేసి ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్ ఔటైనప్పటికీ రజా(127 బంతుల్లో 117పరుగులు) మాత్రం అఖరి వరకు క్రీజులో నిలిచి జింబాబ్వేకు మరుపురాని విజయాన్ని అందించాడు. రజా, చక్‌బావ అద్భుమైన ఇన్నింగ్స్‌ల ఫలితంగా జింబాబ్వే 47.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా రజాకు ఈ సిరీస్‌లో ఇదే వరుసగా రెండో సెంచరీ కావడం గమనార్హం. తొలి వన్డేలో కూడా జింబాబ్వే విజయంలో రజా తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇరు జట్ల మధ్య అఖరి వన్డే బుధవారం హరారే వేదికగా జరగనుంది. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్‌కు భారత జట్టు.. అయ్యర్‌కు నో ఛాన్స్! హుడా వైపే మెగ్గు! -
స్పిన్నర్ల మాయాజాలం.. ఆఖరి టీ20లోనూ టీమిండియాదే విజయం
ఫ్లొరిడా: ఆఖరి టి20లోనూ భారతే విజయం సాధించింది. ఐదో మ్యాచ్‌లో టీమిండియా 88 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. కరీబియన్ గడ్డపై ఒక మ్యాచ్ అయినా నెగ్గిన విండీస్‌కు అమెరికాలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయం ఎదురైంది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (40 బంతుల్లో 64; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీపక్ హుడా (25 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. తర్వాత వెస్టిండీస్ 15.4 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలింది. బిష్ణోయ్ (4/16), కుల్దీప్ (3/12), అక్షర్ పటేల్ (3/15)ల స్పిన్ ఉచ్చులో పడిన కరీబియన్‌ను హెట్‌మైర్ (35 బంతుల్లో 56; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధసెంచరీతో ఆదుకున్నాడు. కానీ మిగతా బ్యాటర్స్ చేతులెత్తేయడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా పయనించలేదు. భారత్ 4–1తో పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. కివీస్‌పై తొలిసారి..
ఢాకా: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆతిధ్య బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. ఢాకా వేదికగా జరిగిన నాలుగో టీ20లో పర్యాటక జట్టుపై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న బంగ్లా జట్టు.. తొట్ట తొలిసారిగా న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. బంగ్లా బౌలర్లు నసుమ్ అహ్మద్(4/10), ముస్తాఫిజుర్(4/12) ధాటికి 19.3 ఓవర్లలో 93 పరుగులకే కుప్పకూలింది. విల్ యంగ్(48 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ లాథమ్(26 బంతుల్లో 21; ఫోర్) రెండంకెల స్కోర్ చేయడంతో కివీస్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో బంగ్లా సైతం ఆరంభంలో తడబడినప్పటికీ.. కెప్టెన్ మహ్మదుల్లా(48 బంతుల్లో 43 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) చివరి దాకా క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతనికి ఓపెనర్ మహ్మద్ నయిమ్(35 బంతుల్లో 29; ఫోర్, సిక్స్) సహకారం అందించడంతో బంగ్లా జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో ఎజాజ్ పటేల్ 2, కోల్ మెక్ కొన్చి ఓ వికెట్ పడగొట్టారు. కెరీర్ బెస్ట్ గణాంకాలతో న్యూజిలాండ్ నడ్డి విరిచిన నసుమ్ అహ్మద్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, ఈ సిరీస్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బంగ్లా జట్టు గెలుపొందగా.. మూడో టీ20ని న్యూజిలాండ్ నెగ్గింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన చివరి మ్యాచ్ శుక్రవారం(సెప్టెంబర్ 10) ఇదే వేదికగా జరుగనుంది. చదవండి: ఆ క్రికెట్ దిగ్గజం సలహాలు నా ఆటతీరుని మెరుగుపర్చాయి.. -
బంగ్లాదేశ్ కొత్త చరిత్ర
ఢాకా: టెస్టు చరిత్రలో బంగ్లాదేశ్ తమకంటూ ఓ ఘన చరిత్రను సొంతం చేసుకుంది. చివరిదైన రెండో టెస్టులో వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 184 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పటిదాకా 112 టెస్టులాడిన బంగ్లాదేశ్ 13 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే ఇందులో ఇన్నింగ్స్ విజయం లభించడం మాత్రం ఇదే తొలిసారి. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. తద్వారా ఐదు నెలల క్రితం వెస్టిండీస్ గడ్డపై తమకెదురైన వైట్‌వాష్‌కు బదులు తీర్చుకుంది. బంగ్లాదేశ్ ఆఫ్ స్పిన్నర్ మెహదీ హసన్ మిరాజ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 12 వికెట్లు తీసుకున్నాడు. ఆదివారం ఒక్కరోజే అతను 9 వికెట్లను పడగొట్టిన తొలి బంగ్లా బౌలర్‌గా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోరు 75/5తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వెస్టిండీస్ 111 పరుగులకే కుప్పకూలింది. దీంతో బంగ్లాకు 387 పరుగుల భారీ అధిక్యం లభించింది. హెట్‌మైర్ (39; 3 ఫోర్లు, 1 సిక్స్), డౌరిచ్ (37; 3 ఫోర్లు) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. మెహదీ హసన్ (7/58) స్పిన్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తలవంచారు. తర్వాత ఫాలోఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 213 పరుగుల వద్ద ఆలౌటైంది. టాపార్డర్‌లో హోప్ (25), రోచ్ (37; 7 ఫోర్లు) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా... హెట్‌మైర్ (93; 1 ఫోర్, 9 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మెహదీ హసన్ 5, తైజుల్ ఇస్లామ్ 3 వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 508 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. -
‘డ్రా’తో ముగింపు
సియోల్: దక్షిణ కొరియా మహిళల హాకీ జట్టుతో జరిగిన చివరిదైన ఐదో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న భారత జట్టు 3–1తో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ ఖాయం చేసుకున్న రాణి రాంపాల్ బృందం నామమాత్రమైన ఐదో మ్యాచ్‌ను 1–1తో ‘డ్రా’గా ముగించింది. తొమ్మిదో ర్యాంకర్ కొరియాతో ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున వందన (48వ ని.లో), ప్రత్యర్థి జట్టు నుంచి బోమీ కిమ్ (50వ ని.లో) చెరో గోల్ చేశారు. -
విజయం పరిపూర్ణం
ఇంకేం మిగల్లేదు లంకకు... ఓడిపోయేందుకు..! మరో మ్యాచ్ లేదు భారత్‌కు... గెలిచేందుకు..! ఫార్మాట్‌కు మూడు మ్యాచ్‌ల చొప్పున ఆడిన పర్యాటక జట్టు... ఒక టెస్టు (కోల్‌కతా)లో వణికించింది. ఒక వన్డే (ధర్మశాల)లో గెలిచింది. కానీ టి20ల్లో పరిపూర్ణంగా ఓడింది. టీమిండియా చేతిలో వైట్‌వాష్ అయ్యింది. మొత్తం తొమ్మిది మ్యాచ్‌ల్లో కలిపి భారత్ ‘ఆరే’స్తే (1+2+3)... శ్రీలంక మాత్రం ఒక్కటంటే ఒక్క గెలుపుతో సరిపెట్టుకుంది. ముంబై: భారత్... సిరీస్‌ను ముందే గెలుచుకుంది. ఇపుడు చివరి మ్యాచ్‌నూ గెలిచింది. టి20 సిరీస్‌కు క్లీన్‌స్వీప్‌తో ముగింపు పలికింది. మొత్తానికి భారత్‌కు విజయవంతంగా సాగిన 2017 ఏడాది దిగ్విజయంగానే ముగిసింది. ఎందులోనూ కలిసి రాకపోవడంతో శ్రీలంక వైట్‌వాష్‌తో తిరుగుముఖం పట్టింది. ఆఖరి టి20లో బౌలర్లు సమష్టిగా రాణించడంతో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. బౌలింగ్‌లో ఉనాద్కట్ (2/15), హార్దిక్ పాండ్యా (2/25)... బ్యాటింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (32 బంతుల్లో 30; 1 ఫోర్, 1 సిక్స్), మనీశ్ పాండే (29 బంతుల్లో 32; 4 ఫోర్లు) రాణించారు. వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. గుణరత్నే (37 బంతుల్లో 36; 3 ఫోర్లు), షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు) లంక తరఫున పోరాడారు. ఉనాద్కట్, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీయగా... సుందర్, సిరాజ్, కుల్దీప్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి గెలిచింది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి ఎగబాకింది. వికెట్లు ఫటాఫట్... టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభించిన ఓపెనర్లు డిక్వెలా (1), తరంగ (11) తడబడ్డారు. అరంగేట్రంలోనే మ్యాచ్ తొలి ఓవర్ వేసిన సుందర్ 6 పరుగులిచ్చాడు. కానీ ఆ తర్వాత వరుసగా ఓవర్‌కు వికెట్ చొప్పున టాప్ ఆర్డర్ కుప్పకూలింది. రెండో ఓవర్లో డిక్వెలాను ఉనాద్కట్, మూడో ఓవర్లో కుశాల్ పెరీరా (4)ను సుందర్ పెవిలియన్ చేర్చారు. తిరిగి నాలుగో ఓవర్లో తరంగను ఉనాద్కట్ అవుట్ చేయడంతో లంక 18 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయింది. తర్వాత సమరవిక్రమ (17 బంతుల్లో 21; 3 ఫోర్లు), గుణరత్నే కాసేపు ధాటిగా ఆడుతూనే వికెట్ల పతనానికి కళ్లెం వేశారు. దీంతో ఎనిమిదో ఓవర్లో లంక ఫిఫ్టీ పూర్తయింది. పాండ్యా వేసిన అదే ఓవర్లో జోరు మీదున్న సమరవిక్రమ మిడాఫ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ తర్వాత స్కోరుబోర్డులో మరో 20 పరుగులు జతయ్యాయో లేదో భారత బౌలర్లు మరో వికెట్‌ను పడేశారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన గుణతిలక (3) డీప్ మిడ్‌వికెట్ వద్ద పాండ్యా క్యాచ్‌తో పెవిలియన్ బాటపట్టాడు. 72 పరుగుల వద్ద లంక ఐదో వికెట్‌ను కోల్పోయింది. మరో 13 పరుగుల వ్యవధిలో కెప్టెన్ తిసారా పెరీరా (11; 2 ఫోర్లు) ఆటను సిరాజ్ ముగించాడు. పడుతూ లేస్తూ సాగిన లంక స్కోరు 16వ ఓవర్లో 100కు చేరింది. కుదురుగా ఆడిన గుణరత్నేను పాండ్యా అవుట్ చేశాడు. సిరాజ్ చివరి ఓవర్లో షనక (24 బంతుల్లో 29 నాటౌట్; 2 సిక్సర్లు), ధనంజయ (11 నాటౌట్; 2 ఫోర్లు) మెరుపులు మెరిపించడంతో 18 పరుగులు వచ్చాయి. రాణించిన శ్రేయస్, పాండే... భారత్ లక్ష్యం 136. తొలి రెండు టి20ల్లో భారత్ సూపర్ హిట్ స్కోర్లకు ఇదేమాత్రం సరిపోలదు. కానీ ఆరంభంలోనే ఓపెనర్లు రాహుల్ (4), రోహిత్ శర్మ (20 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్) వికెట్లు కోల్పోవడంతో భారత్ అనవసర ఒత్తిడి కొనితెచ్చుకోవడం ఎందుకనే ధోరణిలో ఆడింది. దీంతో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ 20 (19.2)వ ఓవర్ దాకా ఆడాల్సివచ్చింది. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే అడపాదడపా బౌండరీలతో స్కోరును 81 పరుగుల దాకా తీసుకొచ్చారు. ఆ స్కోరు వద్దే పాండే బలంగా కొట్టిన షాట్ వేగంగా వెళ్లి నాన్ స్ట్రయిక్ వికెట్లను కూల్చింది. అంతకంటే ముందే ఆ బంతి బౌలర్ ధనంజయ చేతి వేళ్లను తాకడంతో క్రీజులో లేని శ్రేయస్ అనూహ్యంగా రనౌటయ్యాడు. తర్వాత పాండ్యా (4) ఇలా వచ్చి అలా వెళ్లాడు. జట్టు స్కోరు వంద పరుగులు దాటాక మనీశ్ పాండే కూడా నిష్క్రమించడంతో ధోని (10 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (12 బంతుల్లో 18 నాటౌట్; 1 సిక్స్) మరో వికెట్ చేజారకుండా మ్యాచ్‌ను ముగించారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: డిక్వెలా (సి) సిరాజ్ (బి) ఉనాద్కట్ 1; తరంగ (సి) పాండ్యా (బి) ఉనాద్కట్ 11; కుశాల్ పెరీరా (సి అండ్ బి) సుందర్ 4; సమరవిక్రమ (సి) దినేశ్ కార్తీక్ (బి) పాం డ్యా 21; గుణరత్నే (సి) కుల్దీప్ (బి) పాండ్యా 36; గుణతిలక (సి) పాండ్యా (బి) కుల్దీప్ 3; తిసారా పెరీరా (సి) రోహిత్ శర్మ (బి) సిరాజ్ 11; షనక నాటౌట్ 29; ధనంజయ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 135. వికెట్ల పతనం: 1–8, 2–14, 3–18, 4–56, 5–72, 6–85, 7–111. బౌలింగ్: సుందర్ 4–0–22–1, ఉనాద్కట్ 4–0–15–2, సిరాజ్ 4–0–45–1, హార్దిక్ పాండ్యా 4–0–25–2, కుల్దీప్ 4–0–26–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) కుశాల్ పెరీరా (బి) షనక 27; రాహుల్ ఎల్బీడబ్ల్యూ (బి) చమీర 4; శ్రేయస్ రనౌట్ 30; మనీశ్ పాండే (బి) చమీర 32; పాండ్యా (సి) డిక్వెలా (బి) షనక 4; దినేశ్ కార్తీక్ నాటౌట్ 18; ధోని నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (19.2 ఓవర్లలో 5 వికెట్లకు) 139. వికెట్ల పతనం: 1–17, 2–39, 3–81, 4–99, 5–108. బౌలింగ్: ధనంజయ 4–0–27–0, చమీర 4–0–22–2, పెరీరా 3.2–0–22–0, ప్రదీప్ 4–0–36–0, షనక 4–0–27–2. అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా... ముంబైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా... అంతర్జాతీయ టి20 క్రికెట్లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్సు టాప్–5 క్రికెటర్లలో సుందర్ తర్వాత రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు; ఇంగ్లండ్‌పై ఫిబ్రవరి 1న, 2017)... ఇషాంత్ (19 ఏళ్ల 152 రోజులు; ఆస్ట్రేలియాపై ఫిబ్రవరి 1న, 2008)... రైనా (20 ఏళ్ల నాలుగు రోజులు; దక్షిణాఫ్రికాపై డిసెంబర్1న, 2006)... రవీంద్ర జడేజా (20 ఏళ్ల 66 రోజులు; శ్రీలంకపై ఫిబ్రవరి 10న, 2009) ఉన్నారు. అన్ని ఫార్మాట్లలో కలిపి సొంతగడ్డపై గత 16 సిరీస్‌లలో భారత్‌కు పరాజయం ఎదురుకాలేదు. వాంఖడే స్టేడియంలో టి20ల్లో భారత్‌కు ఇదే తొలి విజయం. గతంలో ఆడిన రెండు మ్యాచుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక ఏడాదిలో అత్యధిక విజయాలు (37) సాధించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా అత్యధి కంగా 38 విజయాలు సాధించింది. -
సిరీస్ మనదే..
-
లంకను కొట్టేసి...సిరీస్ పట్టేసి...
విశాఖ వేదిక భారత్‌కు మళ్లీ విజయ వీచిక అయ్యింది. ముచ్చటగా మూడోసారి ఈ మైదానంలో సిరీస్ నిర్ణయాత్మక వన్డేలో టీమిండియా సింహనాదం చేసింది. తొలుత బౌలర్లు... ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ విజృంభణతో లంకను అలవోకగా కొట్టేసి భారత్ మరో సిరీస్‌ను పట్టేసింది. 2007లో ఇక్కడే లంకపై చివరి వన్డేలో నెగ్గి 2–1తో... గతేడాది న్యూజిలాండ్‌ను ఐదో వన్డేలో ఓడించి 3–2తో భారత్ సిరీస్‌లు గెలిచింది. సాక్షి, విశాఖపట్నం: 160/2... 27 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోర్ ఇది. 215 ఆలౌట్... ఇది కూడా లంక స్కోరే! కానీ 45వ ఓవర్ ఇంకా ముగియకముందే ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి 300 స్కోరు ఖాయం... మ్యాచ్ ఇక కష్టమేమో అనుకున్న దశలో మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (3/42), యజువేంద్ర చహల్ (3/46) మాయాజాలం చేశారు. క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు చేర్చారు. కొత్త బ్యాట్స్‌మెన్‌ను నిలదొక్కుకోకుండా చేశారు. తర్వాత శిఖర్ ధావన్ (85 బంతుల్లో 100 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో... శ్రేయస్ అయ్యర్ (63 బంతుల్లో 65; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. ఫలితంగా ఇక్కడి వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ బృందం 8 వికెట్ల తేడాతో జయభేరి మోగించి మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది. భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ అవార్డులు లభించాయి. మొదట శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. తరంగ (82 బంతుల్లో 95; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... సమరవిక్రమ (42) రాణించాడు. తర్వాత భారత్ 32.1 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసి గెలిచింది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ కటక్‌లో 20న మొదలవుతుంది. టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక ఆరంభంలోనే గుణతిలక (13) వికెట్‌ను కోల్పోయింది. తర్వాత తరంగ, సమరవిక్రమతో కలిసి వేగంగా పరుగులు జతచేశాడు. ఇద్దరు రెండో వికెట్‌కు 121 పరుగులు జోడించారు. ఇక భారీ స్కోరు ఖాయమనుకుంటున్న దశలో 136 స్కోరు వద్ద సమరవిక్రమ, 160 పరుగుల వద్ద తరంగ అవుట్ కావడంతో లంక దిశ మారింది. భారత స్పిన్నర్ల ధాటికి అనూహ్యంగా 55 పరుగుల వ్యవధిలో చివరి 8 వికెట్లను కోల్పోయి ఆలౌటైంది. కుల్దీప్, చహల్ మూడేసి వికెట్లు తీయగా... పాండ్యాకు రెండు, బుమ్రా, భువనేశ్వర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... ఆదిలోనే కెప్టెన్ రోహిత్ (7) వికెట్ కోల్పోయి తడబడింది. ఈ దశలో ధావన్, శ్రేయస్ అయ్యర్ లంక బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. 44 బంతుల్లో శ్రేయస్ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్‌కు ధావన్‌తో 135 పరుగులు జోడించాక శ్రేయస్ అవుటయ్యాడు. అనంతరం దినేశ్ కార్తీక్ (26 నాటౌట్; 3 ఫోర్లు) ధావన్‌కు సహకరించాడు. 84 బంతుల్లో (13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసిన ధావన్ మూడో వికెట్‌కు కార్తీక్‌తో 70 పరుగులు జోడించి 107 బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: గుణతిలక (సి) రోహిత్ శర్మ (బి) బుమ్రా 13; తరంగ (స్టంప్డ్) ధోని (బి) కుల్దీప్ 95; సమరవిక్రమ (సి) ధావన్ (బి) చహల్ 42; మాథ్యూస్ (బి) చహల్ 17; డిక్వెలా (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 8; గుణరత్నే (సి) ధోని (బి) భువనేశ్వర్ 17; తిసారా పెరీరా ఎల్బీడబ్ల్యూ (బి) చహల్ 6; సచిత్ (సి) చహల్ (బి) పాండ్యా 7; ధనంజయ (బి) కుల్దీప్ 1; లక్మల్ ఎల్బీడబ్ల్యూ (బి) పాండ్యా 1; ప్రదీప్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (44.5 ఓవర్లలో ఆలౌట్) 215. వికెట్ల పతనం: 1–15, 2–136, 3–160, 4–168, 5–189, 6–197, 7–208, 8–210, 9–211, 10–215. బౌలింగ్: భువనేశ్వర్ 6.5–0– 35–1, బుమ్రా 8–1–39–1, పాండ్యా 10–1–49–2, కుల్దీప్ 10–0– 42–3, చహల్ 10–3–46–3. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) ధనంజయ 7; ధావన్ నాటౌట్ 100; శ్రేయస్ అయ్యర్ (సి) లక్మల్ (బి) పెరీరా 65; దినేశ్ కార్తీక్ నాటౌట్ 26; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (32.1 ఓవర్లలో 2 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–14, 2–149. బౌలింగ్: లక్మల్ 5–2–20–0, ధనంజయ 7.1–0–53–1, మాథ్యూస్ 3–0–30–0, సచిత్ 4–0–33–0, ఫెర్నాండో 3–0–10–0, పెరీరా 5–0–25–1, గుణరత్నే 4–0–30–0, గుణతిలక 1–0–12–0. నాడు డకౌట్... నేడు నాటౌట్ ఏడేళ్ల క్రితం (2010లో) ధావన్ ఉక్కు నగరంలోనే వన్డే క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో అతను డకౌట్ అయ్యాడు. ఇప్పుడు లంకపై నిర్ణాయక మ్యాచ్‌లో శివమెత్తాడు. కీలకమైన ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు స్కోరు 14 పరుగులకే నిష్క్రమించగా ధావన్ ఇన్నింగ్స్ భారాన్ని కడదాకా మోశాడు. కుర్రాడు శ్రేయస్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని జోడించాడు. దినేశ్ కార్తీక్‌తో కలిసి అజేయంగా జట్టును గెలిపించాడు. ధోని కన్ను... మూడో కన్ను...! తనకెంతో కలిసొచ్చిన వైజాగ్ మైదానంలో ఈసారి ధోని రెండు వికెట్లు తీశాడు. ఇదేంటనే ఆశ్చర్యం వద్దు. ఊపు మీదున్న తరంగ సెంచరీకి చేరువైన సమయంలో కుల్దీప్ ఇన్నింగ్స్ 28వ ఓవర్ వేశాడు. తొలి బంతి తరంగను దాటేసి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లింది. అతను వాయువేగంతో వికెట్లను గిరాటేసి, అంపైర్‌కు అప్పీల్ చేశాడు. ఇదంతా లిప్తపాటు కాలంలోనే జరిగింది. సహచరులంతా అప్పీల్ చేసి ఊరుకుంటే ధోని మాత్రం పట్టుబట్టాడు. దీంతో ఫీల్డ్ అంపైర్... థర్డ్ అంపైర్‌ను సంప్రదించడం... తరంగ అవుటై వెనుదిరగడం జరిగాయి. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డిక్వెలా రెండు ఫోర్లు కొట్టాడు. బంతి దిశను మార్చేయమని కుల్దీప్కు చెప్పి తనకు సమీప దూరంలో శ్రేయస్ అయ్యర్‌ను పురమాయించాడు. ఈ ఎత్తుగడ ఫలించింది. శ్రేయస్‌కు క్యాచ్ ఇచ్చి డిక్వెలా నిష్క్రమించాడు. బౌలింగ్ కుల్దీప్దైనా... వ్యూహం ధోనిది. అతను పాలుపంచుకున్న ఈ వికెట్లు లంక దశను మార్చాయి. భారత్‌కు ఊతమిచ్చాయి. భారత్ 8 సిరీస్ విజయాలు ప్రత్యర్థి వేదిక ఏడాది వన్డేలు ఫలితం జింబాబ్వే జింబాబ్వే 2016 3 3–0 న్యూజిలాండ్ భారత్ 2016 5 3–2 ఇంగ్లండ్ భారత్ 2017 3 2–1 వెస్టిండీస్ వెస్టిండీస్ 2017 5 3–1 శ్రీలంక శ్రీలంక 2017 5 5–0 ఆస్ట్రేలియా భారత్ 2017 5 4–1 న్యూజిలాండ్ భారత్ 2017 3 2–1 శ్రీలంక భారత్ 2017 3 2–1 -
అఫ్ఘానిస్తాన్ సంచలనం
జింబాబ్వేపై 3-2తో వన్డే సిరీస్ కైవసం బులవాయో: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన అఫ్ఘానిస్తాన్ జట్టు వన్డే క్రికెట్లో సంచలనం నమోదు చేసింది. ఐసీసీ సభ్య దేశం జింబాబ్వేపై వన్డే సిరీస్ నెగ్గి కొత్త చరిత్రను సృష్టించింది. అసోసియేట్ దేశమైన అఫ్ఘాన్ శనివారం జరిగిన ఆఖరి వన్డేలో 73 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-2తో కైవసం చేసుకుంది. క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్తాన్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 245 పరుగులు చేసింది. నూర్ అలీ జద్రాన్ (54), మహ్మద్ నబీ (53), అస్గర్ (38) రాణించారు. మసకద్జా, రజా చెరో మూడు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 44.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. సీన్ విలియమ్స్ (124 బంతుల్లో 102; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసినా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం కరువైంది. దౌలత్ జద్రాన్ 4, అమిర్ హమ్జా 3 వికెట్లు పడగొట్టారు. నబీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించగా, విలియమ్స్, దౌలత్‌లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును పంచుకున్నారు. ఓ అసోసియేట్ దేశం ఐసీసీ సభ్యదేశంపై వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. -
ఓ పనైపోయింది!